AP Staff to Continue Stir as Pay Revision Talks Fail చర్చలు విఫలం.. ఏపీ ఉద్యోగుల నిరసనలు యథాతథం

Talks betweem ap ministers committee and jac leaders fail empoyees to continue stir

AP Employees, AP Pensioners, Pay Revision Commission, Employees Strike, Employees JAC, PRC G.O, AP Government, Amaravati, Andhra Pradesh employees, salaries of Andhra Pradesh employees, salaries, Andhra Pradesh, Andhra Pradesh news, Andhra Pradesh today news, Andhra Pradesh latest news, Andhra Pradesh employees PRC, prc G.O, Government of Andhra Pradesh, Amaravati, government employees, AP govt employees, Andhra Pradesh, Politics

Talks between the agitating employees and the Andhra Pradesh government on the pay revision issue ended in failure on Tuesday and later the Pay Revision Commission (PRC) Struggle Committee announced it would go ahead with the proposed agitation programme, including the indefinite strike from February 7.

మంత్రుల కమిటీలో చర్చలు విఫలం.. ఏపీ ఉద్యోగుల నిరసనలు యథాతథం

Posted: 02/01/2022 07:07 PM IST
Talks betweem ap ministers committee and jac leaders fail empoyees to continue stir

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి నేతలు ఇవాళ జరిపి సమావేశం ఫలప్రదం కాలేదని దీంతో ముందుగా ప్రకటించిన విధంగానే తమ అందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, వెంకట్రాంరెడ్డి స్పష్టం చేశారు. మంత్రుల కమిటీతో చర్చలు విఫలమైనట్టేనని.. సమావేశం అనంతరం అది జరిగిన తీరుతెన్నులపై వివరించిన వారు గతంలో చర్చలకు పిలిచి ఏంచేశారో ఇప్పుడూ అదే చేశారని విమర్శించారు. కొత్త పీఆర్సీతో నష్టపోతున్నట్టు పదేపదే చెప్పామని వివరించారు. ఇవాళ సమావేశంలోనూ పాత అంశాలపైనే మాట్లాడారని బండి శ్రీనివాసరావు తెలిపారు.

అయితే తాము చెప్పిన 3 ప్రధాన అంశాలపై తేల్చాలని స్పష్టం చేశామని చెప్పారు. ఆ మూడు అంశాల పరిష్కారం సాధ్యపడదని మంత్రుల కమిటీ స్పష్టం చేసిందని వివరించారు. దీంతో తమకు అందోళన యధాతథంగా కొనసాగించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఉద్యమ కార్యాచరణ యథావిధిగా జరుగుతుందని బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఫిబ్రవరి 3న తలపెట్టిన ఛలో విజయవాడ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసే ప్రయత్నాలు చేయవద్దని కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వానికి వత్తాసు పలికే పనులను కలెక్టర్లు మానుకోవాలని హితవు పలికారు.

ఏపీ ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం చర్చలకు పిలిచి మరోమారు అవమానించిందని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రుల కమిటీ వద్దకు వెళ్లిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాలపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ తమను అవమానించారని.. ఉద్యోగుల తరపున రెప్రజెంటేషన్ ఇవ్వడానికి నలుగురం జేఏసీ నేతలం వెళ్లామని... అయితే, తమకు ఆయన ఒక్క నిమిషం సమయాన్ని కూడా కేటాయించలేదని విమర్శించారు. మర్యాద కోసమైనా కూర్చోమని అనలేదని అన్నారు. ప్రభుత్వంలో ఉద్యోగులు భాగమని చెబుతూనే... అందుకు భిన్నంగా వ్యవహరించారని చెప్పారు. ఆర్థికశాఖ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు నిబంధనలను అతిక్రమించి వ్యవహరిస్తున్నారని సూర్యనారాయణ విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles