LPG refill in 2 hours at Rs.25 extra ఇండేన్ సంస్థ నుంచి తత్కాల్ స్కీం.. రెండు గంటల్లోపు సిలిండర్

Gas cylinders easy to order service launched in this city

IOC, Indian Oil Corporation, Tatkal Seva, lpg, lakh indane, Indane Tatkal Seva, cooking gas refill, Secundrabad, Hyderabad, Telangana

National oil marketing company Indian Oil Corporation has launched Indane Tatkal Seva in the city, a facility under which it will supply cooking gas refill to single bottle connection customers within two hours of the booking on an additional payment of ₹25.

ఇండేన్ సంస్థ నుంచి తత్కాల్ స్కీం.. రెండు గంటల్లోపు సిలిండర్

Posted: 01/18/2022 01:29 PM IST
Gas cylinders easy to order service launched in this city

గ్యాస్‌ సిలిండర్‌ అయిపోయిందంటే దాదాపుగా ఇంటి పని సగం ఆగిపోతుంది. ఇంటిల్లిపాది మరో సిలిండర్‌ కోసం ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తుంది. కానీ ఇకపై ఆంత హైరానా పడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఎదురుకానున్నవారి కోసం ఇండియన్ ఆయల్ కార్పోరేషన్ (ఇండేన్ గ్యాస్‌) సరికొత్తగా తత్కాల్‌ పథకం అందుబాటులోకి తెచ్చింది. అది కూడా పైటల్‌ ప్రాజెక్టుగా మన హైదరాబాద్‌లో తొలిసారిగా ఈ పథకం అమలుచేస్తున్నారు.

ఏమిటీ తత్కాల్‌ స్కీం..?

ఇప్పటి వరకు గ్యాస్‌ సిలిండర్‌ అయిపోతే గ్యాస్‌ ఏజెన్సీ వెళ్లడం, ఆన్‌లైన్‌ బుక్‌ చేయడం లేదా ఫోన్‌లో ఐవీఆర్‌ఎస్‌ పద్దతిలో ఇంకో సిలిండర్‌ బుక్‌ చేయాల్సి వచ్చేది. ఫుల్‌ సిలిండర్‌ ఇంటికి వచ్చేందుకు కనీసం ఆరు గంటల నుంచి ఆరు రోజుల వరకు సమయం పట్టేది. సామాన్యులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలను తీర్చేందుకు తత్కాల్‌ స్కీమ్‌ అమలు చేయాలని గ్యాస్‌ ఏజెన్సీలు నిర్ణయించాయి. దేశం మొత్తం మీద 28 కోట్ల డొమెస్టిక్‌ గ్యాస్‌ కనెక‌్షన్లు ఉంటే అందులో 14 కోట్ల కనెక‌్షన్లు ఇండియన్‌ ఆయిల్‌ పరిధిలో ఉన్నాయి. దీంతో తత్కాల్‌ స్కీమ్‌ను ముందుగా ఇండియన్‌ ఆయిల్‌ పరిధిలో ఉన్న ఇంధన్‌ సిలిండర్లకు అమలు చేయనున్నారు. పైలట్‌ ప్రాజెక్టుగా హైదరాబాద్‌ నగరాన్ని ఎంపకి చేశారు. ముందుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో సికింద్రాబాద్‌ డివిజన్‌లో ఈ పైలట్‌ ప్రాజెక్టు అమలు చేస్తున్నారు.

రెగ్యులర్‌గా గ్యాస్‌ బుక్‌ చేసే ఐవీఆర్‌ఎస్‌, ఇండియన్‌ ఆయిల్‌ వెబ్‌సైట్‌, ఇండియన్‌ ఆయిల్‌ వన్‌ యాప్‌లలో తత్కాల్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి తత్కాల్‌ పద్దతిలో సిలిండర్‌ బుక్‌ చేయగానే.. సదరు ఏజెన్సీకి వెంటనే పుష్‌ మెసేజ్‌ వెళ్లిపోతుంది. వారు అక్కడి నుంచి డెలివరీ బాయ్‌కి ఆ మెసేజ్‌ని చేరవేస్తారు. ఇలా నిమిషాల వ్యవధిలోనే ఆర్డర్‌ బుక్‌ అవుతుంది.. డెలివరీకి రంగం సిద్ధమవుతుంది. సిలిండర్‌ బుక్‌ చేసిన తర్వాత 30 నిమిషాల నుంచి గరిష్టంగా 2 గంటలలోపు అందిస్తారు. అందుకు గాను గ్యాస్‌ సిలిండర్‌ ధరపై అదనంగా రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి ఒకటి నుంచి దేశవ్యాప్తంగా ప్రతీ జిల్లాలో ఒక్కో ప్రాంతంలో ఈ తత్కాల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles