Bride works out at gym for pre-wedding shoot in viral video ప్రీవెడ్డింగ్ షూట్: ముస్తాబైన వధువు.. జిమ్ లో కసరత్తులు.!

Dilwale dumbbell le jaayenge bride hits the gym before wedding

Bride, gym bride, pre-wedding shoot, Bride gym wedding, viral video, trending wedding videos, trending viral wedding videos, dulhan gym videos, bride in gym, pre wedding shoot, bride video, twitter, gym, pre wedding shoot, funny video, trending video, Viral video, video viral

It's officially wedding season in the country and there is a visible rush among couples to do a unique pre-wedding photoshoot with a totally out-of-the-box idea. One bride-to-be has captured the attention of netizens with her dedication towards fitness and the video showing the woman lifting weights during her photoshoot has gone swiftly viral.

ITEMVIDEOS: ప్రీవెడ్డింగ్ షూట్: ముస్తాబైన వధువు.. జిమ్ లో కసరత్తులు.!

Posted: 11/27/2021 07:29 PM IST
Dilwale dumbbell le jaayenge bride hits the gym before wedding

పెళ్లంటే నేరేళ్ల పంట.. ఒకరికోకరు తెలియని రెండు హృదయాలు ఒకరికిఒకరై జీవితాంతం పెనవేసుకునే తీయని బంధం. అందుకనే పెళ్లంటే మధురానుభూతి. చక్కని జ్ఞాపకం. ఈ పెళ్లిలో కట్టుకనే పట్టుచీరలు, లేదా లాల్చీపైజామాలు ఒక్కరోజు వేడుక కోసమే అయినా కొన్ని లక్షల రూపాయలు పెట్టి మరీ కొనేస్తుంటారు. అందుకనే కాబోలు కాబోయే వధూవరులు కూడా పెళ్లి అనగానే తమ మధర జ్ఞాపకాలను జీవితాంతం క్యారీ చేయాలని ప్లాన్ ఛేసుకుంటారు. ఈ క్రమంలోనే పెళ్లికి సంబంధించిన అనేక వీడియోలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయ్.

ఈ పెళ్లి వేడుకలో సంగీత కార్యక్రమాలు కూడా వచ్చేశాయి. వరుడ్ని తమ డాన్సులతో మెప్పించే వధువులు.. వధువులు ఊహకు అందని విధంగా వరుల ట్విస్టులు.. ఇలా అనేకానేక వీడియోలు ఇప్పటికే నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. ఇక నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా డుగ్గు డుగ్గు డుగ్గ అని అంటూ బారత్ లో డాన్స్ చేసి వరుడ్ని మెప్పించిన వీడియోల వరకు అన్ని నెట్టింట్లో వైరల్ గానే మారాయి. ఇక ఎంత కాదనుకున్నా.. పెళ్లంటే ప్రతీ సగటు సామాన్యుల ఇళ్లలోనూ పెద్ద పండుగ‌. బంధువులు, హడావిడి, ఆర్బాటాలు ఇలా చాలా వుంటాయి.

అయితే పెళ్లి చేసే తల్లిదండ్రులకు మాత్రం పెళ్లంటే పెద్ద పనే. అయితే ఆనందానిచ్చే పని. పెళ్లి కార్డులు ప్రింట్ చేయించడం, పెళ్లికి ఫంక్ష‌న్ హాల్ మాట్లాడ‌టం, క్యాట‌రింగ్, షాపింగ్.. అబ్బో.. ఊపరి సలపని పని. పెళ్లికి ఓ ప‌ది ప‌దిహేను రోజుల ముందు నుంచే ఇవ‌న్నీ ఉంటాయి. ఈ మ‌ధ్య ప్రీ వెడ్డింగ్ షూట్స్ బాగా వైర‌ల్ అవుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్స్‌లో పెళ్లికూతురు, పెళ్లికొడుకు చేసే చిలిపి ప‌నులు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. సాధార‌ణంగా ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే.. ఏదైనా పార్కులోనో.. లేదా ఏదైనా మంచి ప్లేస్ చూసుకొని తీస్తారు కానీ.. ఈ పెళ్లి కూతురు మాత్రం త‌న ప్రీ వెడ్డింగ్ షూట్‌ను ఏకంగా జిమ్‌లో పెట్టుకుంది.

జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తూ ఫోటోలు దిగింది. అయితే.. త‌ను క‌స‌ర‌త్తులు చేస్తూ ఫోటోలు దిగుతుంటే.. త‌న‌కు కాబోయే వ‌రుడు మాత్రం అక్క‌డ క‌నిపించ‌లేదు. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెయిట్ లిఫ్టింగ్ చేయ‌డం.. డంబెల్స్ ఎత్త‌డం లాంటివి చేసి పెళ్లికూతురు అంద‌రినీ ఆక‌ట్టుకుంది. పెళ్లి కూతురు గెట‌ప్‌లో వ‌చ్చి.. ఇలా బాడీ బిల్డ‌ర్‌లా క‌స‌ర‌త్తులు చేయ‌డం ఏంట‌ని.. నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. ఏది ఏమైనా.. త‌న కొత్త ఆలోచ‌న‌కు నెటిజ‌న్లు జోహార్లు అంటున్నారు. కానీ.. పెళ్లి చేసుకోబోయే వ్య‌క్తి ప‌రిస్థితి ఏంటో.. అంటూ ఫ‌న్నీగా కామెంట్లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh