RSS in Chhattisgarh is guided from Nagpur: Bhupesh ఆర్ఎస్ఎస్ ను నక్సల్స్ తో పోల్చిన చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ భగల్

They are controlled the same way chhattisgarh cm bhupesh baghel compares rss with naxals

RSS Naxals, RSS naxals, Rashtriya Swayamsevak Sangh, Naxals, Chhattisgarh, Bhupesh Baghel, Mohan Bhagwat, vinayak savarkar, raman singh, muslim league, chhattisgarh, bhupesh baghel

Chhattisgarh Chief Minister Bhupesh Baghel on Wednesday equated the Rashtriya Swayamsevak Sangh with the Naxals, and said that “the way the left-wing extremists active in his state are dictated by their senior cadres” from neighbouring states, the same way RSS workers are controlled from Nagpur, the Sangh headquarters.

ఆర్ఎస్ఎస్ ను నక్సల్స్ తో పోల్చిన చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ భగల్

Posted: 10/14/2021 07:33 PM IST
They are controlled the same way chhattisgarh cm bhupesh baghel compares rss with naxals

అర్బన్ టెరరిజం అంటూ ప్రధాని నరేంద్రమోడీ నక్సలైట్లను ఉద్దేశించి గతంలో చేసిన కీలక వ్యాఖ్యలను గుర్తుపెట్టుకున్నారో ఏమో తెలియదు కానీ.. ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలను కూడా నక్సలైట్లతో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన తెలుగు రాష్ట్రాలపై కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మావోయిస్టు నేతలను ఆయన టార్గెట్ చేశారు. ఆర్ఎస్ఎస్ను నక్సలైట్లతో పోల్చిన ఆయన.. తెలంగాణ, ఏపీకి లింకులు పెట్టారు.

తెలుగు రాష్ట్రాలలోనే మావోయిస్టు నేతలు అధికంగా వున్నారని, వారు తమ రాష్ట్రంలోని నక్సలైట్లకు అదేశాలను జారీ చేసి.. మావోయిస్టుల కార్యకలాపాలు నిర్వహించేలా చేస్తున్నట్లుగానే.. నాగ్ పూర్ వేదికగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకులు కూడా తమ రాష్ట్రంలో కార్యకలాపాలను సాగేలా చేస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. నాయకుల ఆదేశాల ప్రకారమే ఛత్తీస్ గఢ్ లో అరాచకాలకు పాల్పడుతున్నారని కామెంట్ చేశారు. తెలంగాణ, ఏపీల్లోని నక్సలైట్ నాయకులు ఇచ్చే ఆదేశాలతో.. ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు అకృత్యాలకు తెగబడినట్టే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలూ పాలనకు విఘాతం కలిగిస్తున్నారని అన్నారు.

తెలంగాణ, ఏపీల్లో నక్సల్ నాయకులున్నారని, ఛత్తీస్ గఢ్ లో నక్సలిజాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. కబీర్ ధాం జిల్లాలోని కావర్దాలో గతవారం జరిగిన అల్లర్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నర్ అనుసూయి ఉయికే రాసిన లేఖకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుందన్నారు. రాష్ట్ర అభ్యున్నతికి పదిహేనేళ్లలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేసిందేమీ లేదన్నారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. తీవ్రవాద భాష మాట్లాడుతున్నారంటూ ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles