Indian-Origin Man Alleges Covid Testing A "Scam" ఇక్కడి కోవిడ్ పరీక్షంతా పెద్ద స్కామ్: భారత సంతత వ్యక్తి అగ్రహం

Indian origin man alleges mumbai airport covid testing a scam

Passenger covid positive, Manoj Ladwa, Indian-origin man, UK national, London's Heathrow airport, Facebook, Rapid RT-PCR test, Brihanmumbai Municipal Corporation, Mid flight Covid, Rapid Covid test, Covid Positive On Plane, Covid Positive On Flight, Mumbai airport, Covid testing airport Covid Cases, COVID-19 US

An Indian-origin man, a UK national, has alleged that the test and quarantine protocol at the Mumbai airport is a "scam" to mint money. Manoj Ladwa and his wife arrived in Mumbai on December 30 to attend his father-in-law's funeral. He tested positive for Covid at the airport test centre.

ఇక్కడి కోవిడ్ పరీక్షంతా పెద్ద స్కామ్: భారత సంతత వ్యక్తి అగ్రహం

Posted: 01/03/2022 03:49 PM IST
Indian origin man alleges mumbai airport covid testing a scam

లండన్ కు చెందిన భారత సంతతికి చెందిన వ్యక్తికి ముంబై ఎయిర్ పోర్టులోని కోవిడ్ పరీక్షంతా పెద్ద స్కామ్ ను తలపించింది. ఇలా ఎందుకు జరిగిందంటే ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కోవిడ్ బారిన పడ్డాడని నివేదక స్పష్టం చేయడంతో ఆయన విస్మయం వ్యక్తం చేశారు. కొన్ని గంటల వ్యవధిలో తాను కరోనా బారిన ఎలా పడతానని ఆయన ప్రశ్నించారు. అంతటితో ఆగని ఆయన భారత్‌లో నిర్వహిస్తున్న కరోనా టెస్టులపై చేసిన ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఎదురైన అనుభవం దృష్ట్యా..  కరోనా టెస్టులు, ఐసోలేషన్‌లో ఉంచడం.. ఇదంతా పెద్ద స్కామ్‌ అంటూ వీడియోలో వ్యాఖ్యానించాడా వ్యక్తి. ప్రస్తుతం ఈ వీడియో ఫేస్‌బుక్‌ ద్వారా వైరల్‌ అవుతోంది.

మనోజ్‌ లాద్వా యూకేలో సెటిల్‌ అయిన వ్యక్తి.  తన మామ అంత్యక్రియల కోసం భార్యతో పాటు లండన్‌ ‘హీథ్రో ఎయిర్‌పోర్ట్‌’ నుంచి విమానంలో వచ్చాడు.  విమానం ఎక్కే ముందు ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. డిసెంబర్‌ 30న వర్జిన్‌ అట్లాంటిక్‌ ఫ్లయిట్‌లో ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు. అక్కడ ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అనుమానం వ్యక్తం చేసిన అయిన.. మరోసారి పరీక్ష నిర్వహించాలని ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందిని కోరారు. అయితే అందుకు నిరాకరించిన సిబ్బంది.. ఆయన్ని ప్రభుత్వం నిర్వహించే ఓ క్వారంటైన్‌ సెంటర్‌కు షిఫ్ట్‌ చేశారు. దీంతో ఆయన అంత్యక్రియలకు హాజరుకాలేకపోయాడు.

ఈ అనుభవంపై ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను అప్‌లోడ్‌ చేశాడు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అంతా మాయగా ఉంది. విమానంలో గట్టిగా పదిహేను మంది కంటే ఎక్కువమంది లేం. దిగగానే.. అదీ గంటల వ్యవధిలో పాజిటివ్‌ ఎలా నిర్ధారణ అవుతుంది? లండన్‌ ఎయిర్‌పోర్టులు రిపోర్టులు చూపించినా నమ్మకపోతే ఎలా? ఇండిపెండెంట్‌ పరీక్షలకు అంగీకరించకపోవడంలో ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదు. ఇదో పెద్ద కుంభకోణంలా ఉంది అంటూ ఆరోపించాడాయన.

నాతో పాటు మరికొందరు ప్రయాణికులు గట్టిగా సిబ్బందిని నిలదీశాం.ఇక్కడి మార్గదర్శకాలు ఇష్టం లేకపోతే.. బయట డబ్బులు కట్టి అయినా క్వారంటైన్‌ సెంటర్‌లో ఉండాలంటూ బీఎంసీ అధికారులు బెదిరిస్తున్నారు’’ అంటూ  మనోజ్‌ లాద్వా ఆరోపించారు. ఇదిలా ఉంటే లాద్వా వీడియో తీసిన టైంలో.. వెనకాల మరికొంతమంది ప్రయాణికులు సెంటర్‌ నిర్వాహకులతో గొడవ పడుతున్నట్లు వాయిస్‌ వినిపించింది. అయితే ఎయిపోర్ట్‌ సిబ్బంది మాత్రం తాము అంతా పక్కాగా రూల్స్‌ ప్రకారమే ముందుకు పోతున్నట్లు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles