Three killed in shooting at US post office అగ్రరాజ్యంలో ఇద్దరిని బలితీసుకున్న తుపాకీ సంస్కృతి

Three tennessee postal employees killed in post office shooting authorities say

U.S. Postal Inspector Susan Link, Memphis shooting, Memphis postal facility, Tennessee shooting, West Tennessee shooting, East Lamar Carrier Annex, Pentagon locked down, gunshots at poastal facility, US postal facility, employees, Gun firing, Postal sevice, US gun violence, America, Crime

Two U.S. Postal Service workers were fatally shot Tuesday at a postal facility in Memphis and a third employee identified as the shooter died from a self-inflicted gunshot, authorities said. It was the third high-profile shooting in or near that west Tennessee city in weeks.

అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం.. ఇద్దరు పోస్టల్ ఉద్యోగుల మృతి

Posted: 10/13/2021 11:45 AM IST
Three tennessee postal employees killed in post office shooting authorities say

అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. గన్ కల్చర్‌ పై ఎప్పటికప్పుడు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నా.. ప్రభుత్వం మాత్రం ఈ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతూనే వుంది. ఫలితంగా అమాయక అమెరికా వాసులు తుపాకీ గుళ్లకు బలికావాల్సవ వస్తోంది. మనస్తాపానికి గురైన ప్రతీ వ్యక్తి వెంటనే వెళ్లి తుపాకీ తీసుకుని వచ్చి తన సహచరులపై కాల్పులకు తెగబడటం అమెరికాలో ట్రెండ్ గా మారింది. ఉగ్రమూకల చర్యల కంటే తొటి అమెరికన్ల చేతిలో కాల్పులకు బలవుతున్నవారి సంఖ్య రానురాను పెరుగుతోంది.

దీంతో అభంశుభం తెలియని అమాయక చిన్నారులు కూడా ఇదే సంస్కృతిని అలవర్చుకుంటున్నారు. ఇటీవల టెక్సాస్ లోని ఓ పాఠశాలలో తోటి విద్యార్థుల చర్యలతో మనస్తాపానికి గురైన విద్యార్థి.. మరుసటి రోజు తుపాకీని తీసుకువచ్చి.. తన సహచర విద్యార్థులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఇలాంటి ఘటనతో అమెరికాలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరిని ఎవరు మనస్తాపానికి గురిచేశారో.. ఎవరు ఎవరిపై ఎప్పుడు కాల్పులకు తెగబడతారో కూడా తెలియక ప్రజల్లో అభద్రతా భావం నెలకోంది. తాజాగా ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోస్టల్‌ సర్వీస్‌ ఉద్యోగులు మరణించారు.

అమెరాకలోని మెమ్ ఫిస్ లోని టెన్నెస్సీ పోస్టాఫీస్లో ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో యూఎస్‌ పోస్టల్‌ సర్వీస్‌ ఉద్యోగులు ఇద్దరు చనిపోయారు. అయితే కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా పోస్టల్‌ ఉద్యోగే అని పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ సుసాన్‌ తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతనికోసం పోలీసులు గాలిస్తున్నారని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. అమెరికాలో కాల్పులకు పాల్పడటం సర్వ సాధారణమైపోయింది. దేశంలో ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో దుండగులు తుపాకీతో విరుచుకుపడుతూనే ఉంటారు. ప్రజలు విచ్చలవిడిగా తుపాకుల ఉపయోగించకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Memphis shooting  Tennessee shooting  US postal facility  employees  Gun firing  Postal sevice  America  US  

Other Articles