Tension prevails on Ramateertham hill of Vizianagaram రామతీర్థం వద్ద ఉద్రిక్తత.. అశోక గజపతిరాజుకు పరాభం..

Tension prevails between ashok gajapathi raju and ap officials in ramatheertham

Tension Prevails in vizianagaram, Tension Prevails at Bodikonda, Tension Prevails at Ramatheertham, Tension Prevails at Kodandarama swamy Temple, KodandaRama Temple, Ashok Gajapathi Raju, Ramatheertham, YSRCP cadre, Dharmakartha, bodikonda, vizianagaram, andhra pradesh, crime

Tensions are high on Bodikonda in Ramatirtham in Vizianagram district of Andhra Pradesh. The foundation stone will be laid today for the reconstruction of the Ramatheertham temple on Bodikonda. However, the temple trustee and former Union Minister Pusapati Ashok Gajapathi Raju was outraged that the state govt has not discussed with the temple trustees regarding the foundation stone laying ceremony for the reconstruction of the temple.

రామతీర్థం వద్ద ఉద్రిక్తత.. అశోక గజపతిరాజుకు పరాభం..

Posted: 12/22/2021 04:43 PM IST
Tension prevails between ashok gajapathi raju and ap officials in ramatheertham

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు ప్రభుత్వ దేవాదాయశాఖ అధికారులకు.. అటు రామతీర్థం దేవాలయ అనువంశిక ధర్మకర్త మండలి చైర్మన్ మధ్య తోసివేతకు కారణమైంది. కేంద్ర మాజీ మంత్రి, ధర్మకర్తల మండలి చైర్మన్ అశోక్ గ‌జ‌ప‌తి రాజును ప్రభుత్వ అధికారులు తోసివేయడంతో ఆయనకు పరాభవం ఎదురైంది. అనువంశిక ధర్మకర్తల మండలి చైర్మన్ గా కొనసాగుతున్న ఆయన పరిధలోని దాదాపు 105 ఆలయాలు వున్నాయి. అయితే వాటిలోని రామతీర్థంలో కొలువైన కోదండరామ దేవాలయం పునర్నిర్మాణానికి శంఖుస్థాపన సందర్భంగా ఆయనకు పరాభవం ఎదురైంది.

రామతీర్థం బోడికొండపై ఇవాళ కోదండరామ ఆలయ నిర్మాణ శంకుస్థాప‌న కోసం.. దేవాదాయశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం తరపున శిలాఫలకాలను తీసుకువచ్చి ఏర్పాటు చేస్తుండగా  వచ్చిన అశోక్ గజపతి రాజు దానిని నిలిపివేయాలని అదేశించారు. శంకుస్థాపన అంశంపై ధ‌ర్మ‌క‌ర్త‌ల మండలి ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త‌గా ఉనన్ తనకు ఎలాంటి సమాచారం లేకుండా.. త‌న‌తో చ‌ర్చించకుండా ఇలా శిలాఫలకాలు ఏర్పాటు చేయడమేంటంటూ అశోక్ గ‌జ‌ప‌తి రాజు ఆక్షేపించారు. ఆల‌య అధికారులు వైసీపీ స‌ర్కారు త‌ర‌ఫున శంకుస్థాప‌న ఫ‌లకాల‌ను ఎందుకు ఏర్పాటు చేశారంటూ వాటిని అశోక్ గ‌జ‌ప‌తి రాజు తోసివేసి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ నేప‌థ్యంలోనే అధికారులకు, ఆయ‌న‌కు మధ్య తోపులాట చోటు చేసుకుంది. శిలాఫలాకాన్ని ఆయన కింద పెడుతుండగా, అధికారులు త‌న‌ను వెన‌క్కు తోసేస్తున్నార‌ని అశోక్ గజపతి చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన.. ‘‘ఈ ఆలయాలకు ధర్మకర్తను నేను.. తనకు తెలియకుండా ఈ త‌మాషా ఎందుకు చేస్తున్నార‌ు’’ అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇది ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మం కాద‌ని, ఒకవేళ స‌ర్కారు కార్య‌క్ర‌మ‌మైతే తాను ఇక్క‌డ ఉండేవాడిని కాద‌ని చెప్పారు. గ‌తంలోనూ త‌న ప‌ట్ల ఇదే రీతిలో వ్య‌వ‌హ‌రించార‌ని అన్నారు. ఆల‌య మ‌ర్యాద‌ల‌ను ఎందుకు పాటించ‌డం లేదంటూ ఆగ్ర‌హంతో ఊగిపోయారు. అధికారులు, పోలీసులు ఆయ‌న‌ను స‌ముదాయించేందుకు ప్ర‌య‌త్నించినా ఆయ‌న వినిపించుకోలేదు.

ఆల‌య ప్రాంగ‌ణంలో త‌మాషాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఆల‌యం వ‌ద్ద కూడా రాజ‌కీయాలు చేయ‌డం ఏంట‌ని ఆయ‌న నిల‌దీశారు. ఏడాది కాలంలో ఆలయాన్ని పునర్ నిర్మిస్తామని చెప్పి ప్రగల్బాలు పలికిన ప్రభుత్వం.. ఏడాది కావస్తున్నా ఇంకా శంఖుస్థాపనలు మాత్రమే చేస్తోందని.. ఆలయ నిర్మాణం కన్నా వీరికి శిలాఫలకాలు, వాటిపై పేర్ల పైనే ఎక్కువ ద్యాస ఉందని విమర్శించారు. ఈ రామతీర్థం ప్రాంతంలో ఏం చేయాలన్న ఆలయ ధర్మకర్త అనుమతి లేకుండా ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం త‌ర‌ఫున మంత్రులు పుష్ప శ్రీ‌వాణి, వెల్లంప‌ల్లి పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles