కరోనా సెకండ్ వేవ్ సమయంలో డెల్టా వేరియంట్ ధాటికి బెంబేలెత్తిపోయిన దేశాలను తాజాగా ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి వెల్లడైంది. భారత్ లోనూ ఒమిక్రాన్ ప్రవేశించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇది ఎంత ప్రమాదకారి అన్నది ఇప్పుడే చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల వ్యాఖ్యానించింది. కొందరు ఇది ప్రమాదకరమైన వేరియంట్ అంటుంటే మరికోందరు మాత్రం అంత ప్రమాదకారి కాదని అంటున్నారు. అయితే 32 మ్యూటేషన్లతో ఇది పరీక్షలను తప్పించుకుంటుందని కేవలం జీనోమ్ పరీక్షల ద్వారానే బయటపడుతోందని అంటున్నారు.
అయితే, ఒమిక్రాన్ కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులో బయటపడుతుందని తాజాగా ఐపీఎంఆర్ స్పష్టం చేసింది. ఇక దాంతో పాటు ఈ వైరస్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందినా.. 32 ఉత్పరివర్తనాలతో ఇది పెద్దగా హానికారకం కాకపోవచ్చునని ఐసీఎంఆర్ తెలిపింది. ఇక దీనిపై భయపడాల్సిన పనేమీలేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ కొత్త వేరియంట్ పై ప్రభావవంతంగా పనిచేసే ఔషధాన్ని తాము గుర్తించినట్టు బ్రిటన్ వెల్లడించింది. ఈ మందు పేరు సోట్రోవిమాబ్. ఫార్మా దిగ్గజం గ్లాక్సో స్మిత్ క్లైన్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న సోట్రోవిమాబ్ వినియోగానికి బ్రిటన్ ఆమోదం తెలిపింది.
కరోనా సోకిన వారికి సోట్రోవిమాబ్ ఇంజెక్షన్ తో యాంటీబాడీ చికిత్స చేయగా, వారిలో మరణించే ప్రమాదం 79 శాతం తగ్గినట్టు వెల్లడైంది. ఈ మందును నరాల ద్వారా ఎక్కించగా, కరోనా వైరస్ మానవ కణాల్లో ప్రవేశిచండాన్ని సమర్థంగా అడ్డుకుంటున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. కరోనా సోకిన తొలినాళ్లలో సోట్రోవిమాబ్ సింగిల్ డోస్ ఇస్తే, మంచి పనితీరు కనబరుస్తుందని వివరించారు. లక్షణాలు కనిపించిన ఐదు రోజుల్లోగా దీన్ని వాడాలని బ్రిటన్ కు చెందిన ది మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) వెల్లడించింది. సోట్రోవిమాబ్ తో పాటు రోనా ప్రీవ్ ఔషధం కూడా గణనీయంగా ప్రభావం చూపుతోందని ఎంహెచ్ఆర్ఏ తెలిపింది. ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్లను ఈ ఔషధాలు దీటుగా ఎదుర్కొంటాయని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more