molnupiravir the anti-viral drug mechanism of action కరోనా అర్ఎన్ఏపై కనికట్టు చేసి ఓరల్ డ్రగ్ ’మోల్నుఫిరవిర్’

Know about molnupiravir the covid pill that gets dgci nod

What to know about molnupiravir, the anti-viral COVID pill, Molnupiravir, anti-viral drug Molnupiravir, Molnupiravir anti-viral drug, molnupiravir, anti-viral drug, RNA of covid-19, Coronavirus, Covid-19

Molnupiravir is designed to interfere with viral RNA production only, but the FDA advisory committee noted the theoretical possibility that molnupiravir could be taken up and incorporated into our DNA as a mutation.

కరోనా అర్ఎన్ఏపై కనికట్టు చేసి ఓరల్ డ్రగ్ ’మోల్నుఫిరవిర్’

Posted: 12/29/2021 05:46 PM IST
Know about molnupiravir the covid pill that gets dgci nod

దేశంలో కరోనా మహమ్మారిపై యుద్దాన్ని ప్రకటించిన కేంద్రం.. కోవిడ్ బారినపడిన రోగులు అసుపత్రి పాలుకాకుండా ఉండాలన్న లక్ష్యంతో యాంటీ వైరల్ ఓరల్ డ్రగ్ మోల్నుపిరవీర్ ను అత్యవసర వినియోగించే ఔషదం కింద అనుమతినిచ్చింది. వైరస్ ను ఇది సంపూర్ణంగా హరించే దివ్యౌషధం కాకపోయినా.. ఆశాజనక ఫలితాలు ఇస్తున్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వైరస్‌ ఆర్‌ఎన్‌ఏను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్న ఈ డ్రగ్.. రోగిలో వైరల్‌ లోడ్‌ గణనీయంగా తగ్గించి.. త్వరగా కోలుకొనేలా చేస్తుండటంతో దీనికి అమోదముద్ర లభించింది.

నోటి ద్వారా రోగి జీవక్రియలోకి చేరే ఈ డ్రగ్.. మెటబాలిజం కారణంగా సచేతనమై రక్తం ద్వారా శరీర కణాల్లోకి చేరుతుంది. ఈ క్రమంలో ‘ఆర్‌ఎన్‌ఏ’(వైరస్‌ జన్యువులు) జన్యు పదార్థం వంటి నిర్మాణాలను తయారు చేస్తుంది. తొలిదశలో వైరస్‌ పునరుత్పత్తి చేసే ఆర్‌ఎన్‌ఏ పాలిమరైజ్‌ వ్యవస్థలోకి చొరబడుతుంది. ఇక్కడ వైరస్‌ ఆర్‌ఎన్‌ఏకు అవసరమైన న్యూక్లియోసైడ్లతో మోల్నుపిరవిర్‌ తయారు చేసిన న్యూక్లియోసైడ్ల వంటి నిర్మాణాలు కలిసిపోతాయి. ఫలితంగా వైరల్‌ ఆర్‌ఎన్‌ఏ పలు మార్పులకు (మ్యూటేషన్ల) గురవుతుంది. ఆ తర్వాత పుట్టుకొచ్చే కొత్త వైరస్‌లో విపరీతమైన జన్యు లోపాలు ఉంటాయి. ఫలితంగా ఇది పునరుత్పత్తి చేయలేని స్థితిలోకి చేరడంతో రోగులు కోలుకుంటారు.

ఇక అమెరికాలో నిర్వహించిన పరిశోధనల్లో ఈ ఔషధం డెల్టా వేరియంట్‌ వంటి మ్యూటేషన్లపై సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది. ఇక మరణాల నుంచిరక్షించడంలోనూ కొంతవరకు ఫలప్రదంగా మారింది. మోల్నుపిరవిర్ కు అమెరికా ఎఫ్‌డీఏ అనుమతులు ఇవ్వడం రోగులకు పెద్ద ఊరటగా పేర్కోనవచ్చు. ఎందుకుంటే.. అమెరికా ఎఫ్‌డీఏ సంస్థ నుంచి లభించే అనుమతులే ప్రపంచ వ్యాప్తంగా ఔషధాలకు కీలకం. అలాంటి ఎఫ్‌డీఏ అనుమతులు మోల్నుపిరావిర్ కు కూడా లభించడం.. కరోనా రోగులకు కొంతవరకు ఉపశమనం లభించినట్టే. ఇక దీనిని ఏ మాత్రం అలస్యం లేకుండా భారత సర్కార్ కూడా అనుమతించింది.

కొవిడ్‌ లక్షణాలు కనిపించిన ఐదు రోజుల్లోపు మోల్నుపిరవిర్‌ వాడకం మొదలుపెట్టాలి. ఈ లక్షణాల్లో దగ్గు, తలనొప్పి, జ్వరం, రుచి-వాసన పోవడం, ఒళ్లు నొప్పులు వంటివి ఉన్నాయి. ‘లక్షణాలు కనిపించిన వెంటనే కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలి.. కరోనా పాజిటివ్ అని తేలిన వెంటనే ఈ యాంటీ వైరల్ డ్రగ్ ను తీసుకోవాలి. ప్రతి 12 గంటలకు నాలుగు 200 ఎంజీ మాత్ర చొప్పున ఐదు రోజులపాటు ఈ మాత్రలు వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంటే పూర్తి కోర్సు ముగించేందుకు మొత్తంగా 40 మాత్రలు అవసరం పడతాయి. భారత్‌లో మొత్తంగా 13 సంస్థలు ఈ డ్రగ్ ను తయారు చేస్తుండటంతో ఈ ఔషధానికి కొరత రాకపోవచ్చు. వాటిలో డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా, నాట్కో, హెటిరో వంటి సంస్థలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles