Lakhimpur Kheri: SC appoints ex-HC judge to monitor probe లఖింపూర్‌ ఘటనపై ఇద్దరు మాజీ జడ్జీల సమక్షంలో విచారణ

Lakhimpur kheri case sc appoints ex hc judge to monitor probe

CJI, Justice NV Ramana, Supreme Court, Lakhimpur Kheri violence, Lakhimpur Farmers Killing, Uttar Pradesh, UP Farmer killing, UP Violence, Lakhimpur Farmers Killing, lakhimpur kheri violence case, lakhimpur kheri, farmers protest, ashish mishra, ajay mishra, Uttar pradesh, Crime

The Supreme Court on Monday expressed its disappointment over a status report filed by the Uttar Pradesh government on the October 3 violence that erupted in Lakhimpur Kheri in which eight people, including four farmers and a local journalist, were killed.

లఖింపూర్‌ ఘటన: ఇద్దరు మాజీ జడ్జీల సమక్షంలో విచారణ

Posted: 11/08/2021 04:37 PM IST
Lakhimpur kheri case sc appoints ex hc judge to monitor probe

దేశంలో కలకలం రేపిన లఖీపూర్‌ ఖేరి హింసాత్మక ఘటనపై ఇవాళ విచారణ జరిపిన దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల అసహనాన్ని వ్యక్తం చేసింది. సుమోటోగా కేసు విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం గడిచిన కొన్ని వారాలలో మూడవ పర్యాయం ఈ కేసును విచారించింది. ఇదివరకే ఈ కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం ప్రభుత్వానికి, ఉత్తర్ ప్రదేశ్ పోలీసులకు పలు ప్రశ్నలు సంధించింది. కాగా తాజాగా కూడా న్యాయస్థానం అదే స్థాయిలో తీవ్ర అసహనం వెలిబుచ్చింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఇవాళ మరోమారు కేసును విచారణ జరపింది. ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన స్టేటస్ రిపోర్ట్ పై మరోమారు అసంతృప్తి వ్యక్తం చేసింది. సాక్షులను విచారించామని నివేదికలో పోందుపర్చడం మినహా.. కోత్తగా స్టేటస్ రిపోర్టులో ఏమీ లేదని పేర్కోనింది. హింసాకాండకు కారణమైన 13 మందిని అరెస్టు చేశామని, సాక్షలను విచారించామని మాత్రమే నివేదికలో పోందుపర్చడం ఏమిటని ప్రశ్నించింది. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయువు అశీష్ మిశ్రా ఫోన్ ను జప్తు చేయడంపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

నిందితులకు సంబంధించిన ఫోన్ కాల్ రికార్డులను తమకు సమర్పించాలని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులను అదేశించిన సర్వన్నత న్యాయస్థాన ధర్మాసనం.. సేకరించిన వివరాలను నేరుగా తమకు సమర్పించాలని కూడా అదేశాలు జారీ చేసింది. ఇక ఈ కేసులో ఇతర కేసుల సాక్ష్యాలను ఈ కేసులో ఉపయోగించరాదని స్పష్టం చేసింది. అదే సమయంలో కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థకు (సీబిఐకి) బదిలీ చేసేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో అత్యున్నత న్యాయస్థానం ఇద్దరు మాజీ హైకోర్టు న్యాయమూర్తును ఈ కేసు విచారణకు నియమించింది. వీరి సమక్షంలోనే లఖీంపూర్ ఖేరి కేసు విచారణ సాగాలని కోర్టు సూచనలు చేసింది.

అంతుకు ముందు లఖింపూర్‌ కేసులో ల్యాబ్‌ నివేదిక సమర్పించకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనికి స్పందించిన ప్రభుత్వం నవంబర్‌ 15న రిపోర్ట్‌ వస్తుందని చెప్పగా.. కోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని ఆదేశించింది. హింసాత్మక ఘటన విచారణ తాము ఆశించిన మేరకు దర్యాప్తు జరుగడం పేర్కొంది. లఖీంపూర్ ఖేరీ కేసు విచారణలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వరుసగా మెట్టికాయలు పడుతున్నా తీరులో ఏలాంటి మార్పు రాలేదు. అంతకుముందు ‘‘ర్యాలీలో నాలుగైదువేల మంది రైతులు ఉంటే.. ప్రత్యక్ష సాక్షులు కేవలం 23 మంది దొరికారా? అని ప్రశ్నించిన న్యాయస్థానం.. సెక్షన్ 164 కింద ఎంతమంది వాంగ్మూలం నమోదు చేశారని కూడా నిలదీసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles