TDP leaders placed under house arrest amid state bandh కొనసాగుతున్న రాష్ట్ర బంద్.. టీడీపీ నేతల అరెస్టులు

Tdp leaders placed under house arrest against protests amid state bandh

AP Bandh, TDP, Nara Chandrababu Naidu, TDP offices ransacked, Mangalagiri TDP Office vandalised, AP State Bandh, Kakinada Latest News, AP News, Andhra Pradesh Bandh, Prakasam Bandh, East godavari Bandh, West Godavari Bandh, Visakhapatnam Bandh, Ongole bandh, MP Ram Mohan Naidu, Andhra Pradesh Crime

In the wake of the call for AP Bandh given by TD Supremo Nara Chandrababu Naidu the police swung into action and made house arrests of the TD leaders and activists in the district. Senior TDP leader and Rajamahendravaram Rural MLA Gorantla Butchaiah Chowdary was house arrested at his residence at Rajamahendravaram on Wednesday.

ITEMVIDEOS: టీడీపీ కార్యాలయాలపై దాడికి నిరసనగా.. కొనసాగుతున్న రాష్ట్ర బంద్

Posted: 10/20/2021 11:24 AM IST
Tdp leaders placed under house arrest against protests amid state bandh

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ నిన్న ఉదయం ఓ టీవీ చానెల్ డిబేట్ లో అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆకస్మికంగా రాష్ట్రంలోని టీడీపీ కార్యాలయాలతో పాటు అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఇంటిపై కూడా నిన్న సాయంత్రం కొందరు అగంతకులు ఒక్కసారిగా దాడులకు దిగారు. ఏకకాలంలో రాష్ట్రంలోని పలు నగరాల్లో తమ కార్యాలయాలపై జరిగిన దాడులకు నిరసనగా టీడీపీ ఇవాళ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బంద్ కొనసాగుతోంది.

కాగా టీడీపీ బంద్ ను విఫలం చేసి.. రాష్ట్రంలోని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకునేలా పోలీసులు చర్యలు చేపట్టారు.ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన నేతలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలిస్తున్నారు. శ్రీకాకుళంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు. పలాస ఆర్టీసీ డిపో వద్ద ఆందోళనకు దిగిన నేతలను అరెస్ట్ చేశారు.

రాజాంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావును గృహ నిర్బంధం చేశారు. విశాఖపట్టణంలోనూ పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్‌తోపాటు 10 మంది నేతలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. టీడీపీ కార్పొరేటర్ ముక్కా శ్రావణి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోనూ టీడీపీ నేతలు నిరసనలకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును పోలీసులు గృహనిర్భంధంలో పెట్టారు.

 పశ్చిమగోదావరి జిల్లా దుగ్గిరాలలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరులో బడేటి చంటి, భీమడోలులో గన్ని వీరాంజనేయులు, పెడనలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాగిత కృష్ణప్రసాద్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇక గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమను అరెస్ట్ చేశారు. నరసరావుపేటలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అరవిందబాబును అరెస్ట్ చేసి శావల్యాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ఆందోళనకు దిగిన టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ నేతల ఆందోళనతో పలుచోట్ల జాతీయ రహదారులపై వాహనాలు నిలిచిపోయాయి.

రాయలసీమలోనూ టీడీపీ నేతల అరెస్ట్, గృహనిర్బంధాలు కొనసాగాయి. మైదుకూరులో టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ బీటెక్ రవి, నేతలు అమీర్‌బాబు, హరిప్రసాద్, లింగారెడ్డి, పుత్తా నరసింహారెడ్డిలను గృహ నిర్బంధం చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జ్ తిక్కారెడ్డి, ఆలూరులో కోట్ల సుజాతమ్మ, కర్నూలులో టీడీపీ నేత సోమిరెడ్డి వెంకటేశ్వర్లు, డోన్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కేఈ ప్రభాకర్, నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మల్సీ ఫరూక్, బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి తదితరులను హౌస్ అరెస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles