BJP leaders arrested on their way to Gudivada క్యాసినో రగడ: బిజేపి నేతల అరెస్టు.. మండిపడ్డ నేతలు

Casino row bjp leaders arrested on their way to gudivada

BJP leaders arrest, Nandamuru police, Ungaturu checkpost, GVL on BJP leaders Arrest, Andhra Pradesh Culture, Somu Veerraju, BJP, VishnuVardhan Reddy, CM Ramesh, GVL Narasimha Rao, Casino Row, Goa style casino, Kodali Nani, Gudivada, Krishna, Andhra Pradesh, Crime

Police foiled the attempt by the BJP leaders to visit Gudivada and take part in Sankranti festival concluding celebrations on Tuesday. BJP state president Somu Veerraju and other leaders were travelling from Gannavaram towards Gudivada to visit the town. But, the police stopped the vehicles of Veerraju and others BJP leader leaders near Gannavaram and shifted them to Unguturu police station.

క్యాసినో రగడ: బిజేపి నేతల అరెస్టు.. మండిపడ్డ నేతలు

Posted: 01/25/2022 06:33 PM IST
Casino row bjp leaders arrested on their way to gudivada

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగ వేళ.. గుడివాడలోని రాష్ట్ర మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ హాలులో క్యాసినో నిర్వహించారన్న వార్తలతో ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. టీడీపీ నేతలు నిజనిర్థారణ కమిటీతో సదరు ప్రాంతంలో పర్యటించేందుకు రాగా, ఇక తాజాగా బీజేపి నేతలు గుడివాడ ప్రాంతంలో పర్యటించి సత్యాన్వేషణ చేసేందుకు బయలుదేరారు. కేసినో నిర్వహించడం, అమ్మాయిలతో అర్ధనగ్నంగా డ్యాన్సులు చేయించడం వంటి ఘటనలను నిరసిస్తూ బీజేపీ నేతలు విజయవాడ నుంచి గుడివాడకు పాదయాత్రగా బయల్దేరారు. బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు నేతృత్వంలో బీజేపి నేతలు సత్యాన్వేషణకు బయలుదేరారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.

నందమూరు వద్ద వారిని బలవంతంగా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే సోము వీర్రాజు సహా రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తదితర నేతలను కృష్ణా జిల్లా పోలీసులు నందమూరు వద్ద అడ్డుకోగా, వారు వాహనాలు దిగి కాలినడకన గుడివాడకు బయలుదేరారు. పోలీసుల వలయాన్ని చేధించుకుని బీజేపి నేతలు ఏకంగా మూడు కిలోమీటర్ల దూరం నడిచారు, కాగా, బీజేపీ నేతలను పోలీసులు కలవపాముల వద్ద మరోసారి అడ్డుకున్నారు. వారిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి ఉంగుటూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. నేతలను అడ్డుకునేందుకు పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దింపి ఉంగుటూరుకు తరలించారు.

దీనిపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడలో శాంతిభద్రతలను కారణంగా చూపుతూ తమను పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నామని, శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు తమను అడ్డుకోవడమేంటని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ అరెస్టులను బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఖండించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు ఇతర నేతలు సంక్రాంతి వేడుకల కోసం గుడివాడకు వెళ్తుండగా వారిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని జీవీఎల్ అన్నారు. రాష్ట్రంలోని కొందరు ఐపీఎస్ అధికారులు వైపీఎస్ (వైసీపీ పోలీస్ సర్వీస్) అధికారుల మాదిరి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు బీజేపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles