ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. శాసనసభలో కీలక ప్రకటన చేశారు. మూడు ప్రాంతాల సమఅభివృద్ది కోసం తీసుకువచ్చిన మూడు రాజధానుల బిల్లును వెనక్కి ఉపసంహరిస్తున్నామని స్పష్టం చేశారు. అయితే అమరాతతిని రాజధానిగా చేస్తామని ఎక్కడ హామీని ఇవ్వని సీఎం.. పూర్తి సమగ్రమైన, మెరుగైన బిల్లుతో మళ్లీ సభ ముందుకు వస్తామన్నారు. విస్తృత, విశాల ప్రజాప్రయోజనాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.
రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకు న్యాయం చేసేలా, మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే ఈరోజు దాన్నుంచి మంచి ఫలితాలు ఈపాటికే అందుబాటులోకి వచ్చి ఉండేవి. నాటి శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో వెనుకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలు కూడా సమాన అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో ఒకచోటే పూర్తిగా కేంద్రీకరణ అయిన పరిస్థితుల మధ్య ప్రజల్లో వ్యతిరేకతకు కారణం కారాదని తాము మూడు ప్రాంతాల సమగ్ర సమాభివృద్దికి శ్రీకారం చుట్టాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
మరోసారి హైదరాబాద్ లాంటి సూపర్ క్యాపిటల్ మోడల్ వద్దే వద్దని అటువంటి చారిత్రక తప్పిదాన్ని ప్రభుత్వం పాల్పడరాదని.. 2019 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమైందని అన్నారు. కాబట్టి వికేంద్రీకరణ సరైన విధానమన్నది బలంగా నమ్మి అడుగులు ముందుకు వేశాం. అన్ని ప్రాంతాలు కులాలు, మతాలు.. వీరిందరి ఆశలు, ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని, మన ప్రభుత్వాన్ని రెండున్నర సంవత్సరాలు మనసారరా దీవిస్తూ వచ్చారు. ప్రతి ఎన్నికలోనూ మన పార్టీని ఆశీర్వదించారు.
అయితే వికేంద్రీకరణకు సంబంధించి అనేక అపోహాలు, అనుమానాలు, కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు, దుష్ప్రచారాలను ఈ రెండేళ్ల కాలంలో ప్రచారం చేశారు. అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కనపెట్టి, కొందరికి అన్యాయం జరుగుతుందనే వాదనను ముందుకు తోశారు. వికేంద్రీకరణ అవసరాన్ని మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు చట్టపరంగా, న్యాయపరంగా గానీ అన్ని సమాధానాలతో బిల్లులోనే పొందుపరించేందుకు, బిల్లులను మరింత మెరుగు పర్చేందుకు సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు తీసుకువస్తామని అన్నారు.
రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని, ఈ ప్రాంతంలో లెజిస్లేటివ్ క్యాపిటల్ పెట్టాలని, కర్నూల్‌లో హైకోర్టు పెట్టాలని నిర్ణయించాం. వికేంద్రీకరణతో మంచి పాలన అందించాలనే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేశాం. విశాఖపట్టణం పెద్ద సిటీ. రోడ్లు ఉన్నాయి. డ్రైనేజీ, కరెంట్ ఉంది. అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. సుందరీకరణపై దృష్టి సారించి ఉండి ఉంటే.. హైదరాబాద్ వంటి పెద్ద నగరాలతో పోటీ పడే అవకాశం ఉండేది. ఈ నిర్ణయాలను రకరకాలుగా వ్యతిరేకించారు. న్యాయపరమైన చిక్కులను సృష్టించారు. ఇటువంటి నేపథ్యంలో ఈ ప్రకటన చేయాల్సి వస్తోంది అని జగన్ పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more