Special electoral enrolment drive from November 6 కొత్త ఓటర్ల నమోదు.. జాబితాలో సవరణలపై అవగాహన..

Special electoral enrolment drive from november 6 in greater hyderabad

New Voters, New Enrollment, Change of Name, Change of Address, Change of Age, correction in Voter list, Objections in voters list, GHMC, Greater Hyderabad, Hyderabad district, New Enrollments, Changes in Voter list, polling stations, GHMC officials, Revision of voter list

A special campaign pertaining to special summary revision of electoral rolls 2022 (Revision of voter list) will be held on November 6 and 7. As a part of the exercise, the GHMC officials will be available at all polling stations located in 15 Assembly constituencies of the Hyderabad district. New enrolments, change of name, address and other claims/objections can be reported to the officials at this campaign.

కొత్త ఓటర్ల నమోదు.. జాబితాలో సవరణలు, అభ్యంతరాలపై అవగాహన..

Posted: 11/06/2021 03:26 PM IST
Special electoral enrolment drive from november 6 in greater hyderabad

మీకు ఓటరుగా నమోదయ్యే0 వయస్సు తెలుసా.? పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదు కావచ్చునన్న విషయం తెలుసా.? అయితే మీకు ఆ వయస్సు వచ్చిందా.? లేక వచ్చినా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎవరన్ని కలవాలి, ఎక్కడ నమోదు చేసుకోవాలి.. అన్న వివరాలు తెలియక నమోదు చేసుకోలేదా.? లేక మీ ఓటు తొలగించబడిందా.? ఆ తరువాత దానిపట్ల అసక్తి లేకపోవడంతో మీరు మళ్లీ నమోదు చేసుకునే ప్రయత్నాలు చేయలేదా.? అయితే ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో ఓటు హక్కు అన్న విషయం తెలుసా.?.

 ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలంటే ప్రతీ ఒక్కరు తమ ఓటు హక్కును తప్పక నమోదు చేసుకోవడమే కాదు.. ఎన్నికలలో వినియోగించుకోవాలి కూడా. అప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం పరఢవిల్లి ప్రభుత్వాలు ప్రజారంజక పాలనను అందించేందుకు దోహదపడతాయి. ఇవన్నీ సరే కానీ.. ఓటరుగా నమోదు చేసుకోవడం ఎలా.? అంటారా.? ఓటర్ల జాబితా సవరణకు శని, ఆదివారాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇందులో భాగంగా ఇవాళ, రేపు పోలింగ్‌ బూత్‌ల వద్ద బీఎల్‌వోలు అందుబాటులో ఉంటారని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటర్ల జాబితాలో సవరణలు, మార్పులు, చేర్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించామని, అందరూ ఉపయోగించుకోవాలని తెలిపింది.

2022, జవనరి నాటికి 18 ఏండ్లు నిండినవారు ఓటర్లుగా తమ పేరును నమోదుచేసుకోవచ్చని పేర్కొన్నది. ఆన్‌లైన్‌లో కూడా ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, నమోదుకు అవకాశం కల్పిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఆన్‌లైన్‌ ద్వారా మార్పులు, చేర్పులు చేసుకోవాలనుకున్నవారు www.ceotelangana.nic.in, www.nvsp.in వెబ్‌సైట్లు చూడవచ్చని తెలిపారు. ప్రతి ఏడాది ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్నికల కమిషన్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఏటా జనవరి 18ని ఓటర్ల దినోత్సవంగా జరుపుకొంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles