తెలంగాణలోని కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో అరుదైన మొరిగే జింక (బార్కింగ్ డీర్) కనిపించింది. అడవుల్లో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాకు ఇది చిక్కింది. బార్కింగ్ డీర్‌నే ఇండియన్ మంట్‌జాక్ అని కూడా పిలుస్తారు. తోటి జంతువులు ప్రమాదంలో పడినప్పుడు ఇది కుక్కలా మొరిగి వాటిని హెచ్చరిస్తుంది. అందుకనే దీనిని మొరిగే జింక అని పిలుస్తారు. ఇవి జనావాసాలకు చాలా దూరంగా, దట్టమైన అటవీ ప్రాంతాల్లోనే నివసిస్తుంటాయి. ముఖ్యంగా దేశంలోని పశ్చిమ కనుమల్లో, హిమాలయాల సమీపంలో ఇవి కనిపిస్తుంటాయి. కాగా, 15 ఏళ్ల క్రితం నల్లమల అడవుల్లో బార్కింగ్ డీర్ కనిపించింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ దీని జాడ లేదు. ఇన్నాళ్లకు మళ్లీ ఇది కనిపించడంతో అటవీ అధికారులతోపాటు వన్యప్రాణి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగజ్‌నగర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాలు ఈ మొరిగే జింకల వీడియోలను బంధించాయి. స్వతహాగా శాఖాహారి అయిన వీటి కదలికలను కెమెరాలు రికార్డ్ చేశాయి. అధికారులు కెమెరాలలో బంధించిన వీడియోలను పరిశీలించిన క్రమంలో భారతీయ ముంట్‌జాక్ చిత్రాలను చూసి ఆశ్చర్యపోయారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో తొలిసారిగా ఇది కనిపించిందని కాగజ్‌నగర్ అటవీ విభాగం అధికారి విజయ్ కుమార్ అన్నారు. ఈ ఆవిష్కరణ అటవీ శాఖ అధికారులను ఉత్కంఠకు గురి చేసింది. "జిల్లాలోని అడవికి భారతీయ ముంట్జాక్ యొక్క తొలి వలస ఖచ్చితంగా స్వాగతించే సంకేతం. గత మూడేళ్లలో ఈ ప్రాంతంలోని వృక్షజాలం మరియు జంతుజాలాన్ని రక్షించడానికి అటవీశాఖ చేసిన నిరంతర కృషిని ఇది ప్రతిబింబిస్తుంది, ”అని పెంచికల్‌పేట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్ వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు.
ఉస్మానియా యూనివర్శిటీ జువాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ చెల్మల శ్రీనివాసులు మాట్లాడుతూ, ఈ మొరిగే జింకలను 'కాకర్' అని కూడా పిలుస్తారని తెలిపారు. ఇవి ప్రధానంగా తాజా ఆకులు, పండ్లు, పొదలను, దుంపలను తిని జీవిస్తాయని తెలిపారు. ఈ జంతువుల సాధారణ స్వభావం కొంచెం స్కిట్‌గా ఉంటుంది, ఎందుకంటే అవి పులుల నుండి మొసళ్ల వరకు అడవిలోని క్రూర మృగాలకు ఆహారంగా మారుతుంటాయి. క్రూర వన్యప్రాణాలను ఎదుర్కొన్నప్పుడు లేదా వాటిని చూసినప్పుడు అవి దాదాపు కుక్క మాదిరిగా అరుస్తాయని. వీటి అరుపులు ఏకంగా ఒక కిలోమీటరు దూరం వరకు వినిపించేంత బిగ్గరగా అరుస్తాయని తెలిపారు
ఈ ఇండియన్ ముంట్‌జాక్ జాతికి చెందిన జింకలు నిశ్శబ్దంగా, ఒంటరిగా ఉంటాయని తెలిపారు. తరచుగా మందలలో నివసించే ఇతర జింకల మాదిరిగా కాకుండా, మందకు దూరంగా విడిగా స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడతాయని తెలిపారు. అలా కాని పక్షంలో కేవలం తన సహచరుడితో ఉంటాయి లేదా ఆడ జంతువులు ఆరు నెలల వరకు ఉన్న జింకతో ఉంటాయి. వారు తమ ముఖంపై (కళ్ల క్రింద) గ్రంధుల నుండి స్రావాలతో భూభాగాన్ని గుర్తిస్తాయని అన్నారు. ఈ జిల్లాలోని అటవీ ప్రాంతాలు ఇటీవలి కాలంలో పొరుగున ఉన్న మహారాష్ట్ర నుండి పులులను ఆకర్షించడం ఆసక్తికరంగా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 13 | తన బిడ్డ అపదలో ఉన్నాడంటే ప్రతీ తల్లి గజేంద్రమోక్ష ఘట్టంలోని శ్రీమహావిష్ణువు రూపం దాల్చి అత్యంత వేగంగా ప్రతిస్పందించి రక్షిస్తుందని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తుందంటే అవసరమైతే పులితో కూడా పోట్లాడి.. తన... Read more
Aug 13 | బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంఖ ఖార్గే... Read more
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more