Naxal militia commander killed in encounter in Sukma చత్తీస్ గడ్ ఎన్ కౌంట‌ర్: మిలీషియా కమాండర్‌ హతం

Top maoist commander involved in 9 deadly attacks on forces eliminated

Maoists, Encounter, Basta Bheema, police personnel, Maoist Party, Maoists, CRPF, Central Reserve Police Force, Maoist killed Sukma, 201 CoBRA Battalion, crude bomb explosion, Crime

A top Maoist militia commander, who was said to be involved in 9 deadly attacks on our security forces was eliminated on Friday in a successful encounter in Chhattisgarh's Sukma district. The wanted Maoist, identified as Basta Bheema, was carrying a reward of Rs 1 lakh on his head.

చత్తీస్ గడ్ ఎన్ కౌంట‌ర్: మిలీషియా కమాండర్‌ హతం

Posted: 11/27/2021 12:29 PM IST
Top maoist commander involved in 9 deadly attacks on forces eliminated

మావోయిస్టులకు ఈ మధ్యకాలంటో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల జార్ఖంగ్ రాష్ట్రంలోని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు టెక్ రవి మరణించగా, ఇటు మహారాష్ట్రలోనూ పోలీసులతో జరిగిన ఎన్ కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. కాగా, తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోనూ నిషిద్ద మావోయిస్టు గ్రూపుకు చెందిన దళ సభ్యుడు హతమయ్యాడు.

వివరాల్లలోకి వెళ్తే.. సుక్మా జిల్లాలో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు ఘటనాస్థలంలోనే మరణించాడు. జిల్లాలో శుక్రవారం సాయంత్రం భద్రతా బలగాలు, పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ సందర్భంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా, పోలీసులకు ఓ మావోయిస్టు ఎదురుపడ్డాడు. పోలీసులను చూసిన అతడి వారిపై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో భద్రతాబలగాలు జరిపిన ప్రతి కాల్పుల్లో మావోయిస్టు చనిపోయాడు. అతడిని మిలీషియా కమాండర్‌ మాద్వి భీమాగా గుర్తించారు. ఘటనా స్థలంలో రైఫిల్‌, 5 కిలోల ఐఈడీ, 20 ఎలక్ట్రిక్‌ డిటోనేటర్లు, 2 బీజీఎల్‌ షెల్‌ స్వాధీనం చేసుకున్నామని సీఆర్‌పీఎఫ్‌ అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles