మనస్సుంటే మార్గం ఉంటుందని పెద్దలు చెప్పిన సామెతను తప్పుగా అర్థం చేసుకున్నారు ఈ ముగ్గురు యువకుల ముఠా. ఏదైనా సాధించాలంటే అందుకు మార్గాలు కూడా ఉంటాయన్న పెద్దల మాటను వీరు రాత్రికి రాత్రే అక్రమమార్గంలో లక్షాధికారులు కావడానికి వినియోగించారు. ఏటీయం కేంద్రాల్లో డబ్బులు ఉంటాయని వీరికి తెలుసు. అయితే వాటిని ఎలా తెరవాలన్న విషయం మాత్రం వీరికి తెలియదు. దీంతో వాటిని రాత్రికి రాత్రే ఎలా తెరవాలో.. ఎలా దొంగలించాలో వీడియోలు చూశారు. అదేంటి ఇలాంటి వీడియోలు కూడా ఎక్కడ ఉంటాయని అంటారా.? అదేనండీ సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్ లో ఇలాంటి వీడియోలు అనేకం.
అందులోనూ వీరు ఏటీయం తెరవడం ఎలా అన్న వీడియోలు చూసి.. అలానే ఏటీఎంను బద్దలుకొట్టిన ఈ ముఠా.. రూ 23 లక్షలతో ఉడాయించిన ఘటన మహారాష్ట్రలోని పుణే జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో చోటుచేసుకుంది. జిల్లాలోని యవత్ పట్టణంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఏటీఎం దోపిడీకి సంబంధించి పక్కా సమాచారం అందడంలో ప్రధాన సూత్రధారి అజయ్ షెండె (32)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి దొపిడిలో సహకరించిన మరో ఇద్దరు నిందితులను శివాజీ గరద్, రుషికేష్ కిర్తికెలను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా ఏటీయం యంత్రాన్ని ఎలా తెరవాలన్ని విషయాన్ని ఎలా తెలుసునన్న పోలీసుల ప్రశ్నలకు వారు యూట్యూబ్ అని సమాధానం చెప్పడంలో పోలీసులు విస్మయానికి గురయ్యారు.
అజయ్ షెండె తన ఇద్దరు అనుచరులు రుషీకేష్ కిర్తికె (22), శివాజీ గరద్ (25)తో కలిసి దోపిడీకి ప్లాన్ చేశారు. అయితే ఏటీయంను ఎలా తెరవాలో తెలుసుకునేందుకు వారు యూట్యూబ్ వీడియోలను చూశారు. ఇక ఏటీయం కొల్లగోట్టడానికి కావాల్సిన పరికరాలతో పాటు స్ర్పెలను కూడా అన్ లైన్ ఈ కామర్స్ సైట్ల నుంచి తెప్పించుకున్నారు. పోలీసులు తమను గుర్తించకుండా వుండేందుకు ఏటీయం కేంద్రంలోని ప్రవేశించగానే సిసిటీవీ కెమెరాలు తమను బంధించకుండా వాటిపై స్ర్పే చేశారు. ఇక తాము వచ్చిన పని కానిచ్చేశారు. యూట్యూబ్ లో చూసిన వీడియోల ద్వారా ఏటీయం యంత్రాలను తెరచి వాటిలోంచి ఏకంగా 23 కోట్ల రూపాయలతో ఉడాయించినట్లు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.
అప్పటికే పలు ఇళ్లు, ఇతర దోంగతనాలకు పాల్పడిన అజయ్ షిండే ఈ ఏటియం కేంద్రం దొపిడికి పాల్పడ్డారని పక్క సమాచారం అందుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిండంతో విషయం బయటపడింది. యవత్ పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎంలోకి వెళ్లిన ఈ ముఠా సెక్యూరిటీ కెమెరాలను బ్లాక్ చేసి.. గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మిషన్‌ను తెరిచి డబ్బుతో పరారైంది. నిందితుడి నుంచి ఓ బైక్, రూ పది లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా కుర్కుంభ్లో ఏటీఎం పగలకొట్టడానికి ప్రయత్నించడం, వాషిమ్‌లో తాళం వేసిన ఇంటిలోకి చోరబడటం, గేట్‌గావ్ వద్ద ఏటీఎంను తెరిచి రూ. 7.67 లక్షల చోరీ, లోనికల్భోర్ ప్రాంతంలో వాహనాల చోరీలు సహా మరో నాలుగు నేరాల్లో ఈ ముఠా ప్రమేయాన్ని పోలీసులు నిర్ధారించారు.
(And get your daily news straight to your inbox)
May 21 | తెలుగు చిత్రపరిశ్రమలో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుల జాబితా పెరగడం సంతోషమే. విజయవంతమైన చిత్రాలతో ఆ జాబితాలో నిలిచిన మరో దర్శకుడు అనీల్ రావిపూడి. లో ప్రస్తుతం తలెుగు చిత్రఅనిల్ రావిపూడి దర్శకత్వంలో... Read more
May 20 | రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నదని ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తంచేస్తోంది. పాత జన్యురూపాన్ని మార్చుకొని వచ్చిన కొత్త రకం (బీఏ4) వైరస్‌కి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని టెన్షన్ పడుతుంది. ప్రస్తుతం ఈ... Read more
May 20 | ఓ వైపు వేదమంత్రోచ్ఛరణలు.. మాంగళ్యం తంతునానీనాం.. అంటూ.. వధూవరులను భార్యభర్తలుగా మార్చే పవిత్రమైన మంత్రాన్ని అందుకున్నారు అయ్యవారు. ఇంతలో ఆగండీ అన్న శబ్దం వినిపించింది. కళ్యాణమండపం ప్రధాన ద్వారం వరకు పెళ్లి వేదిక సహా..... Read more
May 20 | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ బూటకమని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చిచెప్పింది. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు లాక్కుని కాల్పులు జరిపారన్నది నమ్మశక్యంగా లేదని స్పష్టం చేసింది. నిందితులపై పోలీసులు... Read more
May 20 | రాజకీయాల్లో దూకుడుగా వెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలగాణ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ పరిమితి సంఖ్యలో పోటీ చేయబోతోందని అభిమానులకు నూతనోత్తేజం కలిగించేలా... Read more