KCR betraying people of Telangana: Ponnala బీజేపి విధాన తప్పదం దేశానికి నష్టం: పోన్నాల

Kcr s irresolute stand on water sharing harming telangana says former minister ponnala

Chief Minister K Chandrasekhar Rao, former Irrigation Minister Ponnala Lakshmaiah, Telangana power electricity crisis, Water dispute Telangana, CM KCR, former Irrigation Minister, Ponnala Lakshmaiah, Telangana power electricity crisis, Water dispute Telangana, power crises, coal crisis, Telangana

Alleging that Chief Minister K Chandrasekhar Rao’s unilateral decisions were harming the State, former Irrigation Minister Ponnala Lakshmaiah said the CM’s irresolute stand over the issue of water sharing was the reason behind Centre’s intervention in the matter.

కేసీఆర్ ఒంటెద్దు పోకడలు తెలంగాణకు శాపం: పోన్నాల లక్ష్మయ్య

Posted: 10/14/2021 11:48 AM IST
Kcr s irresolute stand on water sharing harming telangana says former minister ponnala

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒంటెత్తు పోకడలతో తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోందని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాలలక్ష్మయ్య అరోపించారు. సీఎం చర్యలతో చివరికి ఆయన తెలంగాణ ద్రోహిగా మిగిలిపోవడం ఖాయమని అన్నారు. నీటి పంపకాలపై ఆయన తీసుకున్న చర్యలు భవిష్యత్ తెలంగాణ తరాలకుశాపంగా పరిణమిస్తాయని ఆయన అన్నారు. రాష్ట్ర పరిధిలోని నీటి వ్యవహారాలపై కేంద్రం పెత్తనం ఏంటని ప్రశ్నించారు. కేంద్రం వద్దకు వెళ్లాల్సిన అవసరమేంటని నిలదీశారు. మసి పూసి మారేడుకాయ చేయగల కేసీఆర్ తెలంగాణ ద్రోహిగా నిలవడం ఖాయమని పొన్నాల విమర్శించారు.

నీటి పంపకాల విషయంలో కేంద్రం జోక్యానికి అవకాశం ఇస్తున్న తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలది తప్పేనని అన్నారు. అక్టోబరు 14 తెలంగాణకు బ్లాక్ డేగా నిలిచిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ హయాంలో జలయజ్ఞంలో భాగంగా ఒకేసారి 86 ప్రాజెక్టులు ప్రారంభించామని చెప్పిన ఆయన, కేసీఆర్ ఇప్పుడు వెలగబెట్టేదేముందని ప్రశ్నించారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం వల్ల ఏమాత్రం లాభం జరిగిందో చెప్పాలని పొన్నాల డిమాండ్ చేశారు. కనీసం ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తినైనా కొత్తగా సాధించారా.? అని నిలదీశారు.

ఇక లక్షకోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వర ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికైనా కేసీఆర్ సర్కార్ నీటిని అందించగలిగారా అని ప్రశ్నించారు. తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం కేసీఆర్ కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తున్నారే తప్ప చేపట్టిన ప్రాజెక్టులతో ఏం లాభం చేకూరిందో ఇప్పటి వరకు ఆయన చెప్పలేకపోతున్నారని విమర్శించారు. ఇక దేశం ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభంపై మాట్లాడుతూ.. ఇది పూర్తిగా బీజేపి విధానంలో తప్పిదమేనని విమర్శించారు. బొగ్గు లేక దేశవ్యాప్తంగా పలు పవర్ ప్లాంటులు మూతపడుతున్నాయని, బీజేపీ ఎన్ని అబద్ధాలు చెబుతున్నా నిజం ఏంటో ప్రజలకు తెలుసని అన్నారు. కేంద్రంలోని ప్రభుత్వం రాజకీయాలపై అధిక దృష్టిసారించి పాలనను గాలికి వదిలేయడం కారణంగా పరిస్థితులు ఇలా తారుమారయ్యాయని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles