Rajnath Singh Briefs Parliament On Army Helicopter Crash హెలికప్టర్ కుప్పకూలిన ఘటనపై పార్లమెంటులో రాజ్ నాథ్ ప్రకటన

Tri service inquiry ordered into iaf chopper crash rajnath singh in parliament

Gen Bipin Rawat dead, General Bipin Rawat,Helicopter Crash,General Bipin Rawat Chopper Crash Live Updates,Bipin Rawat Chopper Crash,CDS Bipin Rawat Chopper Crash,IAF Chopper Crash,Bipin Rawat Chopper Crash Live Updates,Bipin Rawat News,CDS Bipin Rawat,CDS Genral Bipin Rawat,Bipin Rawat Chopper Crashed, CDS Gen Bipin Rawat, IAF chopper crash, rawat helicopter, rawat helicopter crash, cds gen bipin rawat, indian air force, rajnath singh, parliament, Coonoor, Tamil Nadu, Crime

Defence Minister Rajnath Singh today briefed Parliament on the chopper crash that killed 13 people, including Chief Of Defence Staff General Bipin Rawat. Air Chief Marshal VR Chaudhary, Air Force Chief, is at the crash site.

హెలికప్టర్ కుప్పకూలిన ఘటనపై పార్లమెంటులో రాజ్ నాథ్ ప్రకటన

Posted: 12/09/2021 03:41 PM IST
Tri service inquiry ordered into iaf chopper crash rajnath singh in parliament

భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక సహా 11 మందిని బలిగొన్న సాలూరు ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఫోర్స్ ఎంఐ 17వి5 హెలికాప్టర్ క్రాష్ ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇవాళ పార్లమెంటులో ప్రకటన చేశారు. యావత్ దేశం గర్వించే ధీరుడ్ని దేశం కోల్పోయిన వేళ.. గుండెను పిండేస్తున్న విషాధంలో తాను అత్యంత బాధతప్తుడనై ఈ ప్రకటన చేస్తున్నానని రాజ్ నాథ్ తెలిపారు.సాలూరు ఎయిర్ బేస్ నుంచి ఉదయం 11:48 నిమిషాలకు బయలుదేరిన ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్.. బయలుదేరిన ఇరవై నిమిషాలలో ప్రమాదానికి గురైందని తెలిపారు.

మధ్యాహ్నం 12: 15 నిమిషాలకు హెలికాప్టర్ వెల్లింగ్టన్ లోని డిఫెన్స్ కాలేజీకి చేరుకోవాలని కానీ ఈ లోగా 12:08 నిమిషాలకు హెలికాప్టర్ తో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సంబంధాలు తెగిపోయాయని దీంతో అదే సమయంలో ప్రమాదం సంభవించి ఉండవచ్చునని ఆయన పార్లమెంటులో తెలిపారు. కాగా కూనూర్ అటవీప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలిందన్నారు. ప్రమాదం జ‌రిగిన స్థ‌లంలో భారీ శ‌బ్దం రావ‌డంతో కొండ ప్రాంతాల్లో నివసించే స్థానికులు అక్క‌డ‌కు వెళ్లార‌ని, అప్ప‌టికే హెలికాప్ట‌ర్ మంట‌ల్లో కాలిపోతూ క‌న‌ప‌డింద‌ని ఆయ‌న వివ‌రించారు. అనంత‌రం శిథిలాల నుంచి అందిరినీ వెలికితీసి ఆసుప‌త్రికి త‌ర‌లించార‌ని చెప్పారు.

ఈ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ లో మొత్తం 14 మంది ప్రయాణించగా గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరు మినహా 13 మంది చ‌నిపోయార‌ని తెలిపారు. హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో రావ‌త్ స‌హా 13 మంది ప్రాణాలు కోల్పోవ‌డం బాధాక‌రమ‌ని అన్నారు. కాగా వరుణ్ సింగ్ అరోగ్య పరిస్థితి విషమంగా వున్నా.. నిలకడగా వుందనని ఇవాళ ఉదయం ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారని అన్నారు. ఆయన తీవ్రమైన కాలిన గాయాలతో బాధపడుతున్నారని తెలిపారు. ఆయ‌న‌కు సైనిక ఆసుప‌త్రిలో చికిత్స కొన‌సాగుతోంద‌ని, ఆయ‌న ప్రాణాలు కాపాడేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని తెలిపారు. రావత్ అంత్య‌క్రియ‌లు సైనిక లాంఛ‌నాల‌తో జ‌రుగుతాయ‌ని ప్ర‌క‌టించారు.

ఈ ప్రమాద ఘటనపై ఎయిర్ మార్ష‌ల్ మ‌న్వేంద్ర సింగ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి విచార‌ణ జ‌రుగుతోంద‌ని వివ‌రించారు. ఇక అంతకుముందు పార్లమెంటులో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో రావ‌త్ స‌హా 13 మంది మృతి ప‌ట్ల పార్ల‌మెంటు సంతాపం వ్య‌క్తం చేసింది. కాగా, అంత‌కుముందు పార్లమెంట్ ప్రాంగ‌ణంలో కేంద్ర మంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స‌హా రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ తదితరులు స‌మావేశ‌మ‌య్యారు. మ‌రోవైపు, రావ‌త్ మృత‌దేహానికి త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు. ప్ర‌స్తుతం వెల్లింగ్ట‌న్‌లోని మ‌ద్రాస్ రెజిమెంట‌ల్ కేంద్రంలో బిపిన్ రావ‌త్ స‌హా 13 మంది మృతదేహాలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles