Germany, UK hits record- high Covid-19 cases యూరోప్ దేశాల్లో కోవిడ్ నాలుగో దశ.. విజృంభిస్తున్న కేసులు..

Europe only region across globe where coronavirus cases deaths are increasing who

Coronavirus world update, coronavirus in greece, coronavirus in Europe, Vaccination in Europe, Coronavirus death toll, uk coronavirus, germany coronavurs, covid news, covid vaccine, europe coronavirus news, who, united nations, UK, Covid Cases, coronavirus, covid, Health, Corona vaccine, Europe, Britain, Germany, WHO, covid Fourth wave, Lockdown

The WHO said that Europe was the only region across the globe where the coronavirus cases and deaths were increasing steadily. The health body said that of the 31 lakh new coronavirus cases registered across the world this week, 19 lakh infections were recorded in Europe alone. The deaths across Europe had increased by 10% over the last week, the health body added.

యూరోప్ దేశాల్లో కోవిడ్ నాలుగో దశ.. విజృంభిస్తున్న కేసులు.. పెరుగుతున్న మృతులు

Posted: 11/11/2021 11:37 AM IST
Europe only region across globe where coronavirus cases deaths are increasing who

కరోనా మహమ్మారి మూడవ దశ విజృంబిస్తుందని అనేక దేశాలు శరవేగంగా కరోనా వాక్సీన్లను తమ ప్రజలకు అందజేసి.. వ్యాధి నియంత్రణ చర్యలకు శ్రీకారం చుడుతున్న తరుణంలో యూరోప్ ఖండంలోని దేశాల్లో మాత్రం నాలుగో దశ కరోనావైరస్ విజృంభిస్తోంది. అందుకు కారణం అక్కడి ప్రజలు కరోనా టీకాలపై నిరాసక్తతను వ్యక్తం చేయడంతో పాటు అక్కడి దేశాలకు ఇంకా హార్డ్ ఇమ్యూనిటీ రాలేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. యూరోప్ ఖండంలోని పరిస్థితులను పరిశీలిస్తున్న ప్రపంచ అరోగ్య సంస్థ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపర్చింది.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో కరోనావైరస్ క్రమంగా తన ఉద్దృతిని కోల్పోతున్న తరుణంలో యూరోప్ దేశాలు మాత్రం అందుకు భిన్నంగా వున్నాయని పేర్కోంది. అన్ని దేశాల్లో కరోనా అదుపులోకి వస్తున్నా.. యూరోప్ దేశాల్లో మాత్రం కరోనా కేసుల విజృంభన కోనసాగుతుందని అన్నారు. వాటితో పాటు మరణాల సంఖ్య కూడా అధికంగానే వుందని పేర్కోంది. ప్రపంచవ్యాప్తంగా తాజాగా 31 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, అందులో కేవలం యూరోప్ దేశాల్లో మాత్రమే 19 లక్షల కేసులు నమోదయ్యాయని వివరాలను తెలిపింది. గత వారంతో పొల్చితే ఈ వారం 10శాతం మేర అధికంగా కరోనా మరణాలు సంభవించాయని పేర్కోంది.

యూరోప్ లోనే అత్యధికంగా కేసులు నమోదైన దేశాల్లో జర్మని, బ్రిటన్ దేశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది. జర్మనీ, బ్రిటన్ దేశాల్లో కరోనా రోజువారీ కేసుల సంఖ్య ఆందోళన కలిగించేలా ఉంది. నిన్న ఒక్కరోజే జర్మనీలో 39,676 కొత్త కేసులు నమోదుకాగా, బ్రిటెన్ లోనూ అదే స్థాయిలో 39,329 కేసులు వెల్లడయ్యాయి. దీంతో జర్మనీలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3.31లక్షలకు చేరగా, నిన్న ఒక్క రోజులో ఏకంగా 236 మంది మృత్యువాత పడ్డారు. అదే సమయంలో అటు బ్రిటన్ లోనూ 214 మంది కరోనాతో మరణించగా ఈ మహమ్మారి వల్ల అసువులు బాసిన వారి సంఖ్య ఏకంగా 1.42 లక్షలు దాటింది.

దేశంలోని ఆసుపత్రులకు తరలివస్తున్న కరోనా బాధితుల సంఖ్య అంతకంతకు పెరిగిపోయింది. ఐసీయూల్లో ఖాళీలు లేని పరిస్థితి ఏర్పడింది. కొత్తగా వచ్చేరోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోలేకపోతున్నామని అక్కడి వైద్యసిబ్బంది నిస్సహాయత వ్యక్తంచేస్తున్నారు. ఆసుపత్రుల్లోని సిబ్బంది మొత్తం కరోనా రోగుల బాగోగులు చూసుకోవడానికి సరిపోతున్నారని, ఇతర కేసుల్లో శస్త్రచికిత్సలు కూడా నిర్వహించలేకపోతున్నామని ఓ ఆసుపత్రి యజమాన్యం వాపోయింది. కొత్త కేసుల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే దేశంలో లాక్ డౌన్ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UK  Covid Cases  coronavirus  covid  Health  Corona vaccine  Europe  Britain  Germany  WHO  covid Fourth wave  Lockdown  

Other Articles