Nine dead in Dominican Republic plane crash విమాన ప్రమాదంలో సంగీత నిర్మాత కుటుంబ మృతి..

Latin music artist partner son among 9 dead in plane crash at airport

dominican republic plane crash, Santo Domingo, Puerto Rican music producer, "Flow La Movie", Music producer Jose Angel Hernandez, private plane crash, aircraft's owner Helidosa, Las Americas airport, plane crash news

Nine people, including Puerto Rican music producer "Flow La Movie" died when a private plane crashed at the Las Americas airport in the Dominican Republic capital Santo Domingo, the aircraft's owner Helidosa said. Helidosa "regrets the tragic accident on one of its planes at Las Americas airport... in which tragically all of the crew and passengers died," the company said in a statement.

విమాన ప్రమాదంలో సంగీత నిర్మాత కుటుంబ మృతి..

Posted: 12/16/2021 10:56 AM IST
Latin music artist partner son among 9 dead in plane crash at airport

కరేబియన్‌ దీవుల్లోని డొమినికన్‌ రిపబ్లిక్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రముఖ సంగీత నిర్మాత దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటుగా తొమ్మిది మంది దుర్మరణం చెందారు. ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో కూడిన ఓ ప్రైవేటు విమానం డొమినికన్ లోని లా ఇసబెల్లా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లోరిడా వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. విమానాశ్రయం నుంచి జెట్ విమానం టెకాఫ్‌ అయిన 15 నిమిషాలకే రాజధాని శాంటో డొమింగోలో ఉన్న లాస్‌ అమెరికాస్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా లాండ్‌ అయింది.

ఈ క్రమంలో విమానం ల్యాండ్ అవుతూనే పేలిపోయింది. ఈ దర్ఘుటనలో తొమ్మిది మంది మరణించారని విమానయాన సంస్థ వెల్లడించింది. ఈ ఘటనలో లాటిన్ మ్యూజిక్ ప్రోడ్యూసర్ కుటుంబం మరణించిందని తెలిపారు. ప్యూర్టోరికోకు చెందిన మ్యూజిక్ ప్రొడ్యూసర్ జోస్ ఏంజల్ హెర్నాన్డెజ్ అలియాస్ ఫ్లో లా మూవీ మరణించారు. కుటుంబంతో పాటుగా ఆయన క్రిస్టమస్ హాలీడేస్ సందర్భంగా సరదాగా పర్యటనకు వెళ్లి కుటుంబంతో పాటుగా విమాన ప్రమాదంలో మరణించారు. ఆయనతో పాటు ఆయన భార్య (31), వారి నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నారు. ఈ చిన్నారితో పాటు మరో విమానంలో 13ఏళ్ల చిన్నారి కూడా దుర్ఘటనలో మరణించాడని విమాన సంస్థ యాజమాన్యం హెలిడోసా ఏవియేషన్ గ్రూప్ తెలిపింది.

ఈ దర్ఘుటనలో మొత్తంగా ఆరుగురు అమెరికన్ పర్యాటకులు మరణించారని పేర్కోన్న విమాన సంస్థ.. ఇద్దరు విమాన సిబ్బందితో పాటు ఒక స్టీవార్డ్ కూడా ఉన్నారని ప్రకటనలో తెలిపింది. ఈ ఘటన నేపథ్యంలో లాస్ అమెరికా విమానాశ్రయంలో దాదాపు రెండు గంటల వరకు విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా సంగీత నిర్మాతకు సహచర  సంగీత ప్రముఖులు, సహచరులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంగీత నిర్మాత జోస్ ఏంజల్ హెర్నాన్డెజ్ కుదర్చిన బాణీలను వింటూ పలువురు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనూహ్య ఘటన పట్ల ఆయనత అభిమనాులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles