"Elite Controllers" Give Hope for an HIV Cure హెచ్ఐవి చికిత్సలో ఆశలు చిగురింపజేస్తున్న ‘‘ఎలైట్ కంట్రోలర్స్’’

Elite controllers self immunity give hope for an hiv cure

Elite Controllers, Hope for an HIV Cure, HIV treatment, HIV study, HIV patients turn elite controllers, gene study, self vaccine in HIV patients, Researchers

Researchers have published a study of a woman being called the "Esperanza patient," one of what researchers call "elite controllers," who seem to eradicate HIV naturally. There are two known cases of people having been "cured" of HIV

హెచ్ఐవి చికిత్సలో ఆశలు చిగురింపజేస్తున్న ‘‘ఎలైట్ కంట్రోలర్స్’’

Posted: 11/17/2021 03:45 PM IST
Elite controllers self immunity give hope for an hiv cure

ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు నివారణ ఒక్కటే మార్గమని గత కొన్నేళ్లుగా మనం వింటూనే వున్నాం. అయితే ఇలాంటి భయంకరమైన వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే ఇక వారి జీవితం చరమాంకానికి వచ్చిందని ఇన్నాళ్లు ఉన్న అభిప్రాయం. అయితే క్రమంగా ఈ వ్యాధి సోకిన వారికి జీవితకాలాన్ని పెంచేలా కొన్ని చికిత్సవిధానాలు అందుబాటులోకి తీసుకువచ్చింది వైద్యశాస్త్రం. దీంతో వ్యాధిని పెరగకుండా నియంత్రిస్తూనే బాధితుల జీవితకాలన్ని పెంచేందుకు వైద్యురంగంలోని నిపుణులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి అభినందనీయం.

కాగా, ఎలైట్ కంట్రోలర్స్ ఈ ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధిని కూడా సర్వసాధారణ వ్యాధిగా మార్చేస్తూ.. ఆ రోగం నుంచి పూర్తిగా విముక్తులు అవుతున్నారు. ఎయిడ్స్ వ్యాధి ఒకసారి సోకిందంటే.. ఇక జీవితాంతం దానిని మోయాల్సిందే అన్న అభిప్రాయాలకు చెక్ పలికేటా వీరు చేస్తున్నారు. అయితే, వ్యాధి ముదరకుండా ఉండేందుకు మాత్రం యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ ఉన్నాయి. అలాంటి ఈ వ్యాధి నుంచి గతంలో ఒకరు బయటపడగా.. తాజాగా మరో వ్యక్తి ఎలాంటి మందులు వాడకుండానే పూర్తిగా కోలుకున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో హెచ్ఐవి వ్యాధి నుంచి ఎలైట్ కంట్రోలర్స్ తరహాలో ఆ వ్యాధి బాధితులను పూర్తిగా విముక్తులను చేయడంపై దృష్టి సారించారు.

దీంతో వీరిద్దరిపై పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. వారిలో రోగ నిరోధక వ్యవస్థలు ఎలా పనిచేశాయన్న దానిపై పరిశోధనలు ప్రారంభించారు. ఆ రహస్యాన్ని ఛేదిస్తే విప్లవాత్మక మార్పులు తీసుకురావొచ్చని భావిస్తున్నారు. శరీరంలోకి హెచ్ఐవీ వైరస్ ప్రవేశించిన తర్వాత అది తన జన్యురాశిని ఇతర కణాల డీఎన్ఏలోకి చొప్పించి వాటిని వైరల్ రిజర్వాయర్లుగా మార్చుతుంది. ఆ తర్వాత వీటి నుంచి వైరస్ పుట్టుకొస్తుంది. హెచ్ఐవీ కోసం అందుబాటులోకి వచ్చిన రిట్రో వైరల్ డ్రగ్స్ ఈ రిజర్వాయర్లపై పనిచేసినప్పటికీ వాటిని పూర్తిగా నాశనం చేసే సామర్థ్యం వాటికి లేదు.   

ఇంతకీ ఎలైట్ కంట్రోలర్స్ అంటే ఏమిటీ.. కొంతమంది వ్యక్తుల్లోని రోగ నిరోధక వ్యవస్థలు ఎలాంటి ఔషధాలు లేకుండానే వైరస్ ను అణచివేసే శక్తిని కలిగి ఉంటాయి. ఇలాంటి వ్యక్తులను ‘ఎలైట్ కంట్రోలర్స్’గా పిలుస్తుంటారు. ఔషధాల అవసరం లేకుండానే హెచ్ఐవీ నుంచి బయటపడడాన్ని ‘స్టెరిలైజింగ్ క్యూర్’గా పిలుస్తారు. గతంలో బెర్లిన్ దేశానికి చెందిన ఓ వ్యక్తి ఇలానే సోంతంగా బయటపడగా, మరోక లండన్ కు చెందిన రోగి కూడా రోగవిముక్తుడు అయ్యాడని తెలిపారు. కాగా, తాజాగా అర్జెంటినా కు చెందిన ముఫై ఏళ్ల మహిళా రోగి కూడా ఇలానే బయటపడినట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈమె 2013లో హెచ్ఐవి వ్యాధి బారిన పడినట్లు నిర్థారించారు.

అయితే ఎలాంటి మందులు వాడకుండా, ఎలాంటి మెడికేషన్ లేకుండా అమె తన జీవితాన్ని తనకు కావాల్సినట్టుగా జీవిస్తూ ఈ వ్యాధి నుంచి బయటపడటం ఆశ్చర్యకర పరిణామాం. దీంతో అమె నుంచి సేకరించిన 119 కోట్ల రక్త కణాలను, 50 కోట్ల కణజాల కణాలను పట్టిపట్టి పరీక్షించినా ఎక్కడా హెచ్ఐవీ జినోమ్ జాడ కనిపించలేదని పరిశోధకులు తెలిపారు. ఎలైట్ కంట్రోలర్స్‌లో స్టెరిలైజింగ్ క్యూర్ ఎలా జరుగుతుందో కనుక తెలుసుకోగలిగితే హెచ్ఐవీకి పరిష్కారం లభించినట్టేనని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ వైద్య నిపుణురాలు జూ యూ తెలిపారు. బాధితుల రోగ నిరోధక వ్యవస్థలు తమంత తాముగా స్టెరిలైజింగ్ క్యూర్‌ను చేపట్టేలా ప్రయోగాలు జరుపుతున్నట్టు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles