35 YouTube channels blocked for anti-India content పాకిస్తాన్ తప్పుడు ఛానెళ్లపై కొరడా జులిపించిన భారత్..

Centre orders ban on 35 pakistan based youtube channels

anurag thakur, websites blocked, youtube channel to be blocked, fake news, anti india content, Pakistan based youtube channels, Pakistan based social media accounts blocked, i and b ministry, pakistan based anti india content, online false content to be blocked

A month after it invoked new powers under the Information Technology (Intermediary Guidelines and Digital Media Ethics Code) Rules, 2021 to get 20 YouTube channels banned, the Information and Broadcasting Ministry said it has issued orders to ban 35 more channels on the online social media platform after receiving intelligence inputs against them.

పాకిస్తాన్ పై కొరడా జులిపించిన భారత్.. తప్పుడు సమాచారలకు చెక్

Posted: 01/22/2022 12:08 PM IST
Centre orders ban on 35 pakistan based youtube channels

తప్పుడు సమాచారంతో పాటు భారత్ దేశానికి వ్యతిరేకమైన కంటెంట్ కలిగిన పలు పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం కొరడా జులిపించింది. దేశానికి విరుద్ధంగా తప్పుడు, అసంబధ్దమైన సమాచారాన్ని ప్రసారం చేస్తూ.. విద్వేషాలను రెచ్చగోట్టే యత్నాలకు పాల్పడుతున్న పాకిస్తాన్ ఆధారిత యూట్యూబ్‌ ఛానెళ్లను కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ బ్లాక్‌ చేసింది. పాకిస్తాన్ కు చెందిన సుమారు 35 యూట్యూబ్ ఛానెళ్లపై ఈ మేరకు కొరడా జులిపించామని తెలిపింది. కాగా బ్లాక్‌ చేసిన ఛానెళ్ల కంటెంట్‌లో పాకిస్తాన్ తన ద్వంద బుద్దిని బయటపెట్టుకుందని.. వారి దేశానికి చెందిన సమాచారం ప్రసారం చేసే బదులు.. భారత్ కు సంబంధించిన సమాచారం ప్రసారం చేయడమేంటని ప్రశ్నించింది.

అందులోనూ ఏకంగా భారత సాయుధ బలగాలు, కాశ్మీర్, భారత్‌ విదేశీ సంబంధాలకు సంబంధించిన అంశాలను ప్రసారం చేయడమే తప్పు కాగా.. అసంబంధ్దమైన తప్పుడు కథనాలతో కూడిన అంశాలను ప్రస్తావిస్తూ ప్రసారాలు చేస్తోందని అరోపించారు. అంతేకాదు మాజీ సీడీఎస్‌ బిపిన్ రావత్ మరణం వంటి విషయాలకు సంబంధించి ఫేక్‌ ఇన్ఫర్మేషన్‌ ఉందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ  గురువారం 35 యూట్యూబ్ ఛానెల్‌లు, రెండు ట్విట్టర్ ఖాతాలు, రెండు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు, రెండు వెబ్‌సైట్లు, ఒక ఫేస్‌బుక్ ఖాతాను బ్లాక్ చేసినట్లు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ విక్రమ్ సహాయ్ శుక్రవారం తెలిపారు.

అయితే ఈ ఖాతాలన్నీ పాకిస్తాన్‌ నండి పనిచేస్తాయని, పైగా భారత్‌కి వ్యతిరేకంగా నకిలీ వార్తలను, కంటెంట్‌లను వ్యాప్తి చేయడమే ముఖ్యోద్దేశం అని పేర్కొన్నారు. అంతేకాదు బ్లాక్‌ చేసిన ఖాతాలకు సుమారు 130 కోట్ల వ్యూస్‌, దాదాపు 1.2 కోట్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారని విక్రమ్‌ సహాయ్‌ అన్నారు. ఈ మేరకు బ్లాక్‌ చేసిన ఖాతాలలో  అప్నీ దునియా నెట్‌వర్క్ 14 యూట్యూబ్ ఛానెల్‌ళ్లను నిర్వహిస్తోందని, తల్హా ఫిల్మ్స్ నెట్‌వర్క్ 13 యూట్యూబ్ ఛానెళ్లను నిర్వహిస్తున్నాయని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 2021 నిబంధన16 ప్రకారం జారీ చేసిన ఆదేశాలను ఈ ఖాతాలు ఉల్లంఘించాయని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles