దేశానికి స్వాత్రంత్యం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో అటవిక న్యాయం రాజ్యమేలుతోంది. తప్పు చేసిన వారిపై అనాగరిక చర్యలకు తెగబడుతున్నారు. మరీ ముఖ్యంగా దేశ 70 ఏళ్ల స్వాతంత్ర్యం గురించి అన్ని సమస్యలపై మాట్లాడే ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ మూడు పర్యాయాలు ఏలిన ఆయన సోంత రాష్ట్రంలోనూ ఈ అటవిక న్యాయం రాజ్యమేలడం చర్యనీయాంశంగా మారింది. ఏకంగా మూడు పర్యాయాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా గెలిచి.. 13 ఏళ్ల పాటు గుజరాత్ లో ఏకచక్రాధిపత్యం వహించినా అనాగరిక చర్యలకు అడ్డుకట్ట పడలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇంతకీ గుజరాత్ లో ఏం జరిగింది.? గుజరాత్ లో ఓ మైనర్ బాలిక.. ఓ యువకుడి పట్ల అకర్షణకు లోనైంది. ఇద్దరు కలసి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. వారిని పట్టుకుని వచ్చిన గ్రామస్థులు తమ గ్రామం పరువు, తమ కుటం పరువు తీసిందని మైనర్ బాలికపై అకృత్యానికి తెగబడ్డారు. అమె జుట్టును కత్తరించేసి.. అమె ముఖానికి నల్లని సిరా రాసి.. గ్రామంలో ఊరేగించారు. ప్రియుడితో పారిపోయిందనే ఆగ్రహంతో ఈ దారుణానికి పాల్పడ్డారు. అయితే ఈ అఘాయిత్యాన్ని కొందరు వీడియోలో రికార్డు చేసి సోషల్ మీడియాలో ఆప్ లోడ్ చేయడంతో ఈ వీడియో తెగ వైరలవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ రాష్ట్రంలోని పటాన్ జిల్లా హరిజ్ గ్రామానికి చెందిన బాలిక ఈ నెలలో తన ప్రియుడితో కలసి గ్రామాన్ని వదిలి పాయిరపోయింది. అయితే వారి జాడను కనుగొన్న గ్రామస్థులు ఈ నెల 10న గ్రామానికి తీసుకువచ్చి దారుణానికి ఒడిగట్టారు. వది తెగకు చెందిన గిరిజనులు తమ కట్టుబాట్లను యువతి ఉల్లంఘించిందనే ఆగ్రహంతో ఈ దాడికి తెగబడ్డారు. తనను విడిచిపెట్టాలని.. తెలియక తప్పు చేశానని బాలిక ఎంతగా మెరపెట్టుకున్నా.. అవి చెవిటివాళ్ల ముందు శంఖం ఊదినట్టుగానే మారాయి. అమెను కనుకరించని గ్రామస్థులు.. మరీ ముఖ్యంగా యువకులు అమె ముఖానికి నల్లని సిరా రాసి గ్రామంలో తిప్పి అవమానించారు.
మహిళ చేసిన పనితో తమ తెగకు చెడ్డపేరు వచ్చిందనే కోపంతో ఆమెను శిక్షించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే సీనియర్ అధికారులు రంగంలోకి దిగారు. పటాన్ ఎస్పీ సుప్రీత్ సింగ్ గులాటీ ఘటనా స్ధలానికి చేరుకుని 15 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీడియోలో కనిపించిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నారని ఎస్పీ గులాటీ తెలిపారు. దీంతో పాటు మైనర్ బాలికను ప్రేమ పేరుతో తీసుకెళ్లిన యువకుడిపై కూడా పోస్కో చట్టం కింద కేసేు పెట్టామని, అతిడ్ని కూడా అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
May 16 | ఆయనో ప్రోఫెసర్.. ఎదిగిన విద్యార్థులకు ఉన్నతమైన వ్యక్తులుగా.. ప్రోఫెషనల్ కోర్సులను బోధించే గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతున్నాడు. అయితే ఆయన చేసిన పనే ఇప్పుడాయనను వార్తల్లో నిలిపింది. తాను ప్రోఫెసర్ అన్న విషయాన్ని మర్చిన ఆయన..... Read more
May 16 | సింగిల్ బిర్యానీ ఖరీదు ఎంత.. అంటే ఠక్కున వచ్చే సమాధానం రూ.150. సరే కొంత బెస్ట్ పాపులర్ హోటల్ బిర్యాని అయినా మహాఅంటే రూ.300. అలా కాదు స్టార్ హోటల్ నుంచి తెప్పించిన బిర్యానీ... Read more
May 16 | ఈశాన్య రాష్ట్రం అసోంలో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. వర్షంతో పాటు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రజాజీవనం స్థంభించింది. వర్షం, వరదల కారణంగా ఇప్పటివరకు ముగ్గురు మరణించగా, అపార ఆస్తినష్టం వాటి్ల్లినట్లు... Read more
May 16 | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోతమోగింది. న్యూయార్క్‌లోని బఫెలో ప్రాంతంలో చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో పడిన రక్తపు మరకలు గడ్డకట్టకముందే.. మరో రెండు ప్రాంతాల్లో కాల్పుల మోత మార్మోగాయి. బఫెలో కాల్పుల ఘటన... Read more
May 16 | పద్నాలుగేళ్ల మైనర్ బాలుడిని ముద్దు పెట్టుకోవడంతో పాటు అతని రహస్యబాగాలను తాకడం అసహజ లైంగిక చర్య (అన్నాచురల్ సెక్సువల్ అసల్ట్) కిందకు రాదని బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 14 ఏళ్ల బాలుడిని ముద్దు... Read more