Baby born with 12cm tail in Brazil బ్రెజిల్ లో వింత ఘటన.. వాలంతో పుట్టిన శిశువు..

Baby born in brazil had 12 cm long appendage with ball shaped mass at the tip

baby boy with tail, brazil baby boy tail, tail, Baby, Brazil, ball, mass, Baby, Tail, 12 cm, Brazil, Baby with tail

A baby boy born in Brazil has a 12 cm-long appendage with a ball on the end, 'a true human tail' as revealed by the doctors. It's a fact that human babies grow an embryonic tail while in the womb, at around the four to eight-week gestation point. But the growth is fast reabsorbed back into the body, eventually resulting in the formation of the tailbone.

బ్రెజిల్ లో వింత ఘటన.. వాలంతో పుట్టిన శిశువు..

Posted: 11/06/2021 05:01 PM IST
Baby born in brazil had 12 cm long appendage with ball shaped mass at the tip

మానవుడు కోతి నుంచి ఉద్భవించాడని కాదు కాదు.. చింపాజీ నుంచి అని ఇప్పటికీ వాదనలు కొనసాగుతూనే వున్నాయి. అయితే మానవుడు మొత్తానికి జంతువు నుంచే పుట్టాడని, అయితే తొలినాళ్లలో అతడికి వాలం కూడా ఉండేదని, రాను రాను మానవుల పుట్టుకలో వస్తున్న మార్పులతో క్రమేపి తోక అదృశ్యమయ్యిందని కూడా మరికొందరూ చెబుతారు. అయితే కొందరు మాత్రం ఇప్పటికీ ఈ నిజాన్ని నమ్మరు. ఎందుకంటే మానవులకు తోక లేదుకదా అని తెలివిగా సమాధానం ఇస్తారు. అయితే వారికి ఈ శిశువే సమాధానం అంటున్నారు మరికొందరు.

ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు గానీ బ్రెజిల్‌లోని ఒక మగ శిశువు మాత్రం తోకతో జన్మించాడు. పైగా ఆ తోక 12 సెం.మీ పొడవుతో చివర ఒక బంతి ఆకారం ఉంది. దీంతో బ్రెజిల్ దేశంలో ఆంజనేయుడు మళ్లీ పుట్టాడని కొందరు కొత్త వాదనలను తెరపైకి తీసుకోస్తున్నారు. అయితే వీరి మూడభక్తిని పక్కనబెడితే.. నిజంగానే మగశిశువు తోకతో జన్మించడం వింత ఘటనే. వాస్తవానికి మానవుని జనన సమయంలో నాలుగు నుంచి ఎనిమిది వారాల గర్భధారణలో మొదట పిండం తోకల రూపంలోనే పెరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా నెలలు నిండే కొద్ది అవయావలు ఏర్పడి పూర్తి మానవ శరీర రూపంలోకి మారిపోతుంది.

కానీ అనూహ్యంగా ఇది పిండంతో పాటుగా ఈ తోక కూడా పెరిగింది. అయితే ఫోర్టలేజాలోని ఆల్బర్ట్ సబిన్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో శిశువు జన్మించిన సమయంలో 'తోక' 12 సెం.మీ వరకు పెరిగి 4 సెం.మీ వ్యాసం కలిగిన బంతిని కలిగి ఉన్నట్లు మెడికల్ జర్నల్ తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు డాక్టర్లు శస్త్ర చికిత్స ద్వారా ఆ శిశువుకు తోకను తొలగించినట్లు తెలిపారు. ఇలాంటి అరుదైన కేసులు సుమారు 40 వరకు చూశామని చెప్పారు. ఈ అరుదైన మానవ తోకల గురించి సమగ్రంగా రేడియోలాజికల్‌ పద్ధతుల ద్వారా అధ్యయనం చేయల్సిన అవసరం ఉందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baby boy with tail  brazil baby boy tail  tail  Baby  Brazil  ball  mass  Baby  Tail  12 cm  Brazil  Baby with tail  

Other Articles