CM Bommai flight rounds in air due to bad weather సీఎం విమానం ల్యాండింగ్ లో అవాంతరం.. గాల్లో చక్కర్లు..

Cm bommai flight lands 26 minute late due to non favourable weather

Karnataka CM, Basavaraj bommai, Union Minister Pralhad Joshi, Indigo Plane, Hubballi, Bengaluru, bad weather, three rounds in air, Shiggav, heavyfog, Karnataka, politics, crime

The Indigo Plane 6E7227 flying to Hubballi from Bengaluru in which Chief Minister Basavaraj Bommai and Union Minister Pralhad Joshi were travelling landed at Hubballi Airport 26 minute late to to bad weather

సీఎం విమానం ల్యాండింగ్ లో అవాంతరం.. ప్రతికూల వాతావరణంతో గాల్లో చక్కర్లు..

Posted: 12/11/2021 01:41 PM IST
Cm bommai flight lands 26 minute late due to non favourable weather

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ప్రయాణిస్తున్న విమానం అరగంటపాటు గాలిలో చక్కర్లు కొట్టింది. భారత తొలి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ సహా ఆతని భార్య మధులిక, మరో 10 మంది ఆర్మీ అధికారులు, రావత్ వ్యక్తిగత బధ్రతపిబ్బంది, తెలుగుతేజం సాయితేజ కూడా హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనతో యావత్ దేశం ఒక్కసారిగా ఉల్లిక్కిపడింది. దీంతో ఆ తరువాత కర్ణాటక ముఖ్యమంత్రి బోమ్మై, కేంద్రమంత్రి జోషి ప్రయాణిస్తున్న విమానం గాల్లో చక్కర్లు కోట్టడంతో అంతా భయాందోళనకు గురయ్యారు. విమానాశ్రయం చుట్టూ మూడు రౌండ్లు కొట్టిన విమానం చివరికి సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

విధాన పరిషత్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముఖ్యమంత్రి బొమ్మై నిన్న బెంగళూరు నుంచి విమానంలో హుబ్బళ్లికి బయలుదేరారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఆయన వెంట ఉన్నారు. వీరు ప్రయాణిస్తున్న విమానం హుబ్బళ్లికి చేరుకునే సరికి వాతావరణం సంక్లిష్టంగా మారింది. మంచు దట్టంగా కమ్ముకోవడంతో రన్‌వే కనిపించలేదు. ఫలితంగా ల్యాండింగ్ సాధ్యం కాలేదు. దీంతో విమానాన్ని మంగళూరు తరలించాలని భావించారు. ఈ క్రమంలో విమానం అరగంటపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత వాతావరణం అనుకూలించడంతో విమానం ల్యాండ్ అయింది. దీంతో అప్పటి వరకు ఉత్కంఠగా గడిపిన అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles