South Africa detects new Covid variant దక్షిణాఫ్రికాలో వెలుగులోకి కరోనా కొత్త వేరియంట్.. 32 ఉత్పరివర్తనాలు

New covid variant with unusual mutations focus of who meet

COVID-19, B.1.1.529, covid new variant, covid new mutation, spike protein, Dr. Tom Peacock, virologist, Imperial College London, Covid-19, super strain, New Variant, South Africa, Botswana, Hong kong, covid news, corona updates

A new variant of Covid-19 with over 30 spike mutations has been reported from southern Africa. On November 23, Dr. Tom Peacock, a virologist at Imperial College London, posted the details of the variant on github.com, noting that the “incredibly high amount of spike mutations suggest this could be of real concern (predicted escape from most known monoclonal antibodies)”

దక్షిణాఫ్రికాలో వెలుగులోకి కరోనా కొత్త వేరియంట్.. 32 ఉత్పరివర్తనాలు

Posted: 11/25/2021 06:26 PM IST
New covid variant with unusual mutations focus of who meet

ప్రపంచాన్ని కరోనా ముప్పు వెంటాడుతూనే ఉన్నది. చైనాలోని వూహాన్ నగరంలో రెండేళ్ల క్రితం పురుడుపోసుకున్న ఈ మహమ్మారి.. యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన కేసులు.. ఇటీవల మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. కరోనా కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు ప్రకటించింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్‌తో గురించి తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పింది.

కొత్త వేరియంట్‌కు బీ1.1.529 పేరు పెట్టారు. జెనోమిక్‌ సీక్వెన్సింగ్‌ ప్రకారం.. ఇప్పటి వరకు 22 మంది బీ1.1.529 వేరియంట్‌ బారినపడ్డారు. ఇంతకు ముందు నవంబర్‌ 19న శ్రీలంకలో కరోనా డెల్టా వేరియంట్ కొత్త వేరియంట్‌ను గుర్తించారు. దానికి B.1.617.1.AY104గా పేరుపెట్టారు. ఇది శ్రీలంకలో గుర్తించిన మూడో మ్యుటేషన్‌. కరోనా డెల్టా వేరియంట్‌ తీవ్ర ప్రభావం చూపుతున్నది. గతంలో పలు దేశాల్లో విస్తృతంగా వ్యాపించిన బి.1.1 కరోనా వేరియంట్ నుంచి ఈ కొత్త వేరియంట్ రూపాంతరం చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు కొత్త వేరియంట్ కారణంగా నమోదైన కేసులు 10 మాత్రమే.

కానీ దీంట్లో భీతిగొలిపే రీతిలో ఉన్న జన్యు ఉత్పరివర్తనాల రీత్యా మున్ముందు మరిన్ని కేసులు వెల్లడవుతాయని, ఇప్పటికే వెలుగులోకి రాని కేసులు చాలా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంట్లోని స్పైక్ మ్యుటేషన్ల అమరికను పరిశీలిస్తే ఇది మానవదేహంలోని మోనోక్లోనల్ యాంటీబాడీలను సులభంగా ఏమార్చగలదని డాక్టర్ టామ్ పీకాక్ వివరించారు. ఈ ఏడాది ప్రారంభంలో, మధ్యలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కేసులు నమోదయ్యేందుకు డెల్టా వేరియంటే కారణమని నిపుణులు పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికుల్లో బోట్స్వానా, హాంకాంగ్‌ దేశాల్లోనూ గుర్తించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Corona Virus  Covid-19  super strain  New Variant  South Africa  Botswana  Hong kong  covid news  corona updates  

Other Articles