Three Magnificent Cobras Coiled Together In Maharashtra Forest పెనవేసుకున్న మూడు నల్లత్రాచులు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్

Three magnificent cobras coiled together photographed in maharashtra forest pics go viral

cobras, snakes, reptiles, forest, three Black cobra coiled tree trunk, three Black cobras, coiled, tree trunk, King cobra, Harisal forest, Amaravati, Indian wildlife, reptiles, susanta Nanda IFS, Rajendra Semalkar, maharashtra

India is home to a wide range of flora and fauna, and we often come across wonderful pictures and videos clicked in the wild. A series of photos of three cobras in a Maharashtra forest was shared on a Facebook group named Indian Wildlife. The picture of the majestic reptiles was reportedly clicked after the snakes were rescued and released into the forest.

మహారాష్ట్రలో పెనవేసుకున్న మూడు నల్లత్రాచులు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్

Posted: 11/18/2021 03:34 PM IST
Three magnificent cobras coiled together photographed in maharashtra forest pics go viral

పాము అన్న పదం వింటే చాలు మనలో చాలా మంది పావు కిలోమీటరు దూరం పరుగెడతారు. అయితే ఈ పాములు మనుషలు తమ వద్దకు చేరితే హాని చేకూరుస్తాయని కాటు వేస్తాయే తప్ప.. మనుషులపై పగబట్టి మాత్రం కాదు. పాముల్లో రెండు రకాలున్న విషయం కూడా తెలిసిందే. ఒకటి విషరహిత పాము మరోకటి విషపూరిత పాము. ఇక ఈ విషపూరిత పాముల్లోనూ నల్లత్రాచుపాము విషయం అత్యంత భయంకరమైనది. ఈ పాము కాటు వేసిన వెనువెంటనే ప్రాథమిక చికిత్సలు చేస్తే తప్ప.. మనుషులు బతకడం చాలా కష్టం.. అందుకనే దీనినే కింగ్ కోబ్రా అని కూడా పిలుస్తుంటారు. లాంటి నల్లత్రాచు తారసపడితే ఏమైనా వుందా.? పైప్రాణాలు పైనుంచే ఎగిరిపోవడం ఖాయం.

అలాంటిది ఒకే చోట‌.. అది కూడా ఏకంగా న‌ల్ల తాచు క‌నిపిస్తే ఇంకేమైనా ఉందా… ఒక్క నిమిషం పాటు భ‌యంతో గుండె ఆగిపోతుంది. తాజాగా ఈ కోవ‌కు చెందిన ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది. మ‌హారాష్ట్రలో ఈ అరుదైన దృశ్యం క‌నిపించింది. ఒక చెట్టు మొదలుకు మూడు న‌ల్ల తాచులు పెన‌వేసుకుని.. ప‌డ‌గ‌విప్పి మ‌రీ ఫోటోకు ఫోజుచ్చాయి. తొలుత ఈ ఫోటో ఇండియ‌న్ వైల్డ్ లైఫ్‌లో మంగ‌ళ‌వారం క‌నిపించింది. జ‌నావాసంలోకి ప్రవేశించిన ఈ పాముల‌ను ప‌ట్టుకుని అడ‌విలో వ‌దిలేసే స‌మ‌యంలో ఈ ఫోటోని క్లిక్‌మ‌నిపించారు.

అమ‌రావ‌తి హ‌రిసాల్ అట‌వీ ప్రాంతంలో తీసిన ఈ ఫోటోల‌ను రాజేంద్ర సెమాల్కర్ అనే వ్యక్తి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. హ‌రిసాల్ అట‌వి ప్రాంతంలో ద‌ర్శన‌మిచ్చిన మూడు తాచులు అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌య్యింది. ఇప్పటి వ‌ర‌కు 4700 మందికి పైగా యూజ‌ర్లు దీన్ని లైక్ చేశారు. రాజేంద్ర సెమాల్కర్ షేర్ చేసిన ఫోటోల్లో ఒక‌టి ఇప్పుడు ఇక్కడ మ‌నం చూస్తున్న ఫోటో. దీన్ని సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ అధికారి త‌న ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఇది చూసిన నెటిజ‌నులు.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles