'unlucky couple' won Rs 31 cr in lottery but lost ticket భార్యభర్తలను విడదీసిన రూ.31 కోట్ల లాటరీ టికెట్..

Unlucky couple once won rs 31 crore in a lottery but lost their ticket

Couple, unlucky couple, UK Unlucky couple, Britain Unlucky couple, unlucky couple won Rs 31 cr lottery, unlucky couple lost lottery ticket, Lost lottery ticket, UK, Couple split, unlucky couple divorced, Rs 31 cr lottery, lost lottery ticket, Couple split, divorced, odd news, weird news

The story dates back 20 years when Martyn and Kay used to play the lottery every week. One day, they saw a notice that asked regular lottery players using their regular numbers to come forward to claim prizes. Much to their surprise, their numbers all added up. But they couldn't take home anything because they couldn't find the winning ticket.

రూ.31 కోట్ల బంపర్ ప్రైజ్ మనీ గెలిచారు.. కానీ చేజార్చుకున్నారు..

Posted: 10/19/2021 06:39 PM IST
Unlucky couple once won rs 31 crore in a lottery but lost their ticket

లాటరీ టికెట్ కోనడం కొందరు అలవాటుగా మార్చుకుంటారు. అలవాటులో పోరబాట్లు కూడా జరుగుతుంటాయి. అలా పోరబాటుగానో లేక గ్రహపాటుగానో ఇలాంటి అలవాటే వున్న ఓ మహిళకు లాటరీ తగిలింది.  ఇది ఇప్పుడు అనుకుంటున్నారా.. కాదు రెండు దశాబ్దాల క్రితం అంటే 2001వ సంవత్సరంలో. అయితే లాటరీ నిర్వాహకులు తమ నెంబర్లు సరిగ్గా చూసుకున్న తరువాత విజేతలు వారి టికెట్లతో తమ వద్దకు రావాలని ప్రకటించారు. ఇంకేమని సదరు మహిళ వెళ్లి ఏకంగా లాటరీ నెంబర్ చూసుకుంది. తమ టాటరీ టికెట్ బంపర్ ప్రైజ్ తగిలిందని సంబరపడింది.  ఏకంగా రూ. 31 కోట్ల రూపాయల లాటరీ ప్రైజ్ మనీ వీరు గెలిచారు.

ఇంతవరకు బాగానే వుంది. అయితే ఉర్దూలో ఓ సామెత ఉన్నట్లు దానే దానే పర్ లిక్ కే రహతే ఖానే వాలే కా నామ్ అన్నట్లు.. లేక అదృష్టం అర కిలోమీటరు చేరువకు చేరుకునే లోపు దురదృష్టం అంటిపెట్టేసుకుంటోందన్నట్లు ఈ మహిళకు దేవుడు లాటరీ టికెట్ విజేతగా నిలిపినా.. వీరి దరదృష్టం మాత్రం వీరిని కష్టాలు, కన్నీళ్లు, చివరకు నిట్టనిలువునా విడిపోయేందుకు కారణమైయ్యింది. అదేంటి సరిగ్గా చెప్పండీ ఏం జరిగిందో..? అంటారా.. ఏముందు లాటరీ టికెట్ ఎక్కడ పెట్టారో గుర్తురాలేదు. దీంతో అది దొరకలేదు.

అయితే తామే ఈ టికెట్ గెలిచామని గెలిచిన వారి నుంచి ఆన్ లైన్ నుంచి డేటా తీసుకెళ్లినా లాటరీ నిర్వహకులు మాత్రం.. టికెట్ పోయిందని అంటున్నారు కాబట్టి మీకు మరో 30 రోజుల వ్యవధిని ఇస్తున్నాం. ఈ లోగా లాటరీ టికెట్ తీసుకువచ్చి డబ్బును తీసుకెళ్లండీ అంటూ చెప్పారు. టికెట్ లేనిదే తాము డబ్బు ఇవ్వలేమని తమ నిబంధనలను మరోమారు సుస్పష్టం చేశారు. దీంతో తమ లాటరీ డబ్బును ఎగవేసేందుకు లాటరీ నిర్వాహకులు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని, లాటరీ టికెట్ తామే తీసుకున్నామని టికెట్ కాకుండా ఇతర ఆధారాలు కూడా చూపినా పట్టించుకోవడం లేదని వారు న్యాయపోరాటం కూడా చేశారు.

ఐదేళ్ల పాటు న్యాయపోరాటం చేసిన తరువాత కూడా విజయం అందుకోలేకపోయారు. ఇక ఈ లాటరీ టికెట్ గెలిచినా ప్రైజ్ మనీ మాత్రం అందుకోలేకపోయామని వారిలో బాధ మాత్రం మిగిలిపోయింది. లాటరీ టికెట్ అదృశ్యం కావడానికి నువ్వ కారణమంటే నువ్వే కారణమంటూ ఒకరినోకరు నిందించుకున్నారు. ఇక న్యాయపోరాటానికి ఉన్న డబ్బంతా ఊడ్చిపెట్టామని వారి మధ్య మాటల తూటాలు కూడా పేలాయి. ఇలా ఎందుకోచ్చిందో తెలియదు కానీ లాటరీ టికెట్ వారిని నిట్టనిలువునా విడదీసి విడాకులు తీసుకునేలా చేసింది. ఇంతకీ వీరెవరూ అంటారా.. అతని పేరు మార్టిన్ టాట్, అమె పేరు కే. లాటరీతో జీవితాలు బాగుపడ్డ జంటను చూసిన బ్రిటెన్ వాసులు.. గెలిచినా వీధినపడ్డ వీరిని దరదృష్ట జంటగా పరిగణించడం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles