HC orders to retrospect on Anandaiah Eye drops హైకోర్టులో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు ఊరట

Dont reject quotting techinical snags hc orders to retrospect on anandaiah eye drops

Nellore Ayurvedic doctor Anandaiah, Krishnapatnam Ayurvedic doctor Anandaiah, Anandaiah Corona Ayurvedic medicine, High court, Anandaiah, Eye Drop corona medicine, Anandaiah eye drops, AP Government, Ayush, Andhra Pradesh, Politics

Hearing the petition of Nellore Krishnapatnam Ayurvedic doctor Anandaiah, who became very familiar with his self made corona drug during the second wave, the High Court had suggested the Andhra Pradesh Government to retrospect the medicine instead of quotting technical snags and stoping Anandaiah corona eye drop drug medicine.

ఆనందయ్య కంటిచుక్కల మందు ధరఖాస్తును పరిశీలించండీ: హైకోర్టు

Posted: 10/25/2021 04:25 PM IST
Dont reject quotting techinical snags hc orders to retrospect on anandaiah eye drops

కరోనా రెండో దశలో దాని ప్రభావానికి గురై పిట్టెల్లా రాలుతున్న ప్రజలకు కాసింత ధైర్యం వచ్చిందంటే అది కేవలం నెల్లూరు జిల్లా, కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కారణంగానే. ఆయన మందుతో లక్షల రూపాయలను పోసినా నయంకాని మహమ్మారి చటుక్కున నయమైంది. మరీ ముఖ్యంగా ఆయన కంటి చుక్కల వైద్యం ఎంతలా పనిచేస్తుందో అన్నది తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలందరూ టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారంలోనే వీక్షించారు. తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్లిన ఓ కరోనా రోగి.. కనులు తేలేసి వెళ్లినా.. అప్పటికే ఆయనను పోలీసులు నిర్భంధించినా.. ఆయన కంటి చుక్కల మందును స్థానికులు తెచ్చి రోగిని పడుకోబెట్టి కంటిలో వేశారు.

అంతే పది నిమిషాల్లో సదరు వ్యక్తి సాధారణ స్థితికి చేరుకున్నాడు. వచ్చేప్పుడు కళ్లు తేలేసి.. ఇక కొన్ని గంటలు మాత్రమే అన్నట్లుగా వచ్చిన రోగి.. కంటి చుక్కల మందుతో నిమిషాల వ్యవధిలో రోగం నుంచి తేరుకున్న విషయం తెలిసిందే. ఆయనపైనా.. ఆయన మందుపైనా ఎంతో నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో ప్రముఖులు మందును తీసుకెళ్లారు. వారు దానిని వాడినా.. ధైర్యంగా తాము ఆయన మందును వాడామని ముందుకు చెప్పలేకపోవడం.. దీనికి తోడు కృష్ణపట్నానికి రోజూ వేల సంఖ్యలో రోగులు రావడంతో అక్కడ జనసందోహం పెరిగపోయింది. దీంతో ఆయన మందు శాస్త్రీయతపై రంగంలోకి దిగిన ఆయుష్ విభాగం కూడా పరిశీలనలు చేసి.. కంటి చుక్కల మందుకు మాత్రం అంక్షలను విధించింది.

దీంతో తన కంటి చుక్కల మందుకు అనుమతుల అంశంపై హైకోర్టును ఆశ్రయించాడు ఆనందయ్య. ఈ క్రమంలో ఇవాళ ఆయన దాఖలు చేసిన పిటీషన్ పై ఇవాళ రాష్ట్రోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. తాను తయారు చేసే కంటి చుక్కల మందుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరానని ఆనందయ్య తెలియజేశారు. ఈ పిటీషన్ పై విచారించిన న్యాయస్థానం వెంటనే ఆనందయ్య ధరఖాస్తును పరిశీలించాలని అదేశించింది. అంతేకాదు సాంకేతిక కారణాలు చెప్పి దానిని నొక్కిపెట్టే ప్రయత్నాలు చేయరాదని.. తిరస్కరించాలని ప్రయత్నాలు చేయకూడాదని న్యాయస్థానం పేర్కోంది.

అంతకుముందు ఈ పిటిషన్ హైకోర్టులో ఆసక్తికర వాదోపవాదాలు జరిగాయి. ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్టు ఆనందయ్య తన పిటిషన్ లో వివరించినా.. అసలు, ఆనందయ్య ప్రభుత్వానికి ఇంతవరకు దరఖాస్తు చేసుకోలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై ఆనందయ్య న్యాయవాది స్పందిస్తూ, ప్రభుత్వానికి చేసుకున్న దరఖాస్తును, అందుకు ప్రభుత్వం వెలిబుచ్చిన స్పందనను కోర్టుకు సమర్పించారు. అనంతరం ప్రభుత్వ న్యాయవాది తమ వాదనలు కొనసాగిస్తూ, ఆనందయ్య కంటి చుక్కల మందు ప్రమాదకరం అని వెల్లడించారు.

దీంతో వాదనలు కొనసాగుతున్న తరుణంలో న్యాయస్తానం జోక్యం చేసుకుంది. ప్రభుత్వం తరపు న్యాయవాదిని సూటిగా కొన్ని ప్రశ్నలు వేసింది. ఆనందయ్య మందు కారణంగా ఎందరు చనిపోయారు? కరోనా వల్ల ప్రభుత్వాసుపత్రుల్లో ఎందరు చనిపోయారు? అంటూ ప్రశ్నించింది. ఆనందయ్య వైద్యం చేయడానికి లేదా ఆయన తన మందుకు ఒక్క రూపాయిని కూడా తీసుకోవడం లేదని. లక్షల రూపాయలల్లో డబ్బులు చెల్లించుకున్న ఆసుపత్రుల్లోని రోగుల ప్రాణాలకే రక్షణ లేకుండా పోయిందని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో ఆనందయ్య దరఖాస్తును వెంటనే పరిశీలించాలని, సాంకేతిక కారణాలు అడ్డుచెప్పి దరఖాస్తును తిరస్కరించవద్దని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh