PMGKAY extended till March 2022- Anurag Thakur 81 కోట్ల రేషన్ కార్డుదారులకు కేంద్రం శుభవార్త..

Pm garib kalyan anna yojana extended till march 2022 anurag thakur

Coronavirus, PMGKAY, Narendra Modi, Prime Minister, Garib Kalyan Anna Yojana, Ration Card Holders, Anuraj Thakur, National Politics

Union Minister Anurag Thakur informed after the cabinet meeting that the term of PM Garib Kalyan Anna Yojana has been extended till March 2022. Now everyone will continue to get free ration till March next year.

రేషన్ కార్డుదారులకు కేంద్రం శుభవార్త.. 81 కోట్ల మందికి పథకం పోడగింపు

Posted: 11/24/2021 05:26 PM IST
Pm garib kalyan anna yojana extended till march 2022 anurag thakur

రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా పెద ప్రజలకు ప్రధానమంత్రి గరీబ్​ కళ్యాణ్​ అన్న యోజన కింద అందిస్తున్న ఉచిత రేషన్​ కార్యక్రమాన్ని మార్చి 2022 వరకు పొడగిస్తున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ 'ఉచిత రేషన్ కార్యక్రమాన్ని 2022 మార్చి వరకు అందించడానికి 'ప్రధాని గరీబ్ కళ్యాణ్ అన్నా యోజనను పొడిగించాలని కేంద్రం కేబినెట్ నిర్ణయించినట్లు ఠాకూర్ తెలిపారు. గతేడాది కోవిడ్-19 వల్ల విధించిన లాక్​డౌన్ దృష్ట్యా పెదప్రజలకు ఉచితంగా రేషన్ అందించడానికి ప్రధానమంత్రి గరీబ్​ కళ్యాణ్​ అన్న యోజన(పీఎంజీకెఏవై)ని మార్చి 2020లో ప్రకటించారు.

2020 ఏప్రిల్​లో ఈ పథకం మొదలైంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది జూన్​ వరకు పొడగించారు. ఆ తర్వాత కరోనా పరిస్థితుల వల్ల పేదలు ఇబ్బంది పడకుండా.. జూన్​లో మరో ఐదు నెలలు పాటు పోడగించారు. అంతే ఈ ఏడాది నవంబర్ 30 వరకు ఈ పొడిగింపు వర్తించనుంది. అయితే తాజాగా మరోమారు ఈ పథకాన్ని నాలుగు నెలల పాటు పోడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఎ) కింద గుర్తించిన 81 కోట్ల రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుంచి ఉచితంగా రేషన్ సరఫరా చేస్తుంది. ప్రతి నెల 5 కిలోల ఆహార ధాన్యాలను(గోధుమ/బియ్యం) ఉచితంగా పంపిణీ చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles