Horse carriage with groom inside catches fire వరుడి పెళ్లి ఊరేగింపులో అపశృతి.. మంటల్లో గుర్రపు బగ్గీ..

Horse carriage with groom inside catches fire during wedding procession

Horse carriage, groom, horse carriage catches fire, wedding procession, viral stories, trending stories, Gujarat, viral video

A groom on the way to his wedding, had a narrow escape after the horse carriage he was riding caught fire. Fortunately, no injuries were reported in the incident, which took place in Gujarat's Panchmahal district

ITEMVIDEOS: వరుడి పెళ్లి ఊరేగింపులో అపశృతి.. మంటల్లో గుర్రపు బగ్గీ..

Posted: 12/15/2021 06:27 PM IST
Horse carriage with groom inside catches fire during wedding procession

సామాజిక మాధ్యమాల్లో ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. వరుడు వధువును ఇంప్రెస్ చేయడమో, లేక వధువు వరుడిని ఇంప్రెస్ చేయడమో లేక ఇద్దరూ కలసి అతిధులను ఆశ్చర్యపర్చడమో చేసే వీడియోలు ఈ మధ్యకాలంలో బాగానే వైరల్ అవుతున్నాయి. అయితే ఇలా అనే తీసిన ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలోమాత్రం పెళ్లి ఊరేగింపులో విషాదం చోటుచేసుకున్నది. పెళ్లి మండపానికి బంధుజన సమేతంగా తరలివస్తున్న వరుడి గుర్రపు భగ్గీ మంటల్లో చిక్కుకున్నది. ఈ ఘటనలో వరుడు సహా తోడు పెళ్లికోడుకు కూడా తృటిలో తప్పించుకున్నారు.

స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపు చేయడంతో ప్రమాదం నుంచి వరుడితో పాటు పలువురు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన గుజరాత్‌లోని పంచ మహల్‌ జిల్లాలో చోటు చేసుకున్నది. ఓ వరుడు తన పెళ్లిని పురస్కరించుకుని బంధువుల, స్నేహితుల నృత్యాల మధ్య శోభాయాత్రగా పెళ్లి మండపానికి గుర్రపు బగ్గీలో వెళ్తున్నాడు. అయితే వరుడు స్నేహితులు కొందరు తమ స్నేహితుడి పెళ్లి సందర్భంగా బాణాసంచా కాల్చుతున్నారు. అయితే బాణాసంచా పేల్చుతున్న సందర్భంగా ఆకాశంలోకి ఎగసిన తారాజువ్వలు.. మళ్లీ కిందకు వచ్చి వరుడి బగ్గీ వెనకనున్న మరో వాహనంపై పడ్డాయి.

దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అంతే అదే వేగంతో వరుడి బగ్గీని అలంకరించిన పలు వస్తువులకు కూడా మంటలు అంటుకున్నాయి. వరుడితో పాటు కొంతమంది చిన్నారులు సైతం కూర్చున్నారు. దీంతో వెంటనే స్థానికులు అప్రమత్తమై వరుడితో పాటు చిన్నారులను కాపాడారు. అలాగే బండి నుంచి గుర్రాలను సైతం విడదీసారు. ఈలోగా కొందరు ఫైర్ ఎగ్టిన్ గ్విషర్ ను తీసుకువచ్చి చల్లడంతో మంటలు చల్లారాయి. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అప్పటివరకు నృత్యాలు, పటాకులు కాలుస్తూ సందడి చేస్తూ వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా గుర్రపు బండిలో మంటలు చెలరేగడంతో అక్కడ భయానక వాతావరణ అలుముకుంది. గుర్రపు బండిలో సైతం బాణాసంచా ఉంచగా.. వాటితోనే మంటలు అంటుకున్నట్లు తెలుస్తున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles