Hike in GST on textiles unanimously deferred దుస్తులు తప్ప.. మిగతా వాటిపై జీఎస్టీ పెంపు యధాతధం

Gst council decides to defer hike on textiles from 5 to 12 says nirmala sitharaman

GST rate news, GST Council Meeting, gst council meeting, congress, gst council meeting, goods and services tax, Nirmala Sitharaman, FM Nirmala Sitharaman, interest,Textiles, textile industry footwear industry, GST rate on footwear, GST Council, Finance Minister, Nirmala Sitharaman, textile rate, covid medicines, GST rates, Footware, Transport, Auto Travel, National Politics

The goods and services tax (GST) Council meeting, chaired by Finance Minister Nirmala Sitharaman, today decided that the rate hike on textiles from five per cent to 12 per cent will be deferred, amid objections from states and the industry.

దుస్తులపై మాత్రమే జీఎస్టీ పెంపు మినహాయింపు.. మిగతావన్నీ సేమ్ టు సేమ్..

Posted: 12/31/2021 03:14 PM IST
Gst council decides to defer hike on textiles from 5 to 12 says nirmala sitharaman

దుస్తులు, చెప్పుల‌పై వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) పెంచుతూ, ఇక ఆటో ప్రయణాలపై కూడా జీఎస్టీని విధిస్తూ.. కరోనా కష్టకాలం దాటి బతుకు జీవుడా అంటూ అంగలార్చుతూ బతికివున్న పేద, మధ్యతరగతి వర్గాలపై మరోమారు పన్నుపోటుతో కేంద్రం కొరడా ఝళిపించింది. అయితే దుస్తులపై ప్రస్తుతం విధిస్తున్న 5శాతం జీఎస్టీని మాత్రం యధాతధంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వినతులు, వ్యాపారుల నుంచి వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో కేంద్రం ఎట్టకేలకు వెనక్కు తగ్గక తప్పలేదు. దుస్తుల విషయంలో వచ్చేఏడాది ఫిబ్రవరిలో జరిగే జీఎస్​స్టీ మండలి 47సమావేశంలో మరోసారి చర్చించి తుదినిర్ణయం తీసుకోనున్నారు.  

ఈలోగా అన్నిరాష్ట్రాల అర్థికమంత్రుల నుంచి నివేదికలను తీసుకుని దానిపై పరిశీలించిన తరువాత.. దుస్తులపై జీఎస్టీ పెంపును విధించాలా.? అన్నదానిపై తుదినిర్ణయానికి రానున్నారు. దుస్తులు, చెప్పులపై 5 శాతంగా ఉన్న జీఎస్టీని 12 శాతానికి పెంచునున్నామని కేంద్రం ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. గత సెప్టెంబర్ లో జరిగిన జీఎస్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే పెంచిన జీఎస్టీ 2022, జనవరి 1 నుంచి వర్తించనున్నట్లు తెలిపింది. అయితే ఇవాళ అత్యవసరంగా సమావేశమైన జీఎస్టీ కమిటీ దుస్తులపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది.  

అయితే దీనిపై చేనేత కార్మికులు, వ్యాపారుల నుంచి తీవ్రఅభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కేంద్రం నిర్ణయంతో వేలాది మగ్గాలు మూలనపడటంతో పాటు లక్షలమంది నిరుద్యోగులుగా మారుతారని పలు రాష్ట్రాల నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రేట్లు పెంచడంవల్ల చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుంద‌ని ఆందోళ‌న వెలిబుచ్చాయి. దీంతో వెన‌క్కి త‌గ్గిన కేంద్రం దుస్తులపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన​ నిర్వహించిన జీఎస్టీ మండలి 46వ‌ అత్యవసర సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.

కాగా, ఆన్‌లైన్, ఈ–కామర్స్‌ ఫ్లాట్ ఫామ్‌ల ద్వారా పొందే సేవలపై కూడా జీఎస్టీ చెల్లించాల్సిందే. స్విగ్గీ, జొమోటో, ఫ్లిప్ కార్ట్, అమెజాన్, మింత్రా లాంటి ఈ కామర్స్ సైట్లతో పాటు ఫుడ్ డెలివరీ యాప్ ల ద్వారా పొందే సేవల పైనా టాక్సు చెల్లించాల్సిందే.. ఇక దీంతో పాటు ట్రాన్స్‌పోర్టు రంగంలో ఉన్న ఓలా, ఊబెర్‌ సంస్థలు అందించే సేవల పైనా 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే. ఓ వైపు వంటింట్లో గ్యాస్ ధరతో మంటపెట్టిన కేంద్రం.. మరోవైపు ఇంధన ధరలను గణనీయంగా పెంచింది. సామాన్య మద్యతరగతి ప్రజలను టార్గెట్ చేసిన కేంద్రం.. వారిని పన్నుల పేరుతో నిలువుదోపిడి చేస్తోందన్ని విమర్శలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles