Buddha Venkanna Released on Bail at Midnight అర్థరాత్రి హైడ్రామా.. స్టేషన్ బెయిలుపై బుద్దా వెంకన్న రిలీజ్

Casino row arrested tdp senior leader buddha venkanna released on bail at midnight

Buddha Venkannas Arrest, Buddha Venkanna Released, Buddha Venkanna station bail, Buddha Venkanna, sankranti casino row in Andhra Pradesh, Goa style Casino in Andhra Pradesh, kodali nani Convention Hall Casino, Gudivada Casino row, Telugu desam party, TDP protest, Krishna district, Tension, TDP Nijanirdharana committee, Goa style casino, Kodali Nani, Convention Hall, Gudivada, Krishna, Andhra pradesh, Crime

Amid the continuing row over the casino organised at K. Convention Hall at Gudivada in Krishna district during Sankranti, TDP Senior Leader questioned the DGP on the action taken on the organisers. He also alleged that the DGP had also recieved his share which made him to be silent in the casino issue. These comments made Buddha venkanna lead to his arrest and got released during the late night.

క్యాసినో రగడ: అర్థరాత్రి హైడ్రామా.. స్టేషన్ బెయిలుపై బుద్దా వెంకన్న రిలీజ్

Posted: 01/25/2022 10:35 AM IST
Casino row arrested tdp senior leader buddha venkanna released on bail at midnight

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి వేళ.. పండగ వాతావరణం అలుముకునే బదులు గుడివాడలోని రాష్ట్ర మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ హాలులో క్యాసినో నిర్వహించిన రగడతో రగిలిపోతోంది. కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో నిర్వహించిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ వెళ్ల‌ినా వైసీపీ కార్యకఅడ్డుకోవడంతో ఉద్రిక్తంగా మారిన వాతావరణం నేపథ్యంలో పోలీసులు టీడీపీ నిజనిర్థారణ కమిటీ సభ్యులను అదుపులోకి తీసుకుని తరువాత విడిచిపెట్టిన విషయం తెలిసిందే. ఇక డీజీపి కార్యాలయానికి సమీపంలోనే మూడు రోజుల పాటు అడ్డుఅదుపు లేకుండా క్యాసినో నిర్వహణ సాగినా.. ఆయన ఎందుకు చర్యలు తీసుకోలేదని టీడీపీ నేతలు విమర్శలు కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసిన టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మంత్రి కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన క్యాసినో వ్యవహరంలో సంచలన అరోపణలు చేశారు. రాష్ట్ర మంత్రి కొడాలి నానితో పాటు డీజీపీ గౌతమ్ సవాంగ్ లపై ఆయన చేసిన వ్యాఖ్యలు, అరోపణలపై కదిలిన పోలీసుల శాఖ.. ఆయనను అరెస్టు చేసింది. కాగా దాదాపుగా మూడు గంటల పాటు విచారించిన తరువాత హైడ్రామా మధ్య బుద్దా వెంకన్నను అర్థరాత్రి 11.15 నిమిషాలకు స్టేషన్ బెయిలుపై విడుదల చేశారు. సోమవారం ఉదయం మీడియా సమావేశంలో మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన చేసిన నేపథ్యంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా క్యాసినో నిర్వహణపై టీడీపీ నాయకులతో కలసి మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. టీడీపీ నేతలు నోరు జారి మాట్లాడితే తప్పులుగా పరిగణించి.. అరెస్టులు చేసిన పోలీసులు.. వైసీపీ మంత్రులు నోరుజారి దిగజారుడు మాటలు మాట్లాడితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మంత్రి కొడాలి కన్వెన్షన్ సెంటర్‌లో క్యాసినో నిర్వహించినట్టు సాక్ష్యాధారాలున్నా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. డీజీపీ అంటే డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీ అని ధ్వజమెత్తారు. కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు అని, అలాంటి వారికి టికెట్లు ఇవ్వడం చంద్రబాబు తప్పని అన్నారు. నాని గత చరిత్ర గురించి అందరికీ తెలుసన్నారు. లారీల్లో, బస్సుల్లోంచి ఆయిల్ దొంగలించి అమ్ముకునే చరిత్ర కలిగిన నాని.. ఇవాళ మంత్రి అయినా తన స్థాయిని మర్చిపోకుండా అదే బాషను వినియోగిస్తున్నాడని ఎద్దేవా చేశారు.

వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గారావు ఫిర్యాదు మేరకు బుద్ధా వెంకన్నపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు వెళ్లడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తు నోటీసు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని పోలీసులను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. మూడు గంటల పాటు పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య చర్చల అనంతరం భారీ బందోబస్తు మధ్య వెంకన్నను పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాత్రి వరకు విచారించిన పోలీసులు అనంతరం విడిచిపెట్టారు. కాగా, పోలీసులు విడుదల చేసిన తరువాత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. డీజీపీ సవాంగ్.. సీఎం జగన్కు తొత్తుగా పని చేస్తున్నారని ఆరోపించారు. తన వ్యాఖ్యలు చట్టవిరుద్ధమైతే కొడాలి నాని చేసినవి చట్టబద్ధమా..? అని ప్రశ్నించారు. మంత్రి కొడాలి నాని మూడేళ్లుగా అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles