India revises travel guidelines for international passengers విదేశీ ప్రయాణికులకు ఒమిక్రాన్ గైడ్ లైన్స్.. వారం రోజుల క్వారంటైన్ తప్పదు..

7 day quarantine compulsory for all international passengers arriving in india

India Travel guidelines, india, COVID-19, Coronavirus, Travel Guidelines, International travel, guidelines, omicron, new rules airport, india new covid rules, india international arrivals covid rules

The Indian government on Friday took a call to revise its travel guidelines for international passengers which includes a mandatory 7-day quarantine. The revised guidelines will come into effect from January 11 onwards. Passengers that originate or transit from 'at-risk' countries shall be informed by the airlines that they will undergo post-arrival testing, quarantine if tested negative, stringent isolation protocols if tested positive.

విదేశీ ప్రయాణికులకు ఒమిక్రాన్ గైడ్ లైన్స్.. వారం రోజుల క్వారంటైన్ తప్పదు..

Posted: 01/07/2022 08:24 PM IST
7 day quarantine compulsory for all international passengers arriving in india

క‌రోనా మహమ్మారి ప్రపంచ గమనాన్ని మార్చివేసింది. ఇప్పటికే పలు దేశాలలో మూడు, నాలుగు దశలు కూడా ఎదుర్కోన్నాయి. అయినా ఇప్పటికీ ఇంకా ప్ర‌పంచాన్ని తన వేరియంట్లతో కోవిడ్ అత‌లాకుత‌లం చేస్తోంది. దశకు దశకు మధ్య రూపాంతరం చెందుతున్న మహమ్మారి.. ఇప్పటికే ఒమిక్రాన్ తో అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు ప్రస్తుతం అమలు చేస్తోన్న మార్గదర్శకాలను సవరించింది.

ఇందులో భాగంగానే ముప్పు ఎక్కువ ఉన్న ఎట్‌ రిస్క్‌ దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి  నుంచి వచ్చే ప్రయాణికులు భారత్‌కు వచ్చిన తర్వాత తప్పనిసరిగా 7 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించింది. ఎనిమిదో రోజు కరోనా పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు జనవరి 11 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇటలీ నుంచి పంజాబ్‌ వచ్చిన ఓ ఛార్టర్డ్‌ విమానంలో 125 మంది ప్రయాణికులకు ఎయిర్‌పోర్టు పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ వచ్చిన క్రమంలో కేంద్రం తాజా మార్గదర్శకాలు అమల్లోకి తీసుకువచ్చింది.

విదేశీ ప్రయాణికులకు కేంద్రం తాజా మార్గదర్శకాలివే..

* విదేశీల నుంచి వచ్చే ప్రయాణికులు ఎయిర్‌ సువిధ పోర్టల్ లో వారి వివరాలతో కూడిన సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫాంను నింపాలి.
* ప్రయాణికులు తప్పనిసరిగా తమ ప్రయాణానికి ముందు(72 గంటలు దాటకూడదు) ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలి. నెగెటివ్‌ పత్రాన్ని అప్‌లోడ్‌ చేయాలి.
* సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫామ్‌లో పూర్తి సమాచారం ఇచ్చిన వారినే విమానంలోకి ఎక్కేందుకు అనుమతించాలి.
* ‘ముప్పు ఉన్న’ దేశాల నుంచి వచ్చే వారికి.. భారత్‌ చేరుకున్న తర్వాత కరోనా పరీక్షలు ఉంటాయన్న సమాచారాన్ని ఎయిర్‌లైన్లు ప్రయాణికులకు తెలియజేయాలి.
* ఈ పరీక్షల కోసం ప్రయాణికులు ముందుగానే ఎయిర్ సువిధ పోర్టల్‌లో బుకింగ్‌ చేసుకోవచ్చు.
* ‘ఎట్‌ రిస్క్‌’ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టు పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినప్పటికీ 7 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. 8వ రోజు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. ఆ రిపోర్ట్‌ను ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి.
* ఇక, పాజిటివ్‌ వస్తే వారు ప్రొటోకాల్స్‌ ప్రకారం ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉండాలి. వారి శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించాలి.
* ‘ఎట్‌ రిస్క్’ కాని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులక ఎయిర్‌పోర్టుల్లో రాండమ్‌ పరీక్షలు చేయాలి.
* ‘వీరిలో నెగెటివ్‌ వచ్చిన ప్రయాణికులు కూడా 7 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. ఎనిమిదో రోజు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలి. వీరు కూడా తమ రిపోర్ట్‌ను ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి.
* ఒక వేళ పాజిటివ్‌ వస్తే.. వీరి శాంపిల్స్‌ను కూడా జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles