Booster Doses For Frontline Workers, Seniors Begins నేటి నుంచే వయోజనులకు కరోనా బూస్టర్ డోస్

Administration of precaution dose of covid vaccine to high risk population begins

COVID-19, Omicron, covaxin, Booster dose,precautionary third dose of vaccine, COVID-19 vaccine, Booster Dose in India, Covid Booster Dose, Booster Doses in India, Covid Booster Dose in India, Booster Dose News, Booster Dose Latest News, Coronavirus Booster Dose, vaccine booster dose, Omicron India cases, covid, delta variant, omicron symptoms, COVID booster dose india, booster dose above 60 years, at-risk people booster dose, Omicron symptoms, Omicron corona variant, Omicron B.1.1.529, covid new variant, covishield, covaxin, astrazeneca, covid-19 vaccination, nationwide vaccination drive, vaccination drive, covid news, corona updates

Precautionary third doses of vaccines -- announced by Prime Minister Narendra Modi last month -- will be given to health and frontline workers and immuno-compromised seniors starting today as Covid numbers spike in the country, driven by Omicron. About 5.75 crore people are eligible for the third doses in the ongoing drive -- 2.75 crore above the age of 60, 1 crore healthcare workers and 2 crore frontline workers.

దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి.. నేటి నుంచే వయోజనులకు బూస్టర్ డోస్

Posted: 01/10/2022 11:21 AM IST
Administration of precaution dose of covid vaccine to high risk population begins

సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. ఇప్పటికే ప్రపంచదేశాలన్నింటికీ వ్యాపించిన ఒమిక్రాన్.. బ్రిటెన్, అస్ట్రేలియా, ఇజ్రాయిల్, జర్మనీ, ఆస్ట్రేలియాల సహా భారతదేశంలోనూ మరణాలను నమోదు చేసుకున్నవిషయం తెలిసిందే. దేశంలో ఒక్క మరణాన్ని మాత్రమే నమోదు చేసుకుంది, అయినా భారత ప్రభుత్వం మాత్రం అప్రమత్తమైంది. రోజురోజుకు తన ప్రభావాన్ని విస్తరిస్తోన్న ఈ కొత్త మహమ్మారి వేరియంట్ నేపథ్యంలో 60 ఏళ్లు పైబడిన వృద్దులతో పాటు అనారోగ్య కారణాలతో సతమతమౌతున్నవారి అరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి ప్రికాషనరీ కరోనా వాక్సీన్ డోస్ అందిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి వృద్దులకు కరోనా బూస్టర్ వాక్సీన్ అందుబాటులోకి రానుంది. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఏకంగా 4033కి చేరింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు సోకిన ఈ వైరస్.. దేశ ఆర్థిక రాజధాని ముంబై సహా మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత దేశరాజధాని ఢిల్లీలోనే ఎక్కువ కేసులు నమోదు చేసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గణంకాలను విడుదల చేసింది. ఆ తరువాత కేరళ, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మధ్య ప్రదేశ్, అంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

ఈ క్రమంలో దేశంలోని 5.75 కోట్ల మందికి మూడవ విడతగా బూస్టర్ డోసు అందించనున్నట్లు గత నెలలో వైద్య అరోగ్యశాఖ అధికారులతో సమావేశం జరిపిన ప్రధనమంత్రి మోది..60ఏళ్లు పైబడినవారికి బూస్టర్ డోస్ ఇస్తామని ప్రకటించారు. అయితే ఇవాళ్టి నుంచి ఈ బూస్టర్ డోసును దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వున్న అరవై ఏళ్ల పైబడిన వ్యక్తులకు అందించనున్నారు. 60 ఏళ్లు పైబడిన వారు దేశవ్యాప్తంగా సుమారుగా 2.75 కోట్ల మంది ఉన్నారని, ఇక వీరితో పాటు రెండు కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు, కోటి మంది హెల్త్ వర్కర్లకు కూడా ఈ టీకాను అందించనున్నారు.

ఈ బూస్ట‌ర్ డోస్ తీసుకోవ‌డానికి ఎలాంటి ముంద‌స్తు రిజిస్ట్రేష‌న్ అవ‌స‌రం లేద‌ని కేంద్ర వైద్యారోగ్య‌శాఖ తెలిపింది. బూస్ట‌ర్ డోస్‌కు అర్హులైనవారు నేరుగా స‌మీపంలోని వ్యాక్సినేష‌న్ సెంట‌ర్‌కు వెళ్లి టీకా వేయించుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించింది. అయితే, కోమార్బిడిటీస్‌తో సంబంధం లేకుండా వృద్ధులంద‌రికీ బూస్ట‌ర్ డోస్ ఇవ్వాల‌నే విష‌యంలో ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని పేర్కొన్న‌ది. అయితే, సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత 9 నెల‌లు పూర్త‌యిన వారు మాత్ర‌మే బూస్ట‌ర్ డోస్ తీసుకోవాల‌ని సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles