SUV Running Over People In US Christmas Parade ఊరేగింపుగా వెళ్తున్న భక్తుల పైనుంచి దూసుకెళ్లిన మృత్యుశకటం..

Deafening cries 5 dead 40 injured as suv rams us christmas parade

car crash, SUV crash into parade, US Christmas, Christmas parade, vehicle crashes into crowd, Waukesha, Wisconsin, Waukesha, Wisconsin, Christmas parade, vehicle crashes into crowd, SUV crashes into chirstmas parade, Waukesha Christmas Parade, Wisconsin Christmas Parade News, Wisconsin Christmas Parade Latest News, Christmas Parade News, Waukesha Christmas Parade News, Waukesha News, US, Crime

Five people were killed and 40 others wounded after a vehicle plowed into a Christmas parade in the US state of Wisconsin, police said. Officials said a red SUV broke through barricades at the Christmas parade in Waukesha, a suburb of Milwaukee just after 4:30 pm (2230 GMT), as spectators watched the annual tradition.

ITEMVIDEOS: ఊరేగింపు పైనుంచి దూసుకెళ్లిన మృత్యుశకటం.. ఐదుగురు మృతి.. 40 మందికి గాయాలు

Posted: 11/22/2021 12:39 PM IST
Deafening cries 5 dead 40 injured as suv rams us christmas parade

అగ్రరాజ్యం అమెరికాలో స్థానిక ప్రజలు తమకు ఆరాధ్యుడైన యేసుప్రభువు జన్మదినవేడుకల మాసం..  క్రిస్మస్ నెల మరో మూడు రోజుల వ్యవధిలో వస్తుండటంతో దానిని తమ భక్తియుక్తులతో అహ్వానం పలికే విధంగా పరేడ్‌లో నిర్వహిస్తున్నారు. ఈ పరేడ్ లో కొందరు పాల్గొన్న కొందరు భక్తులు కీర్తనలు ఆలపిస్తున్నారు. మరికోందరు కీర్తనలకు అనుగూణంగా నృత్యాలు చేస్తున్నారు. పరేడ్ అంతా భక్తుజనుల ఉల్లాసం, ఉత్సాహాల మధ్య అంగరంగ వైభవంగా సాగుతోంది. దీంతో రోడ్లకు ఇరువైపులా ఉన్న ప్రజలు ఈ పరేడ్ సాగుతుండగా దానిని చూస్తూ నిలబడిపోయారు.

అంతే ఆ పరేడ్ నిర్వహిస్తున్న నిర్వాహకుల మధ్యలోంచి ఓ ఎస్ యూ వీ కారు మృత్యుశకటంలా దూసుకెళ్లింది. అప్పటివరకు కీర్తనలు, యేసు ప్రభువు నామ సంకీర్తనలతో సాగిన పరేడ్లో ఒక్కసారిగా హాహాకారాలు వినిపించాయి. భక్తులు మధ్యలోంచి వెళ్లాలని భావించి మార్గం లభించిక ఇలా చేశాడో.. లేక ఉగ్రవాద చర్యో తెలియదు కానీ.. ఈ ఘటనలో ఐదురుగు మరణించారు. కాగా మరో నలభైమంది క్షతగాత్రులయ్యారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి, గాయపడిన వారిని అసుపత్రులకు తరలించారు.

అమెరికాలో విస్కాన్సిన్ లో ని వౌకేశా ప్రాంతంలో ఆదివారం సాయంత్రం క్రిస్మస్‌ పరేడ్‌ జరగ్గా.. అందులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సీసీటీవీ ఫూటేజీలను అక్కడి అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ దాడికి తెగబడింది ఉగ్రవాదులా.? లేక ఎవరు.? అన్న కోణంలోనూ పోలీసుల విచారణ సాగుతోంది. కాగా ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియోను అక్కడి స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి... దానిని నెట్టింట్లో అప్ లోడ్ చేశాడు. తన కారు కింద మనుషులు పడిపోయినా.. వారిపై నుంచే కారును నడిపించుకు వెళ్లిన కోణం ఉగ్రవాద చర్యగానే అనిపిస్తుందని స్థానికులు అరోపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles