Air India flight returns midway due to medical emergency అమెరికాకు వెళ్తున్న విమానం వెనక్కు.. ప్రయాణికుడు మృతి..

Air india delhi us flight returns midway due to the death of a passenger onboard

air india, Flight Time Duty Limitation (FDTL), us-new delhi flight, Newark, death on flight, Delhi airport, Airport Police

Air India Delhi-Newark (US) flight returned to the Indira Gandhi International Airport, three hours after it departed , owing to the death of a passenger onboard. A team of airport doctors arrived on the plane and after a thorough check of the passenger declared him dead. The passenger was US national and was travelling with his wife.

అమెరికాకు వెళ్తున్న విమానం వెనక్కు.. ప్రయాణికుడు మృతి..

Posted: 12/04/2021 05:23 PM IST
Air india delhi us flight returns midway due to the death of a passenger onboard

అమెరికాకు బయలుదేరిన విమానంలో విషాదం చేటుచేసుకుంది. విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు మరణించాడు. దీంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి.. మూడు గంటలు పాటు ప్రయాణించిన ఆ విమానం మళ్లీ వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ అంతర్జాతీయ మిమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. శనివారం ఎయిర్‌ ఇండియాకు చెందిన ఏఐ-105 విమానం ఢిల్లీ నుంచి నెవార్క్ కు టేకాఫ్‌ అయ్యి మూడు గంటలకుపైగా ప్రయాణించింది. ఆ సమయంలో ఈ విషాద ఘటన సంభవించింది.

భార్యతోపాటు విమానంలో ప్రయాణించిన అమెరికా జాతీయుడు.. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆకాశంలో ఉండగా చనిపోయాడు. దీంతో ఆ విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ చేశారు. ఈ మేరకు ఎయిర్‌ ఇండియా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ‘ఎయిర్ ఇండియా ఢిల్లీ-నెవార్క్ (యుఎస్) విమానం మూడు గంటలకుపైగా ప్రయాణించిన తర్వాత అత్యవసర వైద్య పరిస్థితి కారణంగా ఢిల్లీకి తిరిగి వచ్చింది’ అని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. సదరు ప్రయాణికుడిని కాపాడేందుకు విమానం వెనక్కి వచ్చినా ఫలితం లేకపోయింది.

విమానాశ్రయంలోని వైద్యులు విమానంలోకి వచ్చే సరికి సదరు ప్రయాణికుడు చనిపోయాడు. ఈ విషయాన్ని అక్కడి వైద్యులు నిర్ధారించారని ఎయిర్ ఇండియా అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్ట్ పోలీసులకు చెప్పినట్లు వెల్లడించారు. కాగా, ఫ్లైట్ టైమ్ డ్యూటీ లిమిటేషన్ (ఎఫ్డిటిఎల్) నిబంధనల ప్రకారం విమాన కార్యకలాపాల కోసం మరొక బ్యాచ్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు. కొత్త సిబ్బందితో అదే విమానం సాయంత్రం 4 గంటలకు అమెరికాకు బయలుదేరుతుందని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles