Covid negative despite symptoms లక్షణాలు కనిపిస్తున్నా.. పరీక్షల్లో తప్పించుకుంటున్న ఒమిక్రాన్

Covid negative despite symptoms being close to infected person

rtpcr test negative, covid infected people, symptoms, omicron, omicron cases in Hyderabad, omicron cases in GHMC, omicron cases in Telangana, positivity rate in hyderabad, positivity rate in GHMC, positivity rate in Telangana, positivity rate in Medak, positivity rate in kothagudem, coronavirus, new variant, Omicron, Delta variant, DH Srinivas Rao, Night Curfew, Positivity rate, omicron cases in Hyderabad, Telangana, crime

Several people test negative for Covid-19 even after showing symptoms or when their family members have tested positive. This has raised doubts as people staying in close-knit families have tested negative for the virus in rapid or RT-PCR tests despite being close to infected people. Here's why it is happening.

లక్షణాలు కనిపిస్తున్నా.. పరీక్షల్లో తప్పించుకుంటున్న ఒమిక్రాన్

Posted: 01/27/2022 10:44 AM IST
Covid negative despite symptoms being close to infected person

తెలంగాణ రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించేంత తీవ్రంగా కరోనా కేసులు లేవని వైద్యారోగ్య శాఖ వెల్లడించినా.. కేసులు మాత్రం తీవ్రస్థాయిలోనే వున్నాయన్నది కాదనలేని వాస్తవమని వార్తులు వినిపిస్తున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసులు సంఖ్యను కేంద్ర కుటుంబఆరోగ్యశాఖ చూపిస్తున్న లెక్కలకు.. వాస్తవ పరిస్థితులకు చాలా తేడా వుంది. అయితే సాధారణ జలుబు, దగ్గులతో కూడిన ఫ్లూగానే దీనిని దేశ ప్రజలు భావిస్తూ.. కొందరు ఆసుపత్రులను ఆశ్రయిస్తుండగా, మరికొందిరు మాత్రం ఇళ్లవద్ద సంప్రదాయ వైద్యానికి పరిమితం అవుతున్నారు. దీంతో దేశంలోనే ఒమిక్రాన్ కేసులు అత్యల్ప సంక్యలోనే నమోదు అవుతున్నాయని కేంద్ర గణంకాలు తెలుపుతున్నాయి.

ఇప్పటికే కొందరు వైద్యులు తమవద్దకు వస్తున్న కేసుల్లో దాదాపుగా 90శాతం కేసులు ఒమిక్రాన్ వేరియంట్ వేనని, అయితే కేవలం 10 శాతం మాత్రమే డెల్టా వేరియంట్ కేసులని స్పష్టం చేస్తున్నారు. అయితే మరికొందరిలో మాత్రం కరోనా సోకినా వారిలో లక్షణాలు ఏమాత్రం కనిపించడం లేదు. అనుమానంతో తీరా  పరీక్షా కేంద్రానికి వెళ్లి నమూనా ఇచ్చిన తర్వాత నెగెటివ్ అని ఫలితం చెబుతుండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి చాలా మందికి ఎదురవుతోంది. దగ్గు, జలుబు, ఒంటి నొప్పుల లక్షణాలతో ఎన్నడూ లేనట్టు ఇబ్బందిగా అనిపించిన వారికి కూడా పరీక్షల్లో పాజిటివ్ రావడం లేదు.

కొన్ని రకాల పరీక్షా విధానాలు, సరైన విధానంలో పరీక్ష చేయకపోవడం, ముక్కు నుంచి ద్రవాన్ని సరిగ్గా సేకరించకపోవడం, రవాణా సమయంలో శాంపిళ్లను సరిగా నిల్వ చేయకపోవడం ఫలితాలను మారుస్తుందని పీడీ హిందుజా హాస్పిటల్ కు చెందిన వైద్యుడు భరేష్  దాదియా చెప్పారు. ‘‘కొన్ని ఒమిక్రాన్ వేరియంట్లు ఆర్టీపీసీఆర్, ముఖ్యంగా రాపిడ్ యాంటీజెన్ టెస్ట్ లో నెగెటివ్ గానే రీడ్ అవుతున్నాయి. ర్యాపిడ్ యాంటీజెన్ సెన్సిటివిటీ 50 శాతమే. వైరల్ లోడ్ కూడా తక్కువగా ఉంటోంది. సీటీ వ్యాల్యూ 35 కంటే ఎక్కువ ఉంటే దాన్ని నెగెటివ్ గా పరిగణిస్తారు. వైరల్ లోడ్ తక్కువ ఉన్న వారిలో సీటీ వ్యాల్యూ35 కంటే ఎక్కువ ఉంటోంది. దాంతో ఫలితం నెగెటివ్ అని చూపిస్తోంది’’ అని దాదియా వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles