Ex-UP minister Gayatri Prajapati sentenced to life మాజీమంత్రి గాయత్రి ప్రజాపతికి జీవిత ఖైదు.. జరిమానా.!

Gayatri prajapati former minister gets jail for life in rape case

Chitrakoot gang rape case, gayatri prasad rape case, Gayatri Prasad, UP minister, gangrape case, life in prison, life imprisonment, Gyatri prasad prajapati, Akhilesh yadav, akhilesh yadav minister sentenced to jail, chitrakoot rape case, chitrakoot gang rape case, ex UP minister, Gayatri Prajapati, former Akhilesh Yadav govt minister, gets jail for life in rape case

A special court in Lucknow sentenced former Uttar Pradesh minister Gayatri Prasad Prajapati and two others to life in prison in a rape case. The case pertains to a complaint filed by a woman from Chitrakoot accusing the former SP minister and his accomplices of gang rape.

మాజీమంత్రి గాయత్రి ప్రజాపతికి జీవిత ఖైదు.. జరిమానా.!

Posted: 11/12/2021 07:05 PM IST
Gayatri prajapati former minister gets jail for life in rape case

ఉత్తర్ ప్రదేశ్ మాజీ మంత్రికి లక్నోలోని ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు శిక్షను విధిస్తూ ఇవాళ సంచలన తీర్పును వెలువరించింది. సామూహిక లైంగిక దాడికి తన అనుచరులైన మరో ఇద్దరితో కలసి పాల్పడిన కేసులోస‌మాజ్‌వాదీ పార్టీకి చెందిన మాజీ మంత్రి గాయ‌త్రి ప్ర‌జాప‌తికి యావ‌జ్జీవ శిక్ష విధించింది. మాజీ మంత్రి గాయ‌త్రి ప్ర‌జాప‌తితో పాటు ఆయ‌న అనుచ‌రులు అశోక్ తివారీ, ఆశిష్ శుక్లాల‌కు కోర్టు రూ 2 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. సామూహిక లైంగిక దాడి కేసులో ప్ర‌జప‌తిని, ఆయ‌న అనుచ‌రులిద్ద‌రిని ల‌క్నో ప్ర‌త్యేక న్యాయ‌స్ధానం రెండు రోజుల కింద‌ట దోషులుగా నిర్ధారించింది.

చిత్ర‌కూట్‌కు చెందిన మ‌హిళ ప్ర‌జాప‌తి, ఆయ‌న అనుచ‌రుల‌పై లైంగిక దాడి ఆరోప‌ణ‌లు చేసింది. వారు త‌న‌తో పాటు త‌న మైన‌ర్ కుమార్తెపైనా దారుణానికి ఒడిగ‌ట్టార‌ని ఫిర్యాదులో పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల‌కు అనుగుణంగా ఈ కేసులో ప్ర‌జాప‌తి స‌హా ఆరుగురు వ్య‌క్తుల‌పై 2017 ఫిబ్ర‌వ‌రి 18న ఎఫ్ఐఆర్ న‌మోదైంది. ఏడుగురు నిందితుల‌పై సామూహిక లైంగిక దాడి, బెదిరింపులు, పోక్సో స‌హా ప‌లు సెక్ష‌న్ల కింద అభియోగాలు న‌మోద‌య్యాయి. మ‌హిళ ఫిర్యాదు ఆధారంగా 2017 మార్చి 18న ప్ర‌జాప‌తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Convicted  ex minister  Life imprisonment  Molestation case  Samajwadi Party  Uttar Pradesh  Crime  

Other Articles