Mother, child miraculous escape after falling under moving train రైలు పైనుంచి వెళ్లినా.. మృత్యుంజయులుగా యువరాని, అమె బిడ్డ

Mother child escape miraculously after falling under moving train at katpadi railway station

Katpadi Railway Station, child escape, falling under moving train, Train accident in Tamil Nadu, Trains, child who accidentally fell under a moving train, Yuvarani, mother, child, miraculous escape, Viral video, Train, Katpadi junction Ernakulam Express, Pallikuppam, vellore, Tamil Nadu, video viral

A woman and her child who accidentally fell under a moving train had a miraculous escape at Katpadi Railway Station. The accident occurred when Yuvarani (37) of Pallikuppam near Katpadi came to the station with her 9 month old male child which accidentally fell onto the track.

రైలు పైనుంచి వెళ్లినా.. మృత్యుంజయులుగా యువరాని, అమె బిడ్డ

Posted: 01/12/2022 09:29 PM IST
Mother child escape miraculously after falling under moving train at katpadi railway station

ఆ యువ‌రాణి, ఆమె బిడ్డ ఇద్ద‌రూ మృత్యుంజ‌యులే. సామాజిక మాద్యమాల్లో ఈ మధ్యకాలంలో రైలు ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకుంటున్న ఘటనలు అధికంగానే కనిపిస్తున్నాయి. అయితే వారంతా కదులుతున్న రైలు ఎక్కడం, లేద దిగడం చేస్తున్న సమయాల్లో అనుకోకుండా ప్రమాదపుటంచున పడుతున్నారు. వారిని రైల్వే స్టేషన్లోని ప్రయాణికులో లేక రైల్వే రక్షణ ఫోర్స్ దళ సభ్యులో హుటాహుటిన స్పందించి కాపాడుతున్నారు. అయితే ఈ ఘటన మాత్రం అందుకు పూర్తి భిన్నం. రైల్వే స్టేషన్ చేరుకునేందుకు వస్తున్న ఓ తల్లిబిడ్డ అనుకోకుండా అదుపుతప్పి రైల్వే ట్రాకుపై పడ్డారు. అదే సమయానికి వేగంగా దూసుకొచ్చిన‌ ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ రైలు వారిపైకి వచ్చేసింది. అయినా ఆ తల్లిబిడ్డలకు ఏమీ కాకుండా మృత్యుంజయులై బయటపడ్డారు.

త‌మిళ‌నాడులోని కాట్పాడి రైల్వే జంక్ష‌న్లో 37 ఏండ్ల యువ‌రాణి, త‌న 9 నెల‌ల బిడ్డ‌తో రైలు ప‌ట్టాలు దాటేందుకు య‌త్నించింది. ఈ క్ర‌మంలో ఆమె కాలు స్లిప్ కావ‌డంతో ప‌ట్టాల‌పై ప‌డిపోయింది. అంత‌లోనే ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా ప్లాట్ ఫామ్ వ‌ద్ద‌కు దూసుకొచ్చింది. అదుపుతప్పి పడిపోయిన యువరాణి.. తన బిడ్డను కింద నుంచి తీసుకునే క్రమంలో అరుపులు, కేకలు వినిపించాయి. అయినా అమె తన బిడ్డను కింద నుంచి తీసుకునే పనిలోనే నిమగ్నమయ్యింది. తీరా బిడ్డను తన చేతుల్లోకి తీసుకునేసరికి.. ఎదురుగా రైలు కనిపించింది. అంతే అమె పైప్రాణాలు పైనుంచే పోయినంతపనైంది. వెంటనే బిడ్డను పట్టాల మధ్యలో పడేసిన అమె.. పట్టాల మధ్యలో పడుకుంది.

ఇది గమనిస్తున్న సమీపంలోని రైలు ప్రయాణికులు అరుపులు, కేకలు వేసి రైలు డ్రైవర్ ను అప్రమత్తం చేశారు. ఈలోగా రైల్వే సిబ్బంది ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌ను స‌డెన్‌గా ఆపేశారు. సమీపంలోని పల్లికుప్పం ప్రాంతానికి చెందిన యువ‌రాణి తలకు గాయం అయ్యింది. కానీ ఆమె బిడ్డ‌ మాత్రం ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకుంది. రైలు ఆగిన వెంటనే రైల్వే సిబ్బంది తల్లి, బిడ్డను పక్కకు తీశారు. అయితే రైలును గమనించడంతో షాక్ కు గురైన యువరాణి అపస్మారక స్థితిలోకి జారుకుంది. అనంత‌రం త‌ల్లీబిడ్డ‌ను చికిత్స నిమిత్తం వేలూరు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు పోలీసులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles