South Africa detects new Covid variant OMICRON దక్షిణాఫ్రికా కరోనా కొత్త వేరియంట్ కు ‘ఒమిక్రాన్’గా నామకరణం

New covid variant named omicron with unusual mutations

COVID-19, Omicron, variant, Omicron B.1.1.529, covid new variant, covid new mutation, spike protein, Dr. Tom Peacock, virologist, Imperial College London, Covid-19, super strain, New Variant, Omicron, South Africa, Botswana, Hong kong, covid news, corona updates

A new variant of SARS-CoV-2 variant B.1.1.529 first began to emerge, with over 30 spike mutations has been reported from southern Africa and Botswana they designated the new strain found in South Africa and Botswana as a 'variant of concern' and announced that it would be called the 'Omicron' variant.

దక్షిణాఫ్రికాలో వెలుగులోకి సూపర్ స్టెయిన్ కు ‘ఒమిక్రాన్’గా నామకరణం

Posted: 11/27/2021 10:37 AM IST
New covid variant named omicron with unusual mutations

యావత్ ప్రపంచం సామాజిక దూరాన్ని పాటించడంతో పాటు చేతులను ఎప్పటికప్పుడు శానిటైజర్ తో శుభ్రం చేసుకోవడంతో పాటు వాక్సీన్ డబుల్ డోసు తీసుకున్న నేపథ్యంలో క్రమంగా కరోనా ముప్పు నుంచి దూరం అవుతున్నామని అనుకుంటే పోరబాటే. కరోనా కూడా గత రేండళ్ల కాలంలో చాలానే మారింది. అల్పా, బీటా, డెల్టావేరియంట్లను మాత్రమే చూసిన  ప్రపంచం ఇక తాజాగా మరో వేరియంట్ ను  గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అంతేకాదు ఇది ఏకంగా 32 నుంచి 50 రకాలుగా ఉత్పరివర్తనాలు చేందడంతో పాటు అంతే వేగంగా కూడా వ్యాప్తి చెందుతుందన్న వార్త ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఇక దీంతో పాటు ఇది కరోనా సోకిన వారితో పాటు వాక్సీన్ తీసుకున్న వారిపై కూడా ప్రభావాన్ని చూపుతుందన్న వార్తలు కలవరాన్ని మరింతగా పెంచుతున్నాయి.

కొత్త వేరియంట్‌ బీ1.1.529 సూపర్ స్ట్రెయిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ 'ఒమిక్రాన్' అని నామకరణం చేసింది. జెనోమిక్‌ సీక్వెన్సింగ్‌ ప్రకారం.. ఇప్పటి వరకు 22 మంది బీ1.1.529 వేరియంట్‌ బారినపడ్డారు. గతంలో పలు దేశాల్లో విస్తృతంగా వ్యాపించిన బి.1.1 కరోనా వేరియంట్ నుంచి ఈ కొత్త వేరియంట్ రూపాంతరం చెంది ఉంటుందని భావిస్తున్నారు. దీంట్లో పెద్ద సంఖ్యలో జన్యు ఉత్పరివర్తనాలు ఉండడం ఆందోళన కలిగించే అంశమని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. దీంట్లోని స్పైక్ మ్యుటేషన్లను పరిశీలిస్తే ఇది మానవదేహంలోని మోనోక్లోనల్ యాంటీబాడీలను సులభంగా ఏమార్చగలదని నిపుణులు వివరించారు.

ఒమిక్రాన్ మొదట దక్షిణాఫ్రికాలో ఉనికిని చాటుకుంది. నవంబరు 9న ఓ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలో బి.1.1.529 వేరియంట్ నిర్ధారణ అయింది. ఆపై బోట్సువానా, హాంకాంగ్ దేశాల్లోనూ ఇది వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే విమానాలపై అనేక దేశాలు నిషేధం విధించాయి. తాజా పరిణామాలపై డబ్ల్యూహెచ్ఓ స్పందిస్తూ, ఒమిక్రాన్ వేరియంట్ ఎంత ప్రభావం చూపిస్తుందన్నది తెలుసుకోవాలంటే మరికొన్ని వారాలు పడుతుందని వెల్లడించింది. బ్రిటన్ కు చెందిన ఆరోగ్య శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ, వ్యాక్సిన్లు కూడా కొత్త వేరియంట్ ను ఏమీ చేయలేవని అన్నారు.

ఆక్స్ ఫర్డ్ వర్సిటీకి చెందిన జేమ్స్ నెయిస్మిత్ అనే ప్రొఫెసర్ స్పందిస్తూ, బి.1.1.529లోని జన్యు మార్పులను పరిశీలిస్తే ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు కలిగి ఉన్నట్టు తెలుస్తోందని వివరించారు. అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ చీఫ్ డాక్టర్ ఆంటోనీ ఫౌచీ.. కొత్త వేరియంట్ పై తన అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నివేదికలు కొత్త రకం కరోనాపై ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నాయని, వ్యాక్సిన్లను మరింత శక్తిమంతంగా రూపొందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వ్యాక్సిన్లు దీన్ని ఏమేరకు నిలువరిస్తాయన్నది మరింత క్షుణ్ణంగా పరిశోధించాల్సి ఉందని అన్నారు.

తాజాగా బెల్జియం, ఇజ్రాయెల్ తదితర దేశాల్లో కూడా ఈ వేరియంట్ వెలుగు చూడటంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఈ వేరియంట్ ను గుర్తించిన దేశాలపై ఆంక్షలకు సిద్ధమవుతున్నాయి. ప్రమాదకరమైన ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో దక్షిణాఫ్రికాపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించేందుకు యూరోపియన్ దేశాలతో పాటు జపాన్, సింగపూర్, ఇజ్రాయెల్ దేశాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు మన దేశంలో ఈ రకం వేరియంట్ కేసులు ఇంకా నమోదు కాలేదు. అయితే, విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో పక్కాగా వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Corona Virus  Covid-19  super strain  New Variant  Omicron  South Africa  Botswana  Hong kong  covid news  corona updates  

Other Articles