School Bus driver suffers heart attack dies ఆకస్మిక గుండెపోటుతో పాఠశాల బస్సు డ్రైవర్ మృతి

School bus driver dies of a heart attack while driving in vijayawada

School bus driver , Heart attack, Benz circle, Nalanda Educational Institutions, Vijayawada, Andhra Pradesh, AP Politics, Crime

A school bus driver suffered a heart attack while driving the bus and collapsed and died on the steering wheel at the busy Benz circle in the city on Monday morning. The bus belongs to Nalanda Educational Institutions and the driver was identified as Sambaiah.

గుండెపోటుతో పాఠశాల బస్సు డ్రైవర్ మృతి.. విద్యార్థులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం

Posted: 12/13/2021 05:24 PM IST
School bus driver dies of a heart attack while driving in vijayawada

విజయవాడ నగరంలో విషాదం చోటుచేసుకున్నది. ఓ పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ కు ఆకస్మికంగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన బస్సును నడుపుతూనే ప్రాణాలను వదిలాడు. బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను విషాదం తప్పింది. దీంతో స్థానికులతో పాటు విజయవాడ నగర పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, బస్సులోని డ్రైవర్ ఇబ్బంది పడుతున్నట్లు గమనించిన పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి బస్సు డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు.

ఈ ఘటన బెంజి సర్కిల్‌ ప్రాంతంలో సోమవారం ఉదయం జరిగింది. తన జీవితంలో భార్య పిల్లలకు కూడుగూడును అందించిన డ్రైవింగ్ విద్యను నమ్ముకున్న ఓ డ్రైవర్.. తన తుది మజలీకి చేరిన క్రమంలోనే తన బస్సు స్టీరింగ్ ను విడువలేదు. పాఠశాల డ్రైవర్ మరణంపై స్పందించిన సహచరులు ఈ విధంగా వ్యాఖ్యనించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే బెంజ్ సర్కిల్ ప్రాంతంలో ఓ ప్రైవేట్‌ స్కూల్ బస్సు డ్రైవర్‌కు బస్సు నడుపుతుండగా గుండెపోటు వచ్చింది. దాంతో డ్రైవర్‌ స్టీరింగ్‌పైనే తలవాల్చి మృతి చెందాడు.

బస్సు నలంద విద్యాసంస్థలకు చెందినదని, డ్రైవర్‌ను సాంబయ్యగా గుర్తించారు. తీవ్ర గుండెపోటు రావడంతో బస్సును రోడ్డు పక్కగా తీసుకెళ్లి నిలిపాడు. మరుక్షణమే స్టీరింగ్‌పై కుప్పకూలిపోయాడు. స్ట్రీరింగ్‌పై డ్రైవర్‌ పడి ఉండటాన్ని గమనించిన పోలీసులు రంగంలోకి దిగి ఆయనను సమీపంలోని దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని విద్యార్థుల తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles