Air Force discharges 27 for refusal to get COVID vaccine కరోనా వాక్సీన్ తీసుకోని ఉద్యోగులు.. ఊస్ట్ చేసిన కంపెనీ..

Air force discharges 27 for refusal to get covid vaccine

Air force, first service members, air force spokesperson, Ann stefanek, 27 members dismissal, COVID-19 vaccine, United States, America

The Air Force has discharged 27 people for refusing to get the COVID-19 vaccine, making them what officials believe are the first service members to be removed for disobeying the mandate to get the shots. The Air Force gave its forces until Nov. 2 to get the vaccine, and thousands have either refused or sought an exemption.

కరోనా వాక్సీన్ తీసుకోని ఉద్యోగులు.. ఊస్ట్ చేసిన ఎయిర్ ఫోర్స్..

Posted: 12/14/2021 01:40 PM IST
Air force discharges 27 for refusal to get covid vaccine

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని చాటుతూనే వుంది. తాజాగా సౌతాఫ్రికాతో పాటు హాంగ్ కాంగ్ లో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ కూడా అందోళనకర వేరియంటేనని.. ఇక అది కూడా ప్రమాదకారేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒమిక్రాన్ ను కట్టడి చేయడానికి బూస్టర్ డోస్ ఒక్కటే మార్గమని బ్రిటన్ దేశం ప్రకటించగా, ఇది వాక్సీన్ నుంచి పొందిన రక్షణ వ్యవస్థను కూడా ఏమార్చగలదని ప్రపంచ అరోగ్యసంస్థ తాజాగా తెలిపింది. అయితే ఈ విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదని.. ఇక మరింత డేటా లభ్యం అయిన తరువాత కానీ దీనిని విశ్లేషించలేమన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

కాగా, క‌రోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు నిరాక‌రించిన‌ 27 మంది ఉద్యోగుల‌ను విధుల నుంచి తొల‌గిస్తున్న‌ట్లు అమెరికా ఎయిర్ ఫోర్స్ తెలిపింది. తమ సంస్థలో ఫస్ట్ సర్వీస్ సభ్యులుగా వున్న 27 మందిని విధుల నుంచి తొలగించినట్టు ఎయిర్ ఫోర్స్ తెలిపింది. అగ్రారాజ్యంలోని అందరూ కరోనా వాక్సీన్లు వేసుకోవాలని అమెరికాలోని జో బైడెన్ ప్ర‌భుత్వం గ‌త ఆగ‌స్టులో చ‌ట్టం చేసింది. ఇందుకుగాను నవంబర్ 2ను చివరి తేదీగా కూడా పేర్కోనింది. అయితే అమెరికా ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని అర్మీలోని వేలాది మంది ఉల్లంఘించారని ఎయిర్ ఫోర్స్ విభాగం తెలిపింది.

వారిలో ప్రాథమిక సర్వీసు విధుల్లో వున్న 27 మంది సభ్యులను తొలగించామని.. వీరంతా యువత అని.. దిగువశ్రేణిలో విధులు నిర్వహిస్తున్న ఎయిర్ ఫోర్స్ సిబ్బంది అని తెలిపింది. ఎయిర్ ఫోర్స్ లో కొనసాగుతూ ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించడం సమంజసం కాదని పేర్కోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే పెంటగాన్ దేశంలోని ఆర్మీ, యాక్టివ్ డ్యూటీ, రిజర్వు దళసభ్యులందరికీ వాక్సీన్లను తెప్పించి.. అందరూ నిర్ధేశిత తేదీలలోగా వాక్సీన్ తీసుకోవాలని అదేశాలను జారీ చేసింది. ఈ సందర్భంగా అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ అస్టిస్.. తమ రక్షణ విభాగం అన్ని విధాల పోరాడేందుకు సమాయత్తంగా వుండాలంటే వాక్సీన్ తీసుకోవడం తప్పనిసరి అని కూడా చెప్పారని అధికారులు తెలిపారు.

ఇలాంటి అదేశాలు.. ఉన్నాతాధికారులు హుకుంలు జారీ అయినా ఈ 27 మంది వైద్యపరంగా, పాలనాపరంగా, మతవిశ్వాసాల పరంగా ఎలాంటి ఎలాంటి మినహాయింపులు పొందకుండా.. కరోనా వాక్సీన్ పై దేశ చట్టాలను ఉల్లంఘించారని అదికారులు తెలిపారు, డిపెన్స్ విభాగంలోని ఎయిర్ ఫోర్స్ మాత్రమే కరోనావాక్సీన్ తీసుకోని సిబ్బంది విషయంలో ఇలాంటి చర్యలకు ఉపక్రమించింది. ఆర్మీలో కొనసాగుతున్న సిబ్బంది తప్పకుండా క్రమశిక్షణతో వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. కాగా తాజా గణంకాల ప్రకారం ఎయిర్ పోర్స్ లోని 1000 మంది సిబ్బంది వాక్సీన్ ను నిరాకరించారు.

కాగా, 4700మంది సిబ్బంది మతపరంగా వాక్సీన్ నుంచి మినహాయింపు పొందారని తెలిపారు. త మిగతా వారంతా వీరికి కింద విధులు నిర్వహించే కిందిస్థాయి అధికారులేనని తెలిపింది. తొలి జాబితాగా 27 మంది సభ్యులపై కరోనా వాక్సీన్ తీసుకోని కారణంగా వేటు పడిందని.. తెలిపింది. ఇక మిగతావారిపై కూడా చర్యలకు ఉపక్రమిస్తామని తెలిపింది. ఎయిర్ ఫోర్స్‌లో దాదాపు 97 శాతం ఉద్యోగులు వ్యాక్సిన్ వేయించుకున్నార‌ని ఎయిర్ ఫోర్స్ అధికార ప్ర‌తినిధి అన్నె స్టెఫానెక్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles