తెలంగాణలో ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టగాడు. తన ప్రేమను నిరాకరించిందన్న అక్కస్సుతో ఉన్మాదిలా మారిన యువకుడు యువతిని గొంతుకోసి దారుణంగా హత్యచేశాడు. ఇక యువతి అరుపులు, కేకలు ఇరుగుపోరుగువారికి వినిపించకుండా అమె ఇంట్లోని టీవీ సౌండ్ ను పూర్తిగా పెంచి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రామగిరి మండలం, వెంకట్రావుపల్లి గ్రామంలో ఈ దారుణం జరిగింది. కాగా ఘటన తరువాత యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. సమచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసుల కథనం ప్రకారం.. వెంకట్రావుపల్లిలోని యైటింక్లైన్ కాలనీ కేకేనగర్ కు చెందిన గొడుగు అంజలి (20) తల్లి లక్ష్మితో కలిసి నివసిస్తోంది. తల్లి కూలి పనికి వెళ్లిన తర్వాత అంజలి ఇంట్లో ఒంటరిగా ఉండేది. తారకరామానగర్ కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ చాట్ల రాజు (20) యువతి ఒంటిరిగా ఉండటాన్ని గమనించి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆపై ప్రేమ పేరుతో వేధించడం మొదలుపెట్టాడు. దీంతో తన ఇంటికి రావొద్దని అతడికి ఆమె వార్నింగ్ ఇచ్చింది. ఇదే విషయమై ఏడాది క్రితం ఇరు కుటుంబాల మధ్య పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. ఒక్కసారి కాదు ఏకంగా మూడు పర్యాయాలు పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగినా.. రాజు, అంజలీ దేవి వెంటపడటం వీడలేదు.
ఇదిలావుంచితే, అంజలికి ఇటీవల పెళ్లి సంబంధాలు చూస్తున్న విషయం తెలుసుకున్న రాజు ఆమెపై కసి పెంచుకున్నాడు. ఆమె ఇంటికి వెళ్లి వాగ్వివాదానికి దిగాడు. తన ప్రేమను అర్థం చేసుకోమ్మని బతిమాలాడు. అయినా తన తల్లి మాట జవదాటనని అంజలి తేల్చిచెప్పింది. ఈ క్రమంలో తమ మాటలు బయటివారికి వినిపించకుండా టీవీ సౌండ్ పెంచిన రాజు.. అమె నిరాకరిస్తే.. అమెను హత్య చేయాలన్న అప్పటికే రచించుకున్న పథకం ప్రకారం అమెను హత్య చేశాడు. అయితే అంజలి ఇంట్లోని కత్తిపీట కనబడగానే తన పథకాన్ని అమలు చేసేందుకు ఉన్మాదిలా మారిన రాజు అమె గొంతుకోసి దారుణంగా చంపాడు.
అంజలి తల్లి లక్ష్మితో కలిసి పనిచేసే వ్యక్తి ఉపాధిహామీ జాబ్‌కార్డు ఇచ్చేందుకు నిన్న మధ్యాహ్నం వారింటికి వెళ్లాడు. ఎంతగా పిలిచినా లోపలి నుంచి స్పందన లేకపోవడం, టీవీ సౌండ్ పెద్దగా ఉండడంతో తలుపు తోసుకుని లోపలికి వెళ్లాడు. అక్కడ రక్తపు మడుగులో పడివున్న అంజలి మృతదేహాన్ని చూసి భయంతో వణికిపోయాడు. తేరుకుని బయటకు వచ్చి ఇరుగుపొరుగుకు చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు, అంజలిని హత్య చేసిన రాజు అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్టు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
May 17 | హర్యాణలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఉదయం వేళ నడుస్తూ వెళ్తున్న ఓ కష్టజీవి గొంతు నులిమి నడిరోడ్డుపై దోపిడీకి పాల్పడ్డారు. హర్యానాలోని గురుగ్రామ్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ... Read more
May 17 | కృష్ణా, రామా అని భగవంతుడి నామ జపం చేయాల్సిన వయస్సులోనూ ఓ వృద్దుడు తన మనవరాలి వయస్సులోని మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే ఇలాంటి... Read more
May 17 | ఏమి జరిగినా మన మంచికే అన్న సూక్తిని పాటిస్తూ.. ధైర్యంగా ముందుకు నడిస్తే.. అపజయాలే విజయశిఖారాలుగా మారుతాయన్నది పెద్దల మాట. అందుకనే ధైర్యే సాహసే లక్ష్మీ అనే మాట కూడా పుట్టింది. ఈ సూక్తి... Read more
May 17 | కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిందంబరం తనయుడు కార్తీ చిదంబరం నివాసంలో సెంట్రోల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబిఐ) మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నది. కార్తీ చిదంబరం నివాసాలతో పాటు దేశవ్యాప్తంగా కార్యాయాలయాల్లో సోదాలు... Read more
May 17 | షరియా చట్టం అమలుజరిగే ఇస్తామిక్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో.. అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో అమలుపర్చే బహిరంగ శిక్షలు పలు సామాజిక మాద్యమాల్లోనూ... Read more