TTD to construct new ghat road to Tirumala తిరుమలకు అన్నమయ్య మార్గంలో మరో ఘాట్ రోడ్డు: వైవి సుబ్బారెడ్డి

Ttd to construct new ghat road and pedestrian route to tirumala from kadapa yv subba reddy

YV Subba Reddy, Tirumala Tirupati Devasthanams, Tirumala, Kadapa, ghat roads, Third Ghat Road, Balapally, Kadapa, Annamayya marg, Rajampet, Andhra pradesh, devotional

Tirumala Tirupati Devasthanams trust board has resolved to construct new ghat roads and pedestrian route to Tirumala from Kadapa district as the existing ghat roads and pedestrian routes to Tirumala near Tirupati were severely damaged in the recent rains, causing extreme hardships to the visiting devotees.

తిరుమలకు అన్నమయ్య మార్గంలో మరో ఘాట్ రోడ్డు: వైవి సుబ్బారెడ్డి

Posted: 12/11/2021 05:50 PM IST
Ttd to construct new ghat road and pedestrian route to tirumala from kadapa yv subba reddy

శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు మరో ఘాట్ రోడ్డు నిర్మించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఇవాళ ఉదయం టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన టీటీడీ బోర్డు సమావేశంలో భక్తులకు విస్తృత, సురక్షిత ప్రయాణాలకు.. స్వామివారి దర్శనానికి గాను పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదలతో కొండ చరియలు విరిగిపడి ఘాట్ రోడ్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. భవిష్యత్‌లోనూ ఇలాంటి సమస్యలు తలెత్తకుండా తిరుమల కొండకు మూడో ఘాట్ రోడ్‌ నిర్మించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది.

ఇక సమీపంలో ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు జరిగిన పక్షంలో భక్తుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ మూడవ ఘాట్ రోడ్డు దోహదపడుతుందని అన్నారు. తిరుమలకు చేరుకున్న స్వామివారి ప్రియభక్తుడు అన్నమయ్య మార్గాన్నే మూడవ ఘాట్ రోడ్డుగా చేయాలని నిర్ణయించుకున్నారు. బాలపల్లి నుంచి తిరుమల అన్నమయ్య మార్గాన్ని ఘాట్ రోడ్‌ చేయాలని, అక్కడే మరో నడకమార్గం కూడా నిర్మించాలని, అందుకు కావాలిసిన అంచనాలు రూపొందించాలని చైర్మన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మార్గంలో భక్తుల రాకపోకలు జరిగేలా అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు.

హనుమ జన్మస్థలమైన ఆకాశగంగ తీర్థ అభివృద్ధికి ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనందసాయి సలహాలు తీసుకోవాలని, ఎక్కడా లేని విధంగా భారీగా హనుమ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది. శైశైలం ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేపట్టాలని, రూ.3కోట్లతో వసతి గదుల్లో గీజర్లు ఏర్పాటు, 10కోట్లతో స్విమ్స్‌లో భవనాలు నిర్మాణం, రూ.12 కోట్లతో మహిళా యూనివర్సిటీలో హాస్టల్‌ భవనాల నిర్మాణం చేపట్టాలని తీర్మానించింది. జనవరి 13న వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభించి 10రోజుల పాటు దర్శనం కల్పిస్తామని చైర్మన్‌ సుబ్బారెడ్డి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles