AP High Court asks govt. to file counter in three weeks ఉద్యోగుల వేతనాల నుంచి రికవరీ చేయొద్దు: ఏపీ హైకోర్టు ఆదేశం

Ap high court hears petition on prc gos asks govt to file counter in three weeks

AP High Court, AP High Court news, AP High Court news today, AP High Court on PRC GOs, Andhra Pradesh High Court, Andhra Pradesh employees, salaries of Andhra Pradesh employees, salaries, Andhra Pradesh, Andhra Pradesh news, Andhra Pradesh today news, Andhra Pradesh latest news, Andhra Pradesh employees PRC, Andhra Pradesh High Court, Court Hearing, prc G.O, Government of Andhra Pradesh, Amaravati, government employees, AP govt employees, Andhra Pradesh, Politics

The Andhra Pradesh High Court today has issued interim orders directing the government to pay their salaries without recovery as mentioned in the GO. The High Court directed the government to file a counterclaim as part of the inquiry and adjourned the hearing for three weeks.

ఉద్యోగుల వేతనాల నుంచి రికవరీ చేయొద్దు: ఏపీ హైకోర్టు ఆదేశం

Posted: 02/01/2022 05:26 PM IST
Ap high court hears petition on prc gos asks govt to file counter in three weeks

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను తక్షణం రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. పీఆర్సీ జీవోల ద్వారా సర్వీస్ బెనెఫిట్స్ ను తగ్గించడాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ అధికారుల జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య ఈ పిటిషన్ వేశారు. తన పిటీషన్ లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆర్థిక, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శులు, కేంద్ర ప్రభుత్వం, పే రివిజన్ కమిషన్ ను ప్రతివాదులుగా చేర్చారు.  కాగా ఈ ఫిటీషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. ఏ ఒక్క ఉద్యోగి జీతం నుంచీ రికవరీ చేయొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విచారణలో భాగంగా ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మూడు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. కాగా, జీతం పడకుండా తగ్గినట్లు మీకు ఎలా తెలుసు అని హైకోర్టు ప్రశ్నించింది. ‘సమస్య పరిష్కారం కోసం కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు సమ్మె చేయడం అంటే ధర్మాసనంపై అనవసర ఒత్తిడి కలిగించడమే.. ఉద్యోగుల సమ్మెతో సమస్య పరిష్కారం కాదు’ అని హైకోర్టు పేర్కొంది. ఉద్యోగులు అనవసర భయాందోళనలకు గురవుతున్నారని కోర్టుకు ఏజీ శ్రీరాం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక్క రూపాయి కూడా తగ్గదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles