chain snatching incident creates panic in pragathi nagar ప్రగతినగర్ లో చైన్ స్నాచింగ్.. వేకువజామునే ఘటన

Chain snatching incident creates panic in pragathi nagar

pragathi nagar chain snatching case, kukatpally chain snatching video, pragathi nagar chain snatching video, chain snatching, chain snatching video, caught on camera, chain snatching in pragati nagar, chain snatching in hyderabad, hyderabad chain snatching video, CCTV footage, Pragathi nagar, kukatpally police, cyberabad, CCTV footage, Ramya Sri, Gold chain, Mangalsutra, Early morning, Hyderabad, Telangana, crime video, Crime

Panic gripped among the residents of Pragathi Nagar after a chain-snatching incident took place on Tuesday morning. According to the reports, an unidentified miscreant snatched two Tula gold Mangalsutra worn by Ramya Sri when she was indulged in household works. Shocked after the unprecedented incident, she tried to chase the thief by yelling for a certain distance but he escaped.

ITEMVIDEOS: ప్రగతినగర్ లో చైన్ స్నాచింగ్.. వేకువజామునే ఘటన

Posted: 11/30/2021 12:31 PM IST
Chain snatching incident creates panic in pragathi nagar

హైదరాబాద్‌ కూకట్ పల్లి హౌజింగ్ బోర్డు కాలనీకి చేరువలో మహిళలు ఒక్కసారిగా మళ్లీ ఉలిక్కిపడ్డారు. ప్రగతినగర్ ప్రాంతంలో చైన్ స్నాచింగ్ దొంగలు తమ ఉనికి చాటుకోవడంతో స్థానిక మహిళలు మళ్లీ తమ మెడలోని బంగారాన్ని కష్టం వచ్చిందని హడలిపోతున్నారు. కార్తీకమాసం.. వేకువ జామునే లేచి ఇంటి పనులు చేసుకోవాలన్న ప్రయత్నాల్లో వున్న మహిళలను చైన్ స్నాచింగ్ ముఠాలు టార్గెట్ చేస్తూ రెచ్చిపోతున్నాయి. పోలీసుల కఠిన చర్యల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచింగ్ దొంగలు తమ కార్యకలాపాలను సాగించలేదు.

దీంతో మహిళలు తమకు చక్కని భద్రత లభించిందని ఆనందించారు. అయితే అదను చూసుకుని సరిగ్గా కార్తీక మాసం ఉదయమే మహిళలు లేచి పనులు చేసుకుంటారని గ్రహించిన చైన్ స్నాచర్లు మళ్లీ కూకట్ పల్లి ప్రాంతంలోని ప్రగతినగర్ లో ఉనికి చాటారు. తెల్లవారుజామున ఇంటి ముందు వాకిలి ఊడుస్తున్న ఓ మహిళ మెడలోంచి 2 తులాల మంగళసూత్రం లాక్కుని పరుగులు తీశారు. కాగా దోంగను పట్టుకునేందుకు బాధితురాలు కూడా  దొంగ దొంగ అని అరుస్తూ దాదాపుగా రెండు వీధులు పరుగెత్తింది.

అయితే అప్పటికే దొంగ పరుగు లఖించుకుని ఓ గల్లిలోకి వెళ్లడంతో.. దొంగ వెంటే పరుగుతీసిన బాధితురాలికి దొంగ కనిపించలేదు. దీంతో అమె చేసేది లేక ఇంటికి వచ్చి విషయాన్ని భర్తతో చెప్పింది. తన భర్తతో కలసి వెళ్లి అమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగ ఆనవాళ్ల కోసం దగ్గరలోని సీసీ ఫుటేజీలో రికార్డయిన దృశ్యాల పరిశీలిస్తున్నారు. దొంగను ఖచ్చితంగా పట్టుకుంటామని అందోళన చెందాల్సిన అవసరం లేదని బాధితురాలికి పోలీసులు భరోసా కల్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles