Stalker stabs school girl for opposing molestation బిహార్ బాలికపై కత్తిపోట్లతో విరుచుకుపడ్డ ఉన్మాది.!

Class 8 girl in bihar stabbed 8 times in 13 seconds for resisting molestation

gopalganj, gopalganj girl stabbed, gopalganj molestation case, Bihar Police, Crimes Against Women, molestation, murder attempt, School student, Bihar

A class 8 student in Bihar's Gopalganj district was stabbed multiple times by her alleged stalker after she resisted molestation attempts by him. The incident took place on December 19 in Bihar’s Gopalganj district. The report stated that the girl was returning home from school with her two friends. gopalganj, gopalganj girl stabbed, gopalganj molestation case, Bihar Police, Crimes Against Women, molestation, murder attempt, School student, Bihar

ITEMVIDEOS: అత్యాచారాన్ని ప్రతిఘటించిన బాలికపై 13 నిమిషాల్లో 8 కత్తిపోట్లు

Posted: 12/23/2021 04:55 PM IST
Class 8 girl in bihar stabbed 8 times in 13 seconds for resisting molestation

బిహార్ లో దారుణం జరిగింది. ఉన్మాది చేతిలో కొన్ని నిమిషాల వ్యవధిలోనే బాలిక ఎనమిది కత్తిపోట్లు తినింది. నడిరోడ్డులో అందరూ చూస్తుండగానే ఈ దారుణ ఘాతుకానికి ఉన్మాది ప్రవర్తించాడు. అంతటితో ఆగని ఉన్మాది.. బాలిక ఆర్తనాథాలకు స్థానికులు స్పందించి అమెను కాపాడేందుకు రాగా, వారి ఎదుటే మరోమారు కత్తితో దాడికి యత్నించాడు. ఉన్మాది చేతిలో లైంగిక వేధింపుల‌ను ప్ర‌తిఘ‌టించినందునే ఈ దాడులకు పాల్పడ్డాడు. స్థానిక పాఠశాలలో ఎనిమిద‌వ త‌ర‌గ‌తి చ‌దివుతున్న బాలిక తన స్నేహితురాళ్లతో కలసి వస్తుండగా అమెపై లైంగిక దాడికి యత్నించాడు.. బాలిక ప్రతిఘటించడంతో అమెపై క‌త్తిపోట్ల‌తో విరుచుకుప‌డ్డాడు.

బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. జిల్లాలోని మన్ ఝాఘర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని ప్రతాప్ పూర్ గ్రామంలో ఈ నెల 19న జ‌రిగిన ఈ దారుణ ఘ‌ట‌న జరగ్గా ఆల‌స్యంగా వెలుగుచూసింది. అష్రాప్ అలి అనే వ్యక్తి కుమారుడు ఈ దారుణఘటనకు పాల్పడినట్టు స్థానికులు తెలిపారు. ఇందుకు సంబంధించిన సిసిటీవీ ఫూటేజీ వెలుగుచూడటంతో దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఉన్మాదిలా మారిన బాలుడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఫూటేజీ ప్రకారం ద్ద‌రు స్నేహితుల‌తో క‌లిసి బాలిక స్కూల్ నుంచి ఇంటికి వ‌స్తుండ‌గా మాటు వేసిన నిందితుడు క‌త్తితో బాలిక‌పై దాడి చేశాడు.

13 సెకండ్లలో ఎనిమిది సార్లు క‌త్తితో విచ‌క్ష‌ణార‌హితంగా పొడిచాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో నిందితుడిని ఓ వ్య‌క్తి లాగివేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా అత‌డు బాలిక‌పై క‌త్తిపోట్ల‌కు గురిచేయ‌డం క‌నిపించింది. బాలిక‌ను గోపాల్‌గంజ్ లోని స‌ద‌ర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా ఆపై మెరుగైన వైద్యం కోసం ప‌ట్నా మెడిక‌ల్ కాలేజ్ ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు గ‌తంలోనూ బాలిక స్కూల్‌కు వెళుతూ, వచ్చే స‌మ‌యాల్లో వేధిస్తుండేవాడ‌ని బాధితురాలి త‌ల్లితండ్రులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles