Commercial LPG: cylinder to cost over Rs 2,000 in Delhi కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలకు రెక్కలు..

Commercial lpg cylinder price hiked by 266 no change for domestic use

lpg cylinder rate hike, commercial lpg cylinder rate hike, commercial lpg cylinder rates, lpg domestic rate, rs 266, LPG cylinder, Liquefied Petroleum Gas, Liquefied Petroleum Gas prices, commercial gas cylinder, non-subsidised cylinder, Oil companies

State-run oil marketing companies (OMCs) have steeply hiked commercial liquefied petroleum gas (LPG) cylinder rates by Rs 266 on Monday. A 19-kg commercial LPG cylinder will now cost Rs 2,000.50 in Delhi, up from Rs 1,734 earlier. It has also increased to Rs 1,950 in Mumbai, Rs 2073.50 in Kolkata and Rs 2,133 in Chennai.

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలకు రెక్కలు.. మంటపెట్టిన కేంద్రం..

Posted: 11/01/2021 01:14 PM IST
Commercial lpg cylinder price hiked by 266 no change for domestic use

దేశంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. దేశంలోని ప్రతీ ఒక్కరు పండుగలను చేసుకోవాలని గతంలో ప్రభుత్వాలు రేషన్ దుకాణల్లో కిరోసిన్, వంట నూనె, కందిపప్పు, శనగ పప్పు, చక్కర, ఇలా అనేక వస్తువులు చౌక ధరలకు అందించేవారు. ఇక సాధారణ సమయాల్లో వుండే కోటాకు.. పండగ వేళ్లల్లో కోటాను మరింత పేంచేవారు. తద్వారా దేశంలోని ప్రతీ పేదవాడు కూడా కనీసం పండగ రోజైనా మూడు పూటలా కడుపునిండ బోజనం చేయాలని ప్రభుత్వ ఉద్దేశంగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం పండుగ ఉద్దేశాలు పూర్తిగా మారింపోయాయి.

ఇప్పుడు సరిగ్గా అదును చూసుకుని దేశ ప్రజలందరూ పండగ పర్వదినాల గురించి అలోచించుకునే క్రమంలో చాపకింద నీరులా ఓ వైపు ఇంధన ధరలను అందనంత ఎత్తుకు పెంచుతూ పోతున్న కేంద్రం.. మరోవైపు గ్యాస్ ధరలను కూడా భారీగా పెంచింది. రేషన్ దుకాణాలను కేవలం చౌకధర బియ్యం కేంద్రాలుగా మార్చేసిన కేంద్రం.. ఈ కేంద్రంల్లో బియ్యం మినహాయించి ఏమీ ఇవ్వడం లేదు. ఇక అదే సమయంలో గ్యాస్ ధరలు రూ.100 మేర పెంచుతారని వార్తలు వినిపించాయి. అయితే తాత్కాలికంగా ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకన్న కేంద్రం.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను మాత్రం అమాంతం పెంచేసింది.

వాణిజ్య సిలిండర్‌ ధరను రూ.266కు పెంచేసిన కేంద్రం.. పెరిగిన ధరలను తక్షణం అమల్లోకి తీసుకువచ్చింది. అయితే సబ్సీడి ఎల్పీజీ సిలిండర్ల వినియోగదారులకు మాత్రం ఈ ధఫా సమీక్షలో ఊరట కల్పించింది. సబ్సీడీ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. తాజాగా పెంచిన ధరలతో కమర్షియల్‌ సిలిండర్‌ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.2000 మార్క్‌ను దాటింది. ఇంతకు ముందు ధర రూ.1735గా ఉండేది. ప్రస్తుతం రూ.2,175కు పెరిగింది. ముంబైలో 19 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1950, కోల్‌కతాలో రూ.2073.50, చెన్నైలో ధర రూ.2133కు చేరింది.  

వాణిజ్య సిలిండర్ల ధరలను వినియోగించే హోటల్స్‌, రెస్టారెంట్లపై దీని ప్రభావం విపరీతంగా పడింది. దీంతో దీపావళి పండుగ నేపథ్యంలోనే రెస్టారెంట్లు, హోటళ్లు కూడా ధరలను పెంచనున్నాయి. ఇప్పటికే డీజిల్ ధరల పెంపుతో నిత్యావసర సరుకుల ధరల ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కేంద్రప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పినా.. ధరల పెరుగుదలే తప్ప.. ఎక్కడా తగ్గింపు అన్న పదం వినబడటం లేదు. ఇప్పటికే కరోనా మహమ్మారి దెబ్బతో రెండు లాక్ డౌన్ పర్యాయాల్లో తీవ్రంగా నష్టపోయిన అతిధ్యరంగం గ్యాస్ ధరల పెంపుతో మరింత నష్టపోనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles